అతుకుల బొంత ఆరంభం!


మన కథ శంకర రావు గారి ఇంట్లో మొదలవుతుంది. శంకర రావు గారు రిటైర్ ఐన ప్రభుత్వ ఉద్యోగి. మధ్య తరగతి కుటుంబీకుడు. ఆయనతో పాటు ఆయన ఇంట్లో ఆయన సతీమణి పార్వతమ్మ, కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆయన చిన్న కొడుకు కుమార్, ఇంటర్మీడియేట్ చేస్తున్న చిన్న కూతురు దేవి ఉంటారు. పెద్ద కొడుకు గణేశ్ హిండియన్ ఆర్మీలో పని చేస్తాడు. పెద్ద కూతురు దుర్గ అరెమికాలో తన భర్తా, పిల్లలతో ఉంటుంది. రెండవ కొడుకు వీరభద్ర మిడిల్ ఈస్ట్‌లో ఉన్న ధబీ ధబీలో పని చేస్తున్నాడు.

శంకర రావు గారు నివసించేది ఆదరా బాదరా మహా నగరంలో. ఆదరా బాదరా, అంధేరా ప్రదేశ్ మరియు బృందగానాలకి ఉమ్మడి రాజధాని. బృందగానలో బృ.రా.స పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడి ముక్కు మంత్రి, అదే ముఖ్య మంత్రి, వీ.సీ.ఆర్. అంధేరా ప్రదేశ్‌లో తెగులు దేశం పార్టీ అధికారంలో ఉంది. అక్కడి మాఫీ మంత్రి, అదే ముఖ్య మంత్రి సూర్యబాబు నాయుడు. హిండియా ప్రధాన మంత్రి సురేంద్ర మోడీ. ప్రస్తుతానికి ఈ బ్యాక్ గ్రౌండ్ చాలు.

మన తెగులు రాష్ట్రాల చుట్టు పక్క రాష్ట్రాలు, గేరళ, తడిలేని నాడు, హర్-నాటక గురించి, అలాగే హిండియా పొరుగు దేశాలు, ఛీ లంక, పీకిస్తాన్, ఖంగాల్ దేశ్, నైచా గురించి తరువాత వివరంగా మాట్లాడుకుందాం.

ఇక కథలోకి వద్దాం. పొద్దున ఏడు గంటలయ్యింది. శంకర్రావు గారు మొదటి కప్ కాఫీ తాగుతూ ఛాఛీ పేపర్ చదువుకుంటున్నారు. ఇంతలో పక్కింటి కేశవ రావు గారు వచ్చారు. ఆయన కూడ ఒక రిటైర్డ్ ఉద్యోగే. ఎటొచ్చి శంకర్రావు గారు రాష్ట్ర ప్రభుత్వానికి పని చేసి రిటైర్ ఐతే, కేశవ రావు గారు కేంద్ర ప్రభుత్వానికి పని చేసి రిటైర్ అయ్యారు.

‘హలో శంకర్రావు గారు? ఎలా ఉన్నారు?” కుశల ప్రశ్నలతో మొదలు పెట్టాడు కేశవ రావు.

“ఆ ఏముంది, అంతా మామూలే, ఇప్పుడే బీపీకి, సుగర్‌కి, కొలొస్ట్రాల్‌కి మందులు వేసుకున్నాను. మా ఆవిడ దయ తలచి కాఫీ ఇచ్చింది. తాగుతూ పేపర్ చదువుతున్నా. ఇంతలో మీరొచ్చారు,” డైరీలో దినచర్యలా చెప్పారు శంకర్రావు గారు.

“ఆయన మాటలు నమ్మకండి అన్నయ్య గారు, అసలు ఆయనకి ఉదయాన్నే కాఫీ ఇచ్చే వరకు నన్ను ఏ పనీ చేయనివ్వరు,” వంట గదిలోంచే కేకేసి చెప్పింది పార్వతమ్మ.

“ఆ మాట కేశవ రావు గారు నమ్మాలి అంటే, మా ఇద్దరికి చెరో కప్పు కాఫీ మళ్ళీ తీసుకు రావాలి,” తెలివిగా మెలిక పెట్టారు శంకర్రావు గారు.

తనలో తాను గొణుక్కుంటూ మళ్ళీ కాఫీ పెట్టడానికి ఉపక్రమించారు పార్వతమ్మ గారు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

5 Responses to అతుకుల బొంత ఆరంభం!

 1. Jitu says:

  Cliffhanger? Nice!

  • Murali says:

   I will try my best to end every episode with a cliffhanger to do justice to the ‘serialized story” concept. 🙂

 2. kinghari010 says:

  హీరో పేరు వంకర రావు అని ఉంతే మిగతా పేర్లతో మ్యాచంగుగా ఉండేదేమో?!ప్రాంతాల పేర్లు మార్చినప్పుడు మనుషుల పేర్లు మార్చకపోతే ప్రాంతాలు మిమ్మల్ని దవెషించే ప్రమాదం ఉంది మరి?!

  • Murali says:

   హరి గారు,

   ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టద్దు. తప్పు!

   • kinghari010 says:

    తప్పా?ప్రాంతీయ ద్వేషాలు రెచ్చ్గొట్టి నేను కూడా ఓ బుల్లి రాష్ట్రానికి ముఖ్యమంత్రినై పోదామని వీసీఆర్ మహాశయుడి దారిలో వెళ్ళాలని ఆశపడుతుంటే నా ఆశల మీద నీళ్ళు జల్లటమే తప్పు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s