దుర్గ ఎంట్రీ


“అదేంటి నాన్నా, నేను పెద్ద దాన్ని అయినంత మాత్రాన నీ కూతురిని కాకుండా పోతానా. నేను నీకు ఎప్పుడూ డుగ్గూనే నాన్నా!” కాస్త నిష్టూరంగా అంది దుర్గ.

“నీ ఆఫర్‌కి చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ నేను నిన్ను దుర్గ అనే పిలుస్తా. అది మా అమ్మ పేరు కూడా!”

“అంతే లెండి, మీకు దేవి అంటేనే ఇష్టం. అందుకే నాకు ఈ అరెమికా సంబంధం తెచ్చి నన్ను వదిలించుకున్నారు.”

“చూడమ్మాయి, అలా లాజిక్ లేకుండా మాట్లాడకు. దానికి కూడ అరెమికా సంబంధమే చూస్తానేమో అబ్బాయి మంచివాడైతే.”

“వద్దు లెండి నాన్నా, అది అక్కడ ఉంటేనే మంచిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి రావచ్చు. నాలా ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టున ఉండొచ్చు.”

“నువ్వూ ఇంటి పట్టున ఉండు. ఎవరొద్దన్నారు?”

“మీ అల్లుడు గారు! అసలు నేనెప్పుడైనా ఉద్యోగం మానేయాలని ఉంది అంటేనే టెన్షన్ పడి పోయి గోళ్ళు కొరికేసుకుంటారు. అందుకనే, ఆయన వేళ్ళు కూడా కొరుక్కునేంత లోపల నేనే, మానెయ్యను లెండి అని మళ్ళీ చెప్పేస్తాను. ఒక రకంగా ఆయన చెప్పేది కూడా నిజమే. ఇక్కడ మంచి లైఫ్ కావాలంటే, ఇద్దరం పని చేయాల్సిందే.”

“ఏమిటో అమ్మా, అక్కడి పరిస్థితి నాకు తెలీదు. అంత కష్టంగా ఉంటే హిండియాకి వచ్చేయండి. ఇక్కడ అల్లుడు గారికి ఉద్యోగాలు దొరక్కుండా పోతాయా?”

“కుదరదు లెండి నాన్నా. అసలు ఇక్కడికి రానే రాకూడదు. వచ్చాక మళ్ళీ బయట పడలేం. అందుకనే చెప్పింది దేవికి అరెమికా సంబంధం వద్దని.”

“దాని పెళ్ళికి చాలా టైం ఉందిలే. ఈ మధ్యలో కుమార్ గాడు ఎగిరెగిరి పడుతున్నాడు, అరెమికాలో మాస్టర్స్ చేస్తానని.”

“తమ్ముడు వస్తే నాకు బానే ఉంటుంది. మా ఖాళీఫోర్నియాలో కాలేజ్‌లకే అప్లై చేయమనండి.”

“అక్కడ బోలెడు ఖర్చటగా?”

“అదేం లేదు నాన్నా. మొదటి సెమిస్టర్ కాగానే, ఏదో ఒక జాబ్ దొరికి పోతుంది. అయినా మేమున్నాంగా!”

“నువ్వీ మాట అన్నట్టు తెలిస్తే వాడు రేపే విమానం ఎక్కినా ఎక్కేస్తాడు.”

“ఫర్లేదు లెండి. ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి నాన్నా, మాట్లాడి పెట్టేస్తాను.”

“అలాగే,” అంటూ పార్వతమ్మ గారికి ఫోన్ ఇచ్చారు శంకర్రావు గారు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

5 Responses to దుర్గ ఎంట్రీ

 1. Jitu says:

  Muraligaaru,

  Meeru posts chinnavi unntaayi ani warning ichheru, kaani mari ithaa chinnaa?? Idii peddavallu serial laa kaadu… maa pillalu chinnapudu ‘spongebob squarepants’ chooseewaaru. A kadhalu 9 nimishaalu maatrame undevi. Takku mani ayipoyevi. Mee posts kooda alaage unnaayi. Menu card chadivi, “to go” order ichinanatha time kooda pattadam ledu chadavdaaniki. Mari padi pageelu, ante ade… ’10 pages’, kaakapoyina, at least o rendu pageelena chadivinattu unte, baaguntunndi.

  • Murali says:

   Jitu గారూ, నా ఫ్లోకి అడ్డం పడకండి! 🙂

   • Jitu says:

    I am trying to increase the flow so that we get just a little bit more of your story each time. 🙂 🙂

 2. A Amun says:

  good one!!
  at last i found a correct name in your post 🙂
  దానికి కూడ అమెరికా సంబంధమే చూస్తానేమో అబ్బాయి

  • Murali says:

   Corrected. అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అంతా ప్రతిపక్షాల కుట్ర!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s