గోచీ పెట్టుకుంటే పూచీ నాది!


మరి ఇటు వీ.సీ.ఆర్. కార్యాలయంలో ఏం జరుగుతూందంటే…

“ఏంటో అన్నా, మనం మీటింగ్‌లకు కలిసినప్పుడు పాటించాల్సిన ఈ డ్రెస్ కోడ్ నాకు బిల్‌కుల్ నచ్చలేదు,” కంప్లెయిన్ చేశాడు బరిసెల రాజేందర్.

“ఎందుకు భై? బాగా ఆలోచించినంకనే ఈ డ్రెస్ కోడ్ పెట్టినం కద. మీరందరు కూడా ఒప్పుకుర్రు. ఇప్పుడేంది కిరి కిరి?” అన్నాడు వీ.సీ.ఆర్.

“అప్పుడు ఒప్పుకున్నం గాని, డ్రెస్ ఏసుకున్నంక అంత మంచిగనిపిస్తలేదన్నా,” తను కూడా వంత కలిపాడు నాయాల నరసింహా రెడ్డి.

“ఊకెనే కంప్లెయింట్ చేయొద్దు. ఇప్పుడు ఉన్న వాతావరణంల ఇట్లనే చెయ్యాలె,” స్థిరమైన గొంతుతో అన్నాడు వీ.సీ.ఆర్.

అక్కడ ఒక్క వీ.సీ.ఆర్. తప్ప మిగతా వారందరూ కేవలం గోచీలు మాత్రమే ధరించి ఉన్నారు.

“అసలే మనం స్టింగ్ ఆపరేషన్ చేసినమని, గా నాయుడు చాలా గుస్సా మీదున్నాడు. మనమేం మాట్లాడుతున్నామో రికార్డ్ చేయనికి, ఎవరన్న కోవర్ట్‌లను వాడొచ్చు. అందుకనె ఈ ఏర్పాటు. అసొంటి ఉద్దేశం ఉన్న భీ, ఈ డ్రెస్‌ల ఐతే క్యామెరా గానీ, మైక్రోఫోన్ గాని ఆ కోవర్ట్ సాలె గాడు యాడ పెడతడు?” ఇంకోసారి తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాడు బృందగానా ముఖ్య మంత్రి.

“మరి నువ్వు గోచీ పెట్టుకోలేదేందన్నా?” ప్రశ్నించాడు, వడియం శ్రీహరి.

“అరే! గదేం ఫాల్తూ మాటల్రా భై! నా పార్టీకి నేనే నిప్పెట్టుకుంటనా? నాకు ఈ డ్రెస్ కోడ్ వర్తించదు.”

“పోన్లె గానీ, మనం అందరం ఈడ ఎందుకు సమావేసం అయినమో జర జల్దీ చెప్ప రాదే! ఈ A.C.రూంల గిట్ల బట్టల్లేకుండా గోచి పెట్టుకుని కూసుంటే సల్లగ సలి వెడుతున్నది,” గజ గజా వణుకుతూ అన్నాడు బరిసెల రాజేందర్.

“గదే! మన బంగారు బృందగానా పథకంలో బీదోల్లందరికి రెండు జతల బట్టలు పెట్టే ప్రోగ్రాం డిసైడ్ చేసిన. దానికి కావల్సిన వనరులు, బడ్జెట్ గురించి మాట్లాడుకుందమని గీ మీటింగ్.”

“మంచిగుందన్న! మాతో బట్టలు ఇప్పించి బీదోల్లకు పంచి పెడతావా?” ఉక్రోశంగా అన్నాడు నాయల నరసింహా రెడ్డి.

“చిన్న పోరడి లెక్క మాట్లాడ్తవేంది రెడ్డి సాబ్! మీటింగ్ అయినంక కూడా మిమ్మల్ని గోచీలు పెట్టుకుని తిరగమంటున్ననా? ఒక వైపు ప్రతిపక్షాన్ని బలహీనం చేస్తూనే, మనం ప్రజల కోసం సంక్షేమ పథకాలు గూడా ప్రవేశ పెట్టాలె. బాబుకి ఊపిరాడకూడదు, ఏమనుకున్నవో మల్ల!”

“బాబు సంగతి దేవునికెరుక, గీ మీటింగ్ ఆయ్యేంతలో మా ఊపిరి ఆగకుంటె సాలు!” తనలో తాను గొణుకున్నాడు వడియం శ్రీహరి.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

2 Responses to గోచీ పెట్టుకుంటే పూచీ నాది!

  1. Anuradha says:

    😀

  2. Jitu says:

    LOL… We need more blog-screen-time for DVD … err… I mean VCR and his antics. 😀 😀 😀

    Full on entertainment! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s