పేరులోనే ప్రేముంది, ప్రేమతో పాటే పరీక్ష ఉంటుంది – 1


ఒక సారి మళ్ళీ శంకర్రావు గారి కుటుంబం ఏం చేస్తుందో చూద్దాం.

శంకర్రావు గారి చిన్న కూతురు దేవి కాలేజ్‌కి వెళ్ళడానికి తయారు అవుతూంది. ఒకప్పుడు ఆడపిల్లలు తయారు కావడమంటే చక్కగా జడ వేసుకుని బొట్టూ కాటుకా పెట్టుకోవడం జరిగేది. ఇప్పుడు కాలం మారిపోవడంతో, వాతవరణ కాలుష్యం పెరిగిపోవడంతో చర్మ సౌందర్యాన్ని, ఊపిరి తిత్తులని సంరక్షించుకోవడం ప్రతి యువతి ప్రధమ కర్తవ్యంగా మారింది.

ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దేవి కూడా సల్వార్ కమీజ్ ధరించిన తరువాత – ఒకప్పుడు ఓణీలు అనేవి ఉండేవి లెండి, అవి ఇప్పుడు కొన్ని మ్యూజియంలలో తప్ప ఎక్కడా కనపడవు – ఒక దుపట్టాని మాములుగా వేసుకుని, ఇంకో దుపట్టాని తల చుట్టూ హెల్మెట్‌లా చుట్టింది. ఇది ఎండనుంచి, దుమ్ము నుంచి మొహాన్ని కాపాడుకోవడం కోసం. ఆదరా బాదరలోని ధూళి కళ్ళల్లో పడకుండా సన్-గ్లాసెస్ పెట్టుకుంది. బట్టలు కవర్ చేయని భాగాలు – చేతులు లాంటి వాటికి – సన్-స్క్రీన్ దట్టించి రాసింది. రోడ్డున పడొచ్చు అన్న నమ్మకం కుదిరాక బయట వసారాలోకి వచ్చింది.

“యుద్ధానికి వెళ్తున్నట్టు తయారు అయ్యావు అంటే, కాలేజ్‌కి వెళ్తున్నావు అని అర్థం. అంతేనామ్మా?” అడిగారు శంకర్రావు గారు.

“అంతే నాన్నా,” అంటూ బయట పార్క్ చేసి ఉన్న జీ.వీ.ఎస్. గోగోని స్టార్ట్ చేసి బయట పడింది దేవి.

కాలేజ్‌కి వెళ్ళాక మొదటి క్లాస్ బయాలజీ. దేవికి డాక్టర్ అవుదామని ఆశయం. దానికి తగ్గట్టుగానే ఇంటర్మీడియేట్‌లో గ్రూప్ తీసుకుంది.

ఇంకా లెక్చరర్ రాలేదు. దేవి తను ఎప్పుడు కూర్చునే చోట కూర్చోగానే, ప్రేం కుమార్ అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టు దేవి దగ్గరకి వచ్చేశాడు. “హలో దేవి, నేను నిన్న పంపిన టెక్స్ట్ చదివావా? దానికి యాన్సర్ ఏంటి?” అంటూ.

దేవి అతనివైపు అసయ్యంగా చూసింది. “చూడు ప్రేం! మీ వాళ్ళు నీకా పేరు పెట్టారని నువ్వు అర్జెంట్‌గా ఎవరో ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోవాలనుకోవడం ఏం బాగో లేదు. ఐనా అదే మెసేజ్ ఎన్ని సార్లు పంపుతావు?” అడిగింది.

“అర్జెంటా? గత నెల నుండి నీకా మెసేజ్ పంపిస్తున్నా. ఇంత విశ్వాసంగా ఉండే బాయ్ ఫ్రెండ్ నీకు దొరుకుతాడా. మిగతా అబ్బాయిలు ప్రతి రెండు రోజులకు ఒక అమ్మాయి దగ్గరకు జంప్ అవుతారు. నేను అలాంటోణ్ణి కాదు. ఇంక ఒకటే మెసేజ్ అంటావా? నేను మాట మార్చే వాడిని కూడా కాదు. అందుకన్న మాట!” ఆవేశంగా అన్నాడు ప్రేం.

“ఏడ్చినట్టుంది. పైగా ఆ మెసేజ్ కూడా ఏంటి? ఒక చెత్త కవిత! I love you as much as the pollution in our city. Will you love me at least 10 percent of that, my beauty! పైగా గ్రామర్ కూడా సరిగ్గా లేదు. నేనే కరెక్ట్ చేసి చెప్తున్నా. అదేనా కవిత అంటే నీ దృష్టిలో?”

“rhyme అవుతూంది కద! అయినా, మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్‌ని కవితల ద్వారానే చెప్పగలం దేవి! అందుకే అలా రాశాను. ఇంతకీ నీ యాన్సర్ ఏంటి?”

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

One Response to పేరులోనే ప్రేముంది, ప్రేమతో పాటే పరీక్ష ఉంటుంది – 1

  1. eshwar says:

    ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దేవి కూడా సల్వార్ కమీజ్ ధరించిన తరువాత – ఒకప్పుడు ఓణీలు అనేవి ఉండేవి లెండి, అవి ఇప్పుడు కొన్ని మ్యూజియంలలో తప్ప ఎక్కడా కనపడవు – ఒక దుపట్టాని మాములుగా వేసుకుని, ఇంకో దుపట్టాని తల చుట్టూ హెల్మెట్‌లా చుట్టింది. Yekkadi nunchi pattukostharandi ee dailogues. Kya bath hai.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s