పేరులోనే ప్రేముంది, ప్రేమతో పాటే పరీక్ష ఉంటుంది – 2

“నేను కూడా నీలానే మాట మార్చే మనిషిని కాను. గత 29 సార్లు ఏం చెప్పానో, అదే చెప్తున్నా. I am not interested. నన్ను వదిలెయ్యి. అసలే ఈ రోజు సర్ టెస్ట్ పెడతామన్నారు. ఆ టెన్షన్‌లో నేనుంటే, నీ గోలేంటి?” విసుగ్గా అంది దేవి.

“ఆ టెస్ట్ గురించి ఆలోచించిన దానిలో పదో వంతు నా గురించి ఆలోచించినా నీకు అర్థమయ్యేది, నా ప్రేమ ఎంత పవిత్రమైనదో!”

“నా మాట విని నువ్వు కూడా టెస్ట్‌కి ప్రిపేర్ అవ్వు. ఇంకా గంట టైముంది. లేకపోతే ఫెయిల్ అవుతావు.”

“ఐతే అవుతాను. ప్రేమ కంటే అదేం గొప్పది కాదు.”

“నీ గొప్ప ప్రేమని నమ్ముకుని ఇలానే టెస్ట్‌లను పట్టించుకోకుంటే, సెకండ్ ఇయర్ చీదేస్తావు. ఆ తరువాత ఆ ప్రేమ తప్ప నీ దగ్గరేముండదు.”

“ప్రేమ అన్నిటినీ జయిస్తుంది.”

దేవికి నషాళానికంటింది. అంతలోనే కోపం అణుచుకుని ప్రేం కుమార్‌తో, “ఒక పని చేద్దాం. నువ్వు ప్రతి సోమవారం వచ్చి నీ ప్రేమని గెలిపించమని నన్ను రిక్వెస్ట్ చేస్తూండు. నేను నో అంటే మాత్రం మళ్ళీ వచ్చే సోమవారం వరకు నాతో మాట్లాడకూడదు. ఆ సోమవారం సెలవైనా, లేక ఒక వేళ మనం కలవక పోయినా, వచ్చే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలా నీకు పాతిక సార్లు అవకాశం ఇస్తాను. నీ ప్రేమ గొప్పదైతే 25 వారాల్లో నా మనసు మార్చు. ఏమంటావు?” అంది మృదువుగా.

“హాయ్! భలే ఉంది ప్రేమ పరీక్ష! అచ్చు సినిమాలలోలా! నాకు ఈ చాలెంజ్ ఇష్టమే. ఈ రోజు సోమవారం, కాబట్టి ఈ రోజు నుంచే మొదలు పెడదాం. ఇంతకి ఈ రోజుకి నీ యాన్సర్ ఏంటి?’ ఉత్సాహంగా అన్నాడు ప్రేం కుమార్.

“నో!”

ప్రేం కుమార్ సైలెంట్‌గా అక్కడినుండి వెళ్ళిపోయాడు.

అప్పుడే వచ్చిన రాధ దేవి పక్కన కూర్చుంటూ, “ఏంటే, మళ్ళీ సతాయిస్తున్నాడా?” అని అడిగింది.

“అవును, కానీ ఇక, ప్రతి రోజూ వచ్చి అడగడులే,” అంటూ తమ చాలెంజ్ గురించి చెప్పింది దేవి.

“25 వారాల స్పెషాలిటీ ఏంటే?” అడిగింది రాధ.

“ఏమీ లేదు. అప్పటికి ఈ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఆ తరువాత నేనెటో, వాడెటో! ఇక ఈ గోలుండదు.”

“భలే ఐడియా వేశావే!”

“పద కాస్త టెస్ట్‌కి రివైజ్ చేసుకుందాం.”

స్నేహితురాళ్ళు ఇద్దరూ పుస్తకాలు తీశారు.

ఇటు శంకర్రావుగారింట్లో, ఆర్మీ లీవ్ మీద వచ్చిన ఆయన పెద్ద కొడుకు గణేశ్ అడుగు పెట్టాడు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

3 Responses to పేరులోనే ప్రేముంది, ప్రేమతో పాటే పరీక్ష ఉంటుంది – 2

  1. Anuradha says:

    ఫ్యూచర్ లో (తరువాత పార్త్స్) ప్రేం కుమార్ యాసిడ్ లేదా కత్తితో దాడి చేస్తాడేమో అనిపిస్తుంది 🙂

    • Murali says:

      అలాంటి వెధవలు చాలా మందే ఉన్నారు కానీ, నా బ్లాగ్‌ని అంత వయొలెంట్‌గా చేయదల్చుకోలేదు.

      • kinghari010 says:

        నిజమే,అసలే అతుకుల బొంత కదా,వయొలెన్స్ యెక్కువైతే చిరిగిపోద్ది:-)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s