డిమాండ్-సప్లై థియరీ


“స్ట్రైకులు అనేవి ఎంత ముఖ్యమైనవో, జాతిని ఎలా మేల్కొలుపుతాయో చెప్తున్నాడురా,” వివరించారు పార్వతమ్మ గారు.

“అదే ఆర్మీలో అనుకో, ఇలా స్ట్రైకులు చేద్దామన్నా కుదరదు. బొత్తిగా క్రమశిక్షణ లేకుండా పోయింది సివిలియన్స్‌కి,” బాధ పడ్డాడు గణేశ్.

“ఇంతకీ, పెళ్ళి ఎప్పుడు చేసుకుండానుకుంటున్నావురా? ఈ రెండు వారాల్లో ఏవన్నా సంబంధాలు చూడనా?” అడిగారు పార్వతమ్మ.

“నన్నెవరు చేసుకుంటారే? ఆర్మీ అంటేనే మన వాళ్ళు ఆమడ దూరం పరిగెడతారు. పైగా ఇప్పటి అమ్మాయిలకు అరెమికా సంబంధాలు, ఒక వేళ హిండియా సంబంధాలు ఐతే, మినిమం ఏ ఇంజనీరో, డాక్టరో, లేదా ఏదో మల్టీ-నేషనల్ కంపెనీలో జాబ్ ఉన్న వాడో కావాలి.”

“మరీ చోద్యంగా మాట్లాడకురా. ఇంజనీర్లు, డాక్టర్లు కాని అబ్బాయిలెవ్వరికీ పెళ్ళిళ్ళు కావడం లేదా, ఏం?”

“అవుతున్నాయమ్మా, బోలెడ్ కాంప్రమైజ్ అయ్యాక అవుతున్నాయి. అన్నట్టు నీకొక ప్రశ్న. ఈ మధ్య అబ్బాయిలకు పెళ్ళి సంబంధాలు దొరకడం కష్టం అయినట్టు నీకేమైనా అనిపిస్తూందా?”

“నిజమేరా. ముందు ఆడపిల్లలకు దొరకడం కష్టం అయ్యేది. ఇప్పుడు మగాళ్ళకి కావడం కాస్త కష్టంగా ఉన్నట్టుంది. ఎందు చేతంటావు?”

“పాపానికి పరిహారం.”

“ఎవరి పాపంరా?”

“ఇది జాతి మొత్తం కలిసి చేసిన పాపమమ్మా. గత ఇరవయి ఏళ్ళుగా అల్ట్రా స్కాన్ పద్ధతి అందరికి అందుబాట్లో రావడంతో, మన హిండియా అంతటా, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలీగానే అబార్షన్లు చేయించడం మొదలు పెట్టారు. ఆ పాపం ఇప్పుడు పండుతూంది.”

“ఏంట్రా నువ్వు చెప్పేది?”

“ఇప్పుడు దాదాపు ఆరు కోట్ల మంది అమ్మాయిలు తక్కువ పడ్డారమ్మా మనకు. అంటే ఆరు కోట్ల అబ్బాయిలకు పెళ్ళి చేసుకోవడానికి సరి పడా అమ్మాయిలు మన దేశంలో లేరన్న మాట. నీకు డిమాండ్-సప్లై థియరీ తెలుసా?”

“అదేంటి?”

“ఏదన్నా వస్తువు తక్కువ దొరుకుతూంటే దానికి డిమాండూ, తద్వారా ఖరీదూ ఎక్కువ అవుతాయి. అదే వస్తువు కనక ఎక్కువ దొరికితే పరిస్థితి రివర్స్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! కూరగాయలు ఏరుకున్నప్పుడు ఎలా పుచ్చులని వదిలేసి మంచివి తీసుకుంటారో, అలాగే అమ్మాయిలు కూడా మా అబ్బాయిల్లో శ్రేష్టమైన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు.”

“అయ్య బాబోయి! ఇంత వరకు కెరియర్ కోసమో, మంచి జీవితం కోసమో అరెమికా వెళ్దామనుకున్నాను. ఇప్పుడు అర్థమయ్యింది. వాటి సంగతి దేవుడెరుగు, కనీసం పెళ్ళి కావడానికి అయినా సరే, నేను అరెమికాకి పోక తప్పదు,” తనలో తాను అనుకున్నాడు కుమార్.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

3 Responses to డిమాండ్-సప్లై థియరీ

 1. Jitu says:

  Sorry to be deviating a tad bit from your satire post. You speak of female feticide. I wanted to share something I learnt recently. There is a correlation between the rise in the usage of ultrasound to determine the gender of the fetus and destroying it, and the European Christian World domination idea. Population control was recognized as one of the tools by the Western world at the end of WWI or even before it, for controlling the third world. Since most countries colonized by the Europeans had, by the turn of 19th century, adopted the concept of direct male heir, which was not the case before… to get that male heir they were willing to have any number of kids ( and keep the daughters). Which in turn increased the population and that was considered detrimental to the expansion of Catholic Centric Western Civilization. So to take care of that, scientists were funded to find a way to discourage people from having kids. Thus ultrasound was developed and used for destroying female fetus thus keeping the population in control. For this reason… this social culture( of female feticide) is prevalent not just in India but in China and other third world countries too. Unfortunately for us, the ‘secular’ leadership in our country was sold to the socialist ideas and enforced the laws. The first few ultrasound clinics were supposedly funded by the Indira Gandhi Govt.

 2. Murali says:

  Interesting theory. What you said about China and other countries is very true, by the way. I am not sure how much of this was planned and implemented to the very last detail, but I can believe the European intellectuals plotting along these lines. After all, Max Muller translated Vedas not out of respect for them, but to understand them better, so he can debunk them. That’s how the imperialist mindset works…

  • Jitu says:

   It seems it was planned and implemented to the last detail, till the 70s at least. The article which in turn referred to some recent books, had detailed the rulers down to doctors/ scientists involved. My bad that I don’t remember the details. At our end… IG’s govt.’s involvement was what struck my mind. Such was the meticulous planning that it was considered fashionable to be able to go for sex determination by the rich intellectuals in the 70s. And it suddenly made sense in the grand scheme of things. Also, it made sense to give concessions to the religious minorities in India form the “Ham do, hamaare do” scheme. If it actually was meant for economy as advertised, no one should have been exempted.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s