కుక్కలని చూస్తే సరిపోతుంది


భోంచేశాక శంకర్రావు గారు, గణేశ్ టీవీ ముందు కూర్చుని న్యూస్ చానెల్స్ ఫ్లిప్ చేయసాగారు.

ఒక చానెల్ మీద సీతారం నీచూరి ప్రత్యక్షమయ్యాడు.

“ఈయన ఈ మధ్యనే ఎర్ర పార్టీ(M)కి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యాడు కదు?” అడిగాడు గణేశ్.

“అవును పైగా మన తెగులు వాడే, ఈయన వచ్చాక ఎర్ర పార్టీ ఇమేజ్ మెరుగు పడుతుందని చాలా మంది అనుకుంటున్నారు,” చెప్పారు శంకర్రావు గారు.

“ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న భోగా ఉత్సవాల గురించి మీ అభిప్రాయం?” ప్రశ్నించాడు ఒక విలేఖరి.

“ఇది సింధుత్వ వాదుల కుట్ర. భోగా అనేది సింధువులకు మాత్రమే సంబంధించింది. కాబట్టి మన హిండియా అంతా జరపడం ఇతర మతాల మీద రుద్దినట్టు అవుతుంది. సమత, నవత రెండు పాదాలుగా చేసుకున్న మా ఎర్ర పార్టీ ఈ అరాచకాన్ని ఎన్నటికీ సహించదు,” ఆవేశంగా అన్నాడు నీచూరి.

“అదే నిజమైతే 190 దేశాలు ఎందుకు ఈ రోజు భోగా ఉత్సవాలు చేస్తున్నాయి? అక్కడ సింధుత్వ పార్టీలు అధికారంలో లేవు కద?”

“మీరేమంటున్నారో నాకు వినపడ్డం లేదు. మా ఎర్ర పార్టీ వారు తమకి కావలసినదే వింటారు, కంటారు,” మొహంలో ఒక శూన్యమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు నీచూరి.

“సరే, భోగా వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందని, మానసిక స్థిరత్వం వస్తుందని పాశ్చాత్య దేశాల వారే ఒప్పుకుంటున్నారు కద. దానికేమంటారు?” అడిగాడు ఇంకో జర్నలిస్ట్.

“కావొచ్చు. కానీ ఎంతో మంది ప్రజలు ఆకలితో మాడిపోతూంటే, ఆ సంగతి చూడక, ఈ భోగాలేమిటి? అందరికి ఆకలి తీరాక ఇవన్నీ చేయొచ్చు.”

“మీ లాజిక్ ప్రకారం అందరికి ఆకలి తీరేవరకు అసలు ఇంకేం చేసినా దండగే. అంతేనా?”

“కరెక్ట్. ఇలాంటి సునిశితమైన మేధస్సు కలవారు మా ఎర్ర పార్టీకి చాలా అవసరం. మా పార్టీ మెంబర్‌షిప్ తీసుకుంటారా? ఒక ఎర్ర షర్టూ, ఎర్ర ప్యాంటూ మేమే మీకు ఉచితంగా ఇస్తాం.”

“అంత గౌరవం నాకొద్దు లెండి. భోగా ఉత్సవాల పట్ల మీకు ఇంకా ఏం అభ్యంతరాలు ఉన్నాయి?”

“మోడీ అంతమంది జనాన్ని ఢిల్లీ డాలీలో పోగు చేయడం ఒక నియంతని తలపిస్తూంది. ఇది కేవలం ప్రాధమిక అవసరాల నుంచి జనం దృష్టి మళ్ళించడానికే!”

“ఇదే ఢిల్లీ డాల్లీలో, అహ్మదీయులు ఇంత కంటే పెద్ద గుంపుల్లో, ప్రతి రోజూ తమ పెద్ద ప్రార్థనా మందిరం దగ్గర గుమి గూడుతారు కద! దాని గురించి ఏమంటారు?” ప్రశ్నించాడు మరొక విలేఖరి.

ప్రశ్న తనకు వినపడలేదు అన్నట్టు సైగలు చేశాడు నీచూరి.

“ఫైనల్‌గా ఈ భోగా ఉత్సవాలను మీరు వ్యతిరేకిస్తున్నారు, అంతేనా?” ఉమ్మడిగా అడిగారు అందరు జర్నలిస్టులు.

“అంతే! ఇంతోటి దానికి శిక్షణ శిబిరాలు, పెద్ద పెద్ద సమావేశాలు శుద్ధ దండగ. మీరు భోగా నేర్చుకోవాలంటే ఒక వీధి కుక్కని చూసినా చాలు. అది కూడా కాళ్ళూ చేతులూ విరుచుకుని దీర్ఘంగా ఊపిరి తీసుకుంటుంది.”

“ఒక వేళ భోగా చేద్దామనుకున్నప్పుడు, కుక్క కనిపించకపోతే?”

“అప్పుడు మా ఎర్ర లీడర్లు sick-ularism గురించి మాటాడేటప్పుడు ఎలా చేతులూ, మూతులూ ఊపుతూ విన్యాసాలు చేస్తారో గుర్తుకి తెచ్చుకుండి. అవి కూడా అచ్చం కుక్కల మూవ్‌మెంట్స్ లానే ఉంటాయి,” గర్వంగా చెప్పాడు నీచూరి.

“చూడబోతే ఈయన హయాంలో ఎర్ర పార్టీల పార్లమెంట్ ప్రజా ప్రతినిధుల సంఖ్య ఒకటికో, సున్నాకో పడి పోయేలా ఉంది,” చానెల్ మారుస్తూ అన్నారు శంకర్రావు గారు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

13 Responses to కుక్కలని చూస్తే సరిపోతుంది

 1. Jitu says:

  🙂 Timely post. LOL @ the comparison between dogs and pseudo-secularists. 😀

 2. నీహారిక says:

  విమర్శించడం కూడా ఒక ఆర్ట్ ! పుతిన్ గారు సింపుల్ గా మోడీ యోగా చేస్తారా ? అని ప్రశ్నించారు. సరిగ్గా బుర్ర ఉన్నోడికయితే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాని ప్రశ్న అది.
  భారీ శరీరాలు చూపించుకుంటూ మేము యోగా చేస్తాము అని అనడం,సామరస్యత లేకుండా ధ్యానం చేస్తున్నాము అని అనడం భావ్యం కాదేమో ? ఏదయినా చెప్పేటపుడు మనం ఆచరంచి చూపాలి.

  • Jitu says:

   Yoga is meant for overall health not to slim down and have a size-zero figure.

   Whether or not our PM follows yoga ( or at least some other form of health regime) is visible from the fact that at the age of 63 he is able to not only survive with a mere 4 hours of daily sleep but also manages to work an 18hour shift at work. Even if we take both these numbers as exaggerations, there has to be a grain of truth in them. How many ‘unhealthy’ 63 year olds can put in 18 hour shifts with mere 4hrs of sleep without some kind of a discipline boosting their energy? In fact… how many 36 years olds can do that??

   Not to bring in the RaGa or Kejriwal… but just to put things in perspective… both these politicians in their 40s have taken multiple breaks in 2015 itself. In fact as we speak, RaGa is in a break at an undisclosed destination. Poor ‘kid’ is overworked.

   Official records have been quoted by multiple papers stating that Modi never took even one day break while being the CM for 13 years. Not sick for even a single day in 13 years… I think that’s a big achievement for a man in his 60s.

   One does not need to be vouched by ‘The Economist’. A little common sense would help.

   • Murali says:

    Why would she have been ashamed about something as innocuous as a Yoga day, if common sense prevailed? 🙂 I had to quote the “The Economist” because, some of us require the stamp of approval from Westerners for the simplest of truths to be acknowledged. 🙂

   • Jitu says:

    My bad. I had not expected to meet such intellectuals here. 🙂
    Often, Twitter and other social media gives me a steady dose of such intellectualism and helps keep up my immune system. It’s been two days since I have been on twitter so my immune system was down and I reacted.

    Maybe I need to do Yoga to boost my immune. 🙂

 3. Murali says:

  మోడీ యోగా చేస్తారా ?

  “Having practised it for much of his life, Mr Modi has even set himself up as a global teacher: he provides his followers on Weibo, a Chinese microblogging site, with daily lessons on yoga poses.”

  – The Economist, June 19, 2015

  భారీ శరీరాలు చూపించుకుంటూ మేము యోగా చేస్తాము అని అనడం, భావ్యం కాదేమో ?

  “Mr Modi himself looks reasonably strong, if not slim, as a result of his regime.”

  -The Economist, June 21, 2015

  And mind you, The Economist magazine is not a big fan of either Modi or Hindutva.

  పుతిన్ “గారు”, తన ఆక్రమణలతో, దేశ సరిహద్దులు తిరిగి రాయడంతో, యూరోప్‌లో, తద్వారా ప్రపంచంలోనే సంక్షోభం సృష్టిస్తున్నారు. పాపం మోడీ గారు, యోగా వంటికి మనసుకి మంచిది అని మాత్రమే చెప్తున్నారు.

  ఎవరు తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? 🙂

  • >భారీ శరీరాలు చూపించుకుంటూ మేము యోగా చేస్తాము అని అనడం, భావ్యం కాదేమో ?
   ప్రసిధ్ధ యోగిపుంగవులు త్రిలింగస్వామివారు చాలా భారీశరీరంతో ఉండేవారు కదా.

   • Murali says:

    శ్యామల రావు గారు,

    మీ సూచన నీహరిక గారు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే,

    మొదటిది: ఆవిడ పుతిన్ లాంటి దొడ్డ వ్యక్తిని ఒక స్టాండర్డ్‌గా వాడుకున్నారు.
    రెండవది: మోడీ యోగా ప్రాక్తీస్ చేయడని, ఉత్తి మాటలు మాత్రమే చెప్తాడని ఆవిడ ప్రగాఢ విశ్వాసం.
    మూడవది: యోగా చేస్తున్నారనడానికి ఋజువు, సన్నగా ఉండడం అని ఆవిడ ఇంకో అపోహ.
    నాలుగవది: భారత దేశపు సంస్కృతికి సంబంధించింది ఏదైనా హిందుత్వతో ముడి పెట్టి, విపరీతంగా సిగ్గు పడిపోవడం ఆవిడ ప్రవృత్తి కావచ్చు.

    ఆవిడ మనకు అందనంత దూరంలో ఉన్నారు. 🙂

 4. నీహారిక says:

  ఈ ప్రపంచంలోని దేశాలన్నిటికీ దేశ సరిహద్దులు తిరిగి వ్రాయమని పుతిన్ గారు సలహా ఇచ్చిఉంటే సంతోషించేవాళ్ళల్లో నేను ముందుంటాను. దేశ సరిహద్దులు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి.ఇపుడెవరూ కలిసి ఉండాలని కోరుకోవడం లేదు.తాను ఆచరించినది ఇతరులను చేయమని చెప్పలేదు కదా ?
  మన రాష్ట్ర సరిహద్దులు చెరపమని పోరాడింది భారతీయ జనతా పార్టీ కాదా?పార్లమెంట్ లో రెండు ఎంపీ సీట్లున్న తెరాసా వల్లనే తెలంగాణా సాధ్యమైనదంటారా? చిన్నమ్మ చేసిన సహాయాన్ని మర్చిపోవద్దని మరీ మరీ బ్రతిమాలింది కదా ? రామజన్మభూమి విషయంలో మన దగ్గర సంక్షోభాలు రాలేదా ? బీజేపీ కి తలకాయలేకుండానే ఇవన్నీ చేసిందంటారా ? యోగా వంటికీ మనసుకీ మంచిదే నేను కాదనడం లేదు. ప్రధాని కాగానే మోడీ,వాజ్ పేయి గారు అలా భారీ శరీరాలతో నడవలేక నడుస్తుంటే ఎవరైనా అడుగుతారు

  • Murali says:

   నీహరిక గారు,

   మీరు మిగతా వారి కామెంట్స్ చదివినట్టు లేదు. కాబట్టి అదే ప్రశ్నలని పదే పదే లేవనెత్తుతున్నారు. ఐనా సరే, ఆఖరి సారి మళ్ళీ చెప్తాను.

   1) తాను ఆచరించినది ఇతరులను చేయమని చెప్పలేదు కదా ?

   What a ridiculous statement. The head of a country openly endorses riding roughshod all over a sovereign nation. Does he really have to advocate it in words? Actions make more impact than words.

   On the other hand, while Yoga day is a state sponsored event, it’s purely optional.

   2) బీ.జే.పీ. సృష్టించిన సంక్షోభాలు.

   నిజమా? ఈ సంక్షోభాలు అన్నీ బీ.జే.పీనే సృష్టించిందా? ఒక వేళ అవును అనుకున్నా, ఇవి ఒక దేశాన్ని ఆక్రమించుకోవడంతో పోలిస్తే వీగి పోతాయి.

   3) మోడీ,వాజ్ పేయి గారు అలా భారీ శరీరాలతో నడవలేక నడుస్తుంటే ఎవరైనా అడుగుతారు…

   ఛ! మీ లాంటి కొందరు తప్ప ఎవరూ అడగరు. ఇంతకు ముందు చెప్పినట్టు మీరు వేరే వారి కామెంట్స్ చదువుతున్నట్టు లేదు. It’s not imperative that those who practice Yoga have to be thin. ( ఒక వంద సార్లు ఇంపొజిషన్‌లా రాయండి. అర్థం అయ్యే అవకాశం ఉంది. 🙂 )

   4) దేశాల సరిహద్దులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలా? దాని వల్ల వచ్చే సంక్షోభాల కంటే, ఆంధ్ర ప్రదేశ్‌ని విభజించడం వల్ల వచ్చిన సంక్షోభం ఎక్కువా?

   పైగా మీరు యోగా చేసేవారిని కుక్కలతో పోల్చిన సీతారం ఏచురిని పల్లెత్తు మాట కూడా అనలేదు.

   ఇదంతా చూస్తూంటే మీరు వామ పక్షానికి చెందిన వారిలా ఉన్నారు. మీకు నా రాతలు రుచించవు. నాలాంటి ఛాందసుల కళ్ళు తెరిపించే ప్రయత్నం మానేసి, మీరు ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసిన “ఇదండీ మహా భారతం” పుస్తకం చదువుకోవడం బెటర్. అందులోని అభ్యుదయ భావాలు మిమ్మల్ని పులకింప జేస్తాయి.

   -Murali

 5. పుతిన్ రాజకీయాలూ, ఉక్రెయిన్ వ్యవహారమూ వంటివి కాసేపు పక్కన పెట్టి చూస్తే…. మోదీ యోగా గురించి పుతిన్ అడిగిన కాంటెక్స్ట్‌ పూర్తిగా యోగా డేకి సంబంధించినది. ఆయన అడిగిన ప్రశ్న… రాజ్‌పథ్‌ ఈవెంట్‌లో మోదీ స్వయంగా యోగా చేస్తాడా అని. దానికి ఎలాంటి అర్ధాలు తీసుకోవాలన్నది నాకు తెలీదు. 🙂

 6. Murali says:

  Sigh!

 7. Jitu says:

  Muraligaaru,
  Hatred is a strong emotion. 🙂 Each time I listen to an adarsh liberal speak, the above fact only gets reiterated.

  One thing is for sure… International Yoga Day helped in burning a lot of calories. Those that believe in Modi, burnt calories by doing Yoga. Those that hate him, burnt calories by fuming. 😀 😀

  Mission Accomplished I’d say. 😀

  Looking forward to part 18. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s