పడమర పడగలు – 6


శుక్రవారం మళ్ళీ వచ్చింది. సాయంత్రం యధావిధిగా రాజేశ్ సుజాత తయారై కిందకి వచ్చారు. “నువ్వు తయారు కారా. ఈ రోజు రెడ్డిగారింట్లో పార్టీ,” చెప్పింది సుజాత. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సమాధానం ఇచ్చాడు రవితేజ.

“నాకు బోలెడు చదువు, చేయాల్సిన అసైన్‌మెంట్స్ ఉన్నాయక్కా, మీరు కానివ్వండి. నేను ఇంట్లోనే ఉంటాను.”

“చేరి రెండు వారాలు అయ్యింది. అప్పుడే అంత చదువు ఏంట్రా?” కాస్త విసుగ్గా అంది సుజాత.

“తప్పదు అక్కా. ఈ సెమిస్టర్ మంచి గ్రేడ్స్ వస్తే వచ్చే సెమిస్టర్‌కి ఫైనాన్షల్ ఎయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది.”

“సరే అలాగే కానివ్వు. అలా ఐతే బంటీని బబ్లీని ఇంట్లోనే వదిలి వెళ్తాములే. వాళ్ళు మాతో వస్తే నిద్రకి ఆగలేరు అని మేము కూడా తొందరగా బయట పడాల్సి వస్తుంది. ఇక్కడే ఇంట్లో ఆడుకుంటారు. వాళ్ళకు కాస్త మ్యాకరోని చీజ్ పెట్టు డిన్నర్‌కి. తరువాత పడుకోపెట్టు. నిన్న వండిన కూర కాస్త ఉంది. అది నువ్వు తినేయి. మా కోసం మిగల్చనక్కర లేదు. మేము తినే వస్తాం,” చెప్పింది సుజాత.

రాజేశ్, సుజాత నిష్క్రమించగానే, హిండియన్ పిల్లలు అసలు తల్లి తండ్రులు దరిదాపుల్లో లేకుంటే సొంత ఇంట్లో కూడా ఎలా రెచ్చిపోతారో చూశాడు రవితేజ. ఏ వస్తువు కింద పడకుండా, పగలకుండా ఆపడానికి వారి వెనకాల పరిగెత్తి, పరిగెత్తి, ఒలంపిక్స్‌కి క్వాలిఫై కాగలనేమో అన్నంత నమ్మకం వచ్చింది. ఇద్దరూ ఒకరి జుత్తు పట్టుకుని ఒకరు కొట్టుకుంటూంటే వారికి రకరకాల కబుర్లు చెప్పి విడదీయడంతో, అంధేరా ప్రదేశ్‌లో రాజకీయాలు కూడా హ్యాండిల్ చేయగలనన్న భరోసా పెరిగింది. ఐస్ క్రీం తప్ప ఏమీ తినమని గగ్గోలు పెడుతున్న వారికి కష్టపడి మ్యాకరోనీ చీజ్ తినిపించేసరికి, తనకు భూదేవి అంత సహనం ఉందని అర్థమయ్యింది. వీటన్నిటి మధ్య అన్నం వండుకుని, నిన్నటి కూరతో తినడంవల్ల, మల్టయి-టాస్కింగ్‌లో తను ఎవరికీ తీసిపోడు అన్న ఆత్మ విశ్వాసం పెరిగింది.

ఇంకా ఎన్ని కళలు అబ్బేవో కానీ, బంటీ బబ్లీ అలసిపోయి నిద్రలో జారుకోవడంతో, కొంత విరామం దొరికింది అతనికి. పుస్తకం పట్టుకుని కాస్త చదువుకుందాం అని ప్రయత్నించాడు రవితేజ. కానీ తను కూడా అలసిపోయి ఉన్నాడేమో, సొఫా మీదే, అలాగే నిద్రపోయాడు అతను. రాజేశ్ సుజాత ఎప్పుడో రాత్రి ఒంటి గంటకి వచ్చారు.

ఇదే తంతు శనివారం కూడా రిపీట్ అయ్యింది. సండే సాయంత్రానికి పిచ్చి చూపులు పడ్డాయి రవితేజకి. ఎప్పుడూ లేనిది అతను మండే మార్నింగ్ రన్నింగ్ కోసం ఆత్రుతతో ఎదురు చూడడం మొదలు పెట్టాడు.

మండే పొద్దున కాస్త సులువుగా రన్నింగ్ చేస్తూ (ప్రాక్టీస్ అయ్యింది కాబట్టి), అసలు ఈ వీకెండ్స్‌ని ఎలా డీల్ చేయాలా అన్న విషయమే ఆలోచించాడు. కానీ ఏ ఉపాయం తోచలేదు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s