పడమర పడగలు – 8

“నా సొల్యూషన్ పాటించాలంటే కాస్త గుండె ధైర్యం కావాలి.”

“నాలుగు గంటలు వన్-వే ప్రయాణం చేయడం తప్పుతుంది అనుకుంటే ఎంతటి సాహసానికైనా నేను రెడీనే!”

“నీ ఫైనాన్సెస్ సంగతి ఏంటి?”

“ఈ సెమిస్టర్ ఫీజ్ కట్టేశాను. వచ్చే సెమిస్టర్ ఫీజ్ కి కూడా డబ్బులున్నాయి. ఇవి కాకుండా ఒక 500 డాలర్లు ఉన్నాయి.”

“సరే, ఐతే వెంటనే మీ అక్కయ్య ఇంటినుంచి బయటపడు. ఇక్కడ క్యాంపస్ దగ్గర ఉంటున్న స్టూడెంట్స్ ఎవరో ఒకరి ఇంట్లోకి, అద్దె షేర్ చేసుకుంటాను అని చెప్పి, మకాం మార్చెయ్యి. నీ ప్రాబ్లెంస్ అన్నీ తీరిపోతాయి.”

“తీరిపోతాయా? ఇంకా పెరుగుతాయేమో? ఆ 500 డాలర్లు అయిపోయాక నా గతి ఏంటి?”

“ఇదే మన హిండియన్స్‌తో ప్రాబ్లం. గమ్యం వరకు బాట రెడీగా ఉంటే కానీ కాలు కూడా కదపం అంటారు. సాహసం శాయరా ఢింబకా!”

“…”

“నోట మాట రావట్లేదా? సరే చెప్తాను వినుకో. ఇక్కడి స్టూడెంట్స్‌కి తప్పకుండా ఒక 1000 డాలర్ల క్రెడిట్ లైన్‌తో ఒక కార్డ్ వస్తుంది. దానితో ఇంకొన్ని నెలలు లాగించొచ్చు. పైగా ప్రతి ఒక్కటి ఆ క్రెడిట్ కార్డ్ మీదే చార్జ్ చేయి. నీ ఖర్చులే కాదు, పక్క వాళ్ళ ఖర్చులు కూడా దాని మీదే పెట్టించు. తరువాత వాళ్ళ నుంచి క్యాష్ రూపంలో వసూలు చేసి, ప్రతి నెలా పూర్తిగా బిల్ కట్టేయి. తద్వారా నీ క్రెడిట్ లైన్ పెరుగుతుంది. అదే నీకు శ్రీ రామ రక్ష. రెండో సెమిస్టర్ అయ్యేంత వరకూ కూడా అసిస్టెంట్‌షిప్ రాక పోతే, క్రెడిట్ కార్డ్ మీద మిగతా సెమిస్టర్ల ఫీజ్ కట్టేయి. ఐనా రెండో సెమిస్టర్ తరువాత నువ్వు ఎలాగూ క్యాంపస్ బయట కూడా పని చేయొచ్చు. అసలు పరిస్థితి అంతవరకూ రాదులే. రెండో సెమిస్టర్ అయ్యేంతలో నీ కష్టాలు తీరిపోతాయి.”

“కానీ…”

“ఇంకా డౌట్‌గా ఉందా? ఇవి ఏవీ కాకపోతే నా క్రెడిట్ కార్డ్ వాడి నీ ఫీజ్ కడతాను. సరేనా? నీకు ఉద్యోగం వచ్చాక నా అప్పు తీర్చెయ్యి. క్యాష్ రూపంలో సుమా!” నవ్వుతూ అన్నాడు అనుభవ రావు.

“సార్! మీరు…”

“దేవుడిని కాదు మనిషినే. అంత ఎమోషనల్ కాకు. ఎమోషన్ కూడా లవ్ ఫెయిల్యూర్ లాంటిదే. ఉదాహరణకు మోరియో లూజియెట్‌ని తీసుకుంటే….”

“చెప్పండి సార్, ఎంత సేపైనా చెప్పండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఐనా ఇవ్వండి. నేను రెడీ వినడానికి!”

(ఒక రెండు రోజుల తరువాత)

“నువ్వు ఎన్నైనా చెప్పరా! నాకు మాత్రం నువ్వు ఇలా మా దగ్గర కాకుండా, ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళతో, ఒక చిన్న ఇరుకు కొంపలో ఉండడం నచ్చలేదు.” కాస్త విషాదంగా అంది సుజాత.

“నేను ఎక్కడికి పోతానక్కా! ఒక యూజ్డ్ కార్ కొనగానే ప్రతి వీకెండ్ మీ ఇంటికొచ్చి వాలిపోతానుగా,” హామీ ఇచ్చాడు రవితేజ.

పక్కనే ఉన్న అనుభవ రావు మెల్లగా దగ్గాడు.

“సరే అక్కా, ఇక నేను బయలుదేరాలి,” అంటూ అనుభవ రావు కార్ ట్రంక్‌లో తన సూట్‌కేసులు పెట్టి ఆ తరువాత ప్యాసెంజర్ సీట్‌లో కూర్చున్నాడు రవితేజ.

సుజాత కుటుంబం అందరూ చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్తూంటే, అనుభవ రావు కార్ యూనివర్సిటీ వైపు సాగిపోయింది.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

4 Responses to పడమర పడగలు – 8

 1. kastephale says:

  Following you, Quite Interesting

 2. Zilebi says:

  సూపెర్ !

  మళ్ళీ మరో “వాసన సజ్జిక” కూడా వస్తుందా కథ లో ? రవితేజ కహానీ చాలా బాగా సాగుతోంది 🙂

  జిలేబి

  • Murali says:

   రవితేజ కథ ప్రస్తుతానికి అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో నాకు కూడా తెలియదు. 🙂

 3. Zilebi says:

  ఇదేమీ బాగోలేదండీ మురళి గారు,

  కథని ఇంత ఉత్సుకత తో తీసుకొచ్చి, మధ్య లో ఆపేసి,(ఇంకా ఉంది) అని పెట్టి మధ్య లో కథ ఆపేస్తే మా లాంటి చదువరులకి ఎంత నిరుత్సాహామో చెప్పండి !

  వేరే ఏదైనా వెబ్ పత్రిక లో వ్రాయాలని అనుకుంటే, చమత్కారం డాట్ కాం హాస్య పత్రిక చూడండీ ! కాకుంటే కౌముది లో నైనా వ్రాయండి అంతే గాని కథ ని నిలిపి వేయ వలందని హడ్తాల్ 🙂

  జిలేబి

  చమత్కారం హాస్య పత్రిక లింకు

  http://www.chamatkaram.com/hasyanandam/Hasyanandam-july-2015/hasyanandam-july-2015-1.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s