నిష్పక్షపాతమైన వింగ్లీష్ మీడియా – 1


ఒక సారి బయట ప్రపంచంలో ఏం జరుగుతూందో ఒక లుక్ వేద్దాం.

(హిండియన్ జర్నలిస్టుల సమావేశం)

“మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీ అందరికి తెలుసు. మన శాయశక్తులు ఒడ్డి మాటి మాటికి ప్రజలకి దోగ్రా సంఘటన గుర్తు చేసినా జె.బీ.పీ.ని కేంద్రంలో అధికారంలోకి రాకుండా మనం ఆపలేక పోయాం,” అంది అక్కడ ఉన్న మిగత విలేఖరులని ఉద్దేశిస్తూ బుర్ఖా దత్.

ఆవిడ గాంక్రెస్ పార్టీకి చేసిన సేవకి (అంటే గాంక్రెస్ చేసిన తప్పుడు పనులని మసి బూసి మారేడు కాయ చేయడం లాంటివి), అప్పట్లో ఢిల్లీ అమ్మ ఆమెకి కమల-శ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. (ఇలాంటి లఫూట్లకు ఇవ్వడం వల్ల కమల అవార్డ్స్ పరువు ఎప్పుడో పోయిందనుకోండి, అది వేరే విషయం.)

“అవును చెల్లెమ్మ, మనం ఇలా దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నాం కాబట్టే, మనిద్దరిని ఆ బోడియా టేప్స్ స్కాండల్‌లో ఇరికించారు,” అన్నాడు భీర్ సంఘ్వీ. ఆయన సింధుస్తాన్ టైంస్ న్యూస్ పేపర్‌కి పని చేసే పెద్ద జర్నలిస్ట్.

“అబ్బా ఇప్పుడు అదంతా అవసరం అంటావా అన్నయ్య? నీకు ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలీదు,” విసుక్కుంది బుర్ఖా దత్. భీర్ సంఘ్వీ సైలెంట్ అయిపోయాడు.

“బాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, మనం ఎన్నికల సంవత్సరంలో మాత్రమే జే.బీ.పీ. గురించి దుష్ప్రచారం మొదలు పెట్టాం. ఈ సారి రెండవ సంవత్సరం నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ మోడీ సామాన్యుడు కాడు,” చెప్పారు ముక్త కంఠంతో పరిణయ్ రాయి, బాధిక రాయిలు ఇద్దరు. వారు భార్య భర్తలు మరియు DNTVకి ప్రమోటర్లు. బాధికా రాయి అక్కయ్య బొందా కారత్. ఆమె భర్త మటాష్ కారత్, ఎర్ర పార్టీలో పెద్ద లీడర్. అలాగే పరిణయ్ రాయి కజిన్ మనందరికి సుపరిచితురాలైన అధోగతి రాయి. వీరందరికి జే.బీ.పీ. అంటే ఎంత అభిమానమో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అదే DNTVకి పని చేసే సోసో సింగ్ అవునన్నట్టు తల ఊపింది. ఆమె భర్త P.R.N. సింగ్ గాంక్రెస్ పార్టీకి చెందిన మాజీ M.P. అన్న మాట.

ఆవిడ పక్కనే ఉన్న సముద్రిక ఘోష్ “ఈ internet సింధువుల పీచం ఎలాగైనా అణచాలి,” అంది కోపంగా. సముద్రిక ఘోష్ తండ్రి అత్తలూ అందరూ, హెన్రూ వంశానికి విధేయులు, తద్వారా ఎన్నో ప్రభుత్వ పదవులు స్వీకరించి లబ్ధి పొందిన వారు. సముద్రిక ఘోష్ భర్త, మంత్రిదీప్ సర్దేశాయి, ఆవిడతో పాటుగా NCC-INB చానెల్‌కి కో-ప్రమోటర్.

DNTVకే పని చేసే యాంకర్ పిల్ల, జిద్దీ రాజ్‌దాన్, “సింధువలంటే నీకెందుకక్కా అంత కోపం?” అంటూ ముసిముసిగా నవ్వింది. జిద్దీ, షాక్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఢర్‌పూక్ అబ్దుల్లాకి ప్రస్తుత ప్రేయసి.

“అసలు మోడీ గెలవడానికి ఈ internet సింధువులే సగం కారణం,” పళ్ళు పట పటా కొరుకుతూ అంది, సముద్రిక ఘోష్. వీళ్ళందరు కూడా జే.బీ.పీ. గురించి ఎంత నిష్పక్ష పాతంగా వార్తలు రాస్తారో మనం ఊహించవచ్చు.

“జే.బీ.పీ.ని తిట్టింది చాలు. ఈ నాలుగేళ్ళలో మన స్ట్రాటజీ ఎలా ఉండాలో అది ఆలోచిద్దాం ముందు,” అన్నాడు, M.రాం. ఆయన గుప్పిట్లో దక్షిణ హిండియా నుంచి ప్రచురింపబడే “ది సింధు” న్యూస్‌పేపర్ ఉంది.

“పెద్ద వారు, మేము పుట్టక ముందు నుంచి నిజాన్ని నొక్కేస్తూ గాంక్రెస్‌ని రక్షిస్తున్న వారు. అది కూడా ఎలా చేయాలో మీరే చెప్పండి,” అన్నాడు చరణ్ తాపర్. ఈయన హెన్రు కుటుంబానికి దగ్గరి చుట్టం. ఈయన కూడా NCC-INB చానెల్‌కి పని చేస్తాడు. ఈయన గారి చెల్లెలు ప్రోమీలా తాపర్ ఒక కుహనా చరిత్రకారిణి. మన పాఠ్య పుస్తకాలన్నిట్లో అహ్మదీయులని సమర్థిస్తూ, సింధువులని తిడుతూంటుంది. ఆమెని అలాంటి కీలకమైన పదవిలో కూర్చోపెట్టింది హెన్రూ కుటుంబమే అని వేరే చెప్పక్కర్లేదు.

సమాధానం చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు M.రాం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

10 Responses to నిష్పక్షపాతమైన వింగ్లీష్ మీడియా – 1

 1. ఇప్పుడు ఇంటరెస్టింగ్ ట్రాక్‌లోకి వచ్చారు…

 2. Jitu says:

  “ఈ సారి రెండవ సంవత్సరం నుంచి మొదలు పెట్టాలి.” ???

  Wrong!!!
  They had not wasted a single day, let alone an entire year.

  What did Modi wear? How many pinstripes were there on his dress? Can he afford it? Did he invite his ex-wife? Did she come by auto or by rickshaw? What was the number of that auto?? Was the number secular or communal?? Was she wearing a cotton saree or a handloom saree? Were there any holes in it that they could highlight on prime time?? Does the house in which she lives have three bulb sockets or four?? The building in which his brother lives has two windows or three? Is the color of the building secular??

  Illaanti ennenno vishayaalu… of ‘National Importance’ and ‘International Significance’ manaku andincheru ee mahaanubhavulu. Asalu, okka roju kaadu kadaa, okkaa poota koodaa oopiri teesukonivvaledu… Modigaarine kaadu, manandarini kooda. Dikkumalina analysis toh chapputoo unntaaru. Mundu oka prime time lone golaa pettevaaru… ippudu social media raakato, 24x7x365 ika ade pani lo unntaaru. Oka nimisham kooda waste cheyyakunda.

  Recently PM met many young writers, journalists, activists who are bringing about change at individual levels, at his official residence. I don’t remember what the event was called. There he said, and I quote… “If you google my name, you will find enough material criticising me to paper the entire Taj Complex, but till date I have not blocked a single person on social media.” He rounded it off by telling his followers to ignore. Guess that is why he is what he is. 🙂

  • Jitu says:

   Modiji’s name has become such a selling point and comment-bait, that let alone veteran BJP bashers and journalists… these days every Mary, Jo, Jane from Movie Industry, Television Industry, every irrelevant brown-piece activist and every ‘not so noble’ laureate uses his name to attract attention to himself and stay in limelight.

   All they need to do is pass an off-handed remark on social media…and lo behold! They become ‘National Sensation’ overnight.

  • Venu Aasuri says:

   Murali, As usual, stinging (for Gonkress or is it “Gone Case” 🙂 ) and hilarious. Keep going…

   Jyoti gaaru – you have nicely highlighted the “high standards” of journalism and the “National Importance” of the news it generates 🙂

 3. Siva Kumar K says:

  🙂 😀 😛

 4. ప్రభాకర్ రెడ్డి says:

  “ఎందుకంటే ఈ మోడీ సామాన్యుడు కాడు” ఇది అచ్చు తప్పు అనుకుంటాను. కంట్రోల్-ఎఫ్ -మోడీ కంట్రోల్-హెచ్ డోమీ 🙂 ఇప్పుడు సరైన కావ్యం అదే వాక్యం-“ఎందుకంటే ఈ డోమీ సామాన్యుడు కాడు”

  • Murali says:

   అతుకుల బొంతలో మన ప్రధాని పేరు సురేంద్ర మోడి. ఆ మాత్రం వ్యత్యాసం చాల్లేండి. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s