నిష్పక్షపాతమైన వింగ్లీష్ మీడియా – 2

M.రాం అక్కడ ఉన్న మేధవుల్లోకెల్లా మేధావి. ఒక రకంగా అపర మేధావి అనవచ్చు. ఆయన తన యవ్వనంలో ఎర్ర పార్టీ యూత్ వింగ్‌కి ఉపాధ్యక్షుడు. జే.బీ.పీ. సంకుచిత భావాలు అంటే ఆయనకు అసహ్యం. ఆయన ఒక్క కమ్యూనిజం యొక్క సంకుచిత భావాలను మాత్రమే ఇష్టపడతాడు.

“నేను ఒకప్పుడు చెప్పాను. నిజం జే.బీ.పీ.కి ఉపయోగపడుతుంది అంటే, నిజాన్ని ప్రచురించవద్దు అని. ఆ మాట మా “ద సింధు” పేపర్ విలేఖరులకే చెప్పాను అనుకోండి, కానీ అది అందరికి వర్తిస్తుంది,” అన్నాడు M.రాం. చప్పట్లతో ఆ గది మారుమోగిపోయింది.

“కాబట్టి మోడీ ప్రభుత్వం వల్ల వస్తున్న మంచి మార్పులు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం హైలైట్ చేయకూడదు. వీలైతే అసలు ప్రచురించకండి. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయండి. హనుమంత్ దళ్ ఎలా మత మార్పిడులని నీచాతి నీచంగా అడ్డుకుంటోందో రాయండి. మరీ తప్పదు అనుకుంటే…”

“ఆఖరి పేజీలో ప్రచురించాలి, అంతే కద,” అన్నాడు ఉత్సాహంగా జోకర్ గుప్తా. ఆయన ఒకప్పుడు హిండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఎడిటర్. ఈ రోజుకీ గాంక్రెస్ పాలనలో హిండియా ఎలా స్వర్ణ యుగాన్ని అనుభవించిందో వేరే పత్రికల్లో వ్యాసాలు రాస్తూంటాడు.

“ఏడిచారు. ఆఖరి పేజ్‌లో ప్రచురించినా ప్రముఖంగా కనపడుతుంది. Last but one pageలో ప్రచురిస్తే ఎక్కువ మంది చదవరు అని మా పరిశోధనలో తేలిన సత్యం,” చెప్పాడు M.రాం.

“అందుకే మీరు అపర మేధావి అయ్యారు,” అన్నాడు విషాద్ దువా. ఆయన పరిణయ్ రాయికి సన్నిహితుడు. గాంక్రెస్ అంటే వల్లమాలిన అభిమానం కలవాడు.

“సరే, సరే, ఈ పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. ముందు వినండి. మోడీ మొదటి సంవత్సరంలోనే కొన్ని కీలకమైన మౌలికమైన మార్పులు మొదలు పెట్టాడు. ఉదాహరణకు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, ఎక్కువ అధికారాలు ఇచ్చి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా చేశాడు. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రంతో సంబంధం లేకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చు. అఫ్ కోర్స్, జనాలకి ఇవేవీ తెలీకుండా మనం ఆ న్యూస్ బాగానే నొక్కేశాం అనుకోండి. ఇంక ముందు కూడా అలానే చేయాలి.”

“మీరు చెప్పింది నిజం. అందుకే మేమంతా మోడీ మన పొరుగు దేశం భీటాన్‌కి తన మొదటి విదేశీ యాత్రకి వెళ్ళినప్పుడు, ఏ అరెమికాకో నైచాకో వెళ్ళకుండా ఈ భీటాన్ ఏంటి అని ఫుల్ క్యామెడీ చేశాం,” కోరస్‌లో అన్నారు అక్కడ ఉన్నవారిలో కొందరు.

“కరెక్ట్. బీటాన్ బార్డర్ దగ్గర పెరుగుతున్న నైచా ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఎదుర్కోవాలన్నా, భీటాన్ మరో డిబెట్ కాకుండా ఉండాలన్నా, హిండియా, భీటాన్ మధ్య సఖ్యత చాలా అవసరం. కానీ మనలో చాలమంది నైచాకి పరమ భక్తులం. అలాంటి విషయాలు బయటకి రానిస్తామా? అలాగే ఖంగాల్ దేశ్‌కి వెళ్ళి మోడీ అమలు పరిచిన భూమార్పిడి ఒప్పందం అంత విశేషమైనది ఏమీ కాదు అని, అది 1974లోనే చేసుకున్న ఒప్పందమని మన పత్రికల్లో రాశాం. 1974లో చేసుకున్న ఒప్పందం మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు ఎందుకు అమలు కాలేదో అన్న విషయాన్ని మనం తెలివిగా ప్రస్తావించలేదనుకోండి. రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలి.”

“మీరు ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు,” అంది బొందా కారత్.

“వస్తున్నా, అక్కడికే వస్తున్నా. గాంక్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములని, వారి అసమర్థమైన పరిపాలనని, ఏవగించుకుని జనాలు, జే.బీ.పీ.కి పట్టం కట్టారు. గాంక్రెస్ ఇమేజ్ బాగు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. కానీ, జే.బీ.పీ. ఇమేజ్‌ని గాంక్రెస్ స్థాయికి మాత్రం దిగ జార్చ వచ్చు.”

“అదెలా? వీళ్ళ గవర్న్‌మెంట్‌లో GG లాంటి పెద్ద పెద్ద స్కాములు లేవు కద. పై లెవెల్‌లో కరప్షన్ కూడా చాలా తక్కువ. గత పన్నెండు ఏళ్ళ నుంచి దోగ్రాలో జరిగిన మత కలహాల గురించి ఊదర గొట్టగలిగామే కానీ, మోడీకి ఎక్కడా కరప్షన్ మచ్చ అంటించలేక పోయాం కద?” అనుమానం వెలిబుచ్చాడు జోకర్ గుప్తా.

“జే.బీ.పీ.లో మోడీ ఒక్కడే లేడు. ప్రతి స్కాం GG స్కాం అంత పెద్దది కానవసర లేదు కూడా. జే.బీ.పీ. సభ్యులకు ఎవరికైనా, ఏ స్కాంతో సంబంధం ఉన్నా, ఉన్నట్టు అనిపించినా, దాన్ని భూతద్దంలో చూపించడమే మన పని. ఉదాహరణకి పద్మజ ముండేని తీసుకోండి. గత గాంక్రెస్ ప్రభుత్వం 408 కోట్లకు కొన్న పదార్థాలనే ఆవిడ మినిస్ట్రీ 206 కోట్లకి కొనింది. ఐనా సరే, దాన్ని మనం స్కాం అని ఖండించాలి. మదర్ తెరీమా చేసిన సేవల వెనక ముఖ్య ఉద్దేశం, మత మార్పిడి అన్నది అందరికి తెలుసు. కానీ అదే మాట S.R.R. అధినేత అంటే, వెంటనే మనం మోడి ప్రభుత్వం యొక్క మత ఛాందసత్వాన్ని గురించి ఎలుగెత్తి చాటాలి. ఇలా ఎక్కడా, ఏ అవకాశం వదిలి పెట్ట కూడదు. మీడియా మనది. వింగ్లీష్ చదువు చదువుకున్న హిండియన్స్ మనం వింగ్లీష్‌లో ఏం రాసినా నమ్మేస్తారు. వాళ్ళు అడ్డగోలుగా అర్థం పర్థం లేకుండా వాదిస్తూ, మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి, నా సహ విలేఖరులారా, రెచ్చిపోండి,” ఉద్వేగంగా అన్నాడు M.రాం.

“బాగా చెప్పారు, కాని ఒక పని మాత్రం చాలా కష్టంగా తోస్తూంది,” అన్నాడు పరిణయ్ రాయి.

“ఏంటది?”

“సాహుల్ గాంధికి కొంతైనా మెదడు ఉంది అని జనాల్ని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు.”

“దానికీ ఏదో మార్గం తడుతుంది. కాస్త ఓపిక పట్టండి,” అంటూ అక్కడినుంచి నిష్క్రమించాడు M.రాం. మిగతా అందరూ అతన్ని ఫాలో అయ్యారు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

6 Responses to నిష్పక్షపాతమైన వింగ్లీష్ మీడియా – 2

 1. Siva Kumar K says:

  LOLZzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz…. 🙂 😀

 2. kamudha says:

  Nice work murali

 3. హే రామ్‌ 😦 … (దాంఘీ మార్కుదీ కాదు, మకల్ సాహన్‌ మార్కుదీ కాదు 🙂 )

 4. అంతా బానే ఉంది కానీ మదర్ తెరిస్సా సేవ చేసిన వెనక ఉద్దేశం మత మార్పిడి అనేది బాలేదు. సత్య దూరం అనిపిస్తుంది.

  • Murali says:

   మతం మార్చుకోమని అడగకుండా, కేవలం మానవత్వం ప్రాతిపదిక మీద, ఆమె ఎవరికైనా సేవ చేసిన ఒక్క ఉదాహరణ ఇవ్వండి. నేను చెప్పింది తప్పు అని ఒప్పుకుంటాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s