ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదు


సడన్‌గా ఇంట్లోకి దూసుకు వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళని ఆశ్చర్యంగా చూశారు శంకర్రావు గారు. చిరిగి పోయిన బట్టలతో, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని ఉన్నారు వాళ్ళు.

“ఇదేం దారుణమయ్యా, డైరెక్ట్‌గా ఇంట్లోకి వచ్చేసి మరీ అడుక్కుంటున్నారూ! సామాన్యులకి ఈ సంఘంలో గౌరవం లేదు అని అందరూ అంటూంటే ఏమిటో అనుకున్నాను. నిజమే సుమా,” బాధగా అన్నారు ఆయన.

“నాన్నా! మరీ అంత భారీ డైలాగులు కొట్టకండి, అవి 1980 నాటి సినిమాల్లో అయితే బాగుంటాయి. ఈ 2015లో కాదు,” అన్నాడు అందులో ఒక కుర్రాడు.

ఆ గొంతు ఏదో సుపరిచితమైనదిగా అనిపించి, ఆ అబ్బాయి మొహంలోకి తేరిపారా చూశారు శంకర్రావు గారు. ఆశ్చర్యం! అది కుమారే! వెను వెంటనే మిగిలిన ఇద్దరూ శరత్, మహేంద్ర అని కూడా గుర్తు పట్టేశారు ఆయన.

“మీకిదేం పోయే కాలంరా! ఈ అవతారాలేంటి?” కాస్త దుర్గంధం కూడా వచ్చినట్టు అనిపించి ముక్కు మూసుకుంటూ అడిగారు ఆయన.

“సినిమా టికెట్లు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగం ఇదంతా, నాన్నా!” చెప్పాడు కుమార్. అతని మిత్రులిద్దరూ కూడా అవునన్నట్టు తల ఊపారు.

“ఏం సినిమారా అది? ఇప్పటి వరకు లోపల ఈగలు తోలుకుంటున్నా, థియేటర్ బయట హౌస్‌ఫుల్ బోర్డ్స్ పెట్టి డ్యాన్సులు చేసే అభిమానులని చూశాను. ఇలా టికెట్ల కోసం బట్టలు చించుకునే సినిమా ఉందా?” ఆశ్చర్య పోయారు శంకర్రావు గారు.

“అందుకే నాన్నా, ఎప్పుడూ మోడీ అంటూ, సాహుల్ అంటూ పాలిటిక్స్ లోనే మునిగి తేలకు, కాస్త general knowledge పెంపొందించుకో అని చెప్పేది. నిన్నే నో.నో. రాజ్ మౌళీ magnum opus, “రాహు కలి” రిలీజ్ అయ్యింది. ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదు. న బూతో న భవిష్యతి అన్న మాట,” ఆవేశంగా అన్నాడు కుమార్.

“ఓహో అదా! బానే ఉంది కానీ, “న బూతో” అనకూడదు చిట్టి నాన్నా, “న భూతో” అనాలి. లేకపోతే అదే ఒక పెద్ద బూతు అవుతుంది.”

“నాన్నా నా ఫ్లోకి అడ్డు పడకు. నిన్న ముగ్గురం దొరబాబుల్లానే తయారయి “రాహు కలి” చూడడానికి వెళ్ళాం. కానీ మొదటి రోజు కద, పరిస్థితి భీభత్సంగా ఉంది! చొక్కాలు ప్యాంట్లు చిరిగిపోయాయి కానీ టికెట్ దొరకలేదు. అందుకే ఈ రోజు చిరిగిపోయిన గుడ్డలు వేసుకుని ఒంటికి మట్టి పూసుకుని మరీ వెళ్ళాం. విజయం సాధించాం!”

“అయితే మూడు టికెట్లు సంపాదించారన్న మాట. మీ పద్ధతి కాస్త కంపు కొట్టినా, మొత్తానికి సత్ఫలితమే ఇచ్చింది.”

“పిచ్చి నాన్నా! ఇంతా చేస్తే మాకు దొరికింది ఒకటే టికెట్. ఇప్పుడు మేము ముగ్గురం free styleలో కుస్తీకి దిగుతాం. ఎవరు గెలిస్తే వాడికే ఈ టికెట్. ఇంద, ఈ టికెట్ కాస్త పట్టుకోండి,” అని “రాహు కలి” టికెట్ శంకర్రావు గారి చేతిలో పెట్టి, శరత్, మహేంద్రల మీదకి లంఘించాడు కుమార్.

యుద్ధ నాదాలతో ఆ గది మారుమోగిపోయింది. శంకర్రావు గారు విస్మయంగా చూస్తూ ఉండి పోయారు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

One Response to ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదు

  1. సహజ పరిస్థితికి అద్దం పట్టే వ్యాసం. నిన్న సినిమా హాలులోకి వెళ్ళి తిరిగివస్తున్న ప్రేక్షక జనసమూహమును చూస్తే పద్మవ్యూహమును ఛేదించిన విజయులవలె విజయవిలాసములతో వెలిగిపోతున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s