నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటా!


సూర్య బాబు అసెంబ్లీ నుండి బయట పడి తన కార్ వైపు నడుస్తూ ఉంటే ఆయనకు అంధేరా ప్రదేశ్ గాంక్రెస్ నాయకుడు బొగ్గుపారా రెడ్డి ఎదురయ్యాడు. బయట ఒకరిని ఖండిస్తూ ఒకరు ఎన్ని స్టేట్‌మెంట్‌లు ఇచ్చుకున్నా రాజకీయ నాయకులు ప్రైవేట్‌గా కలిసినప్పుడు బాగానే ఉంటారు. ఈ మధ్య ఒకరి కుటుంబంలొ జరిగే ఏ శుభకార్యానికైనా ఇంకొకరు హాజరు కావడం అనేది తప్పని సరి వ్యవహారం అయిపోయింది. దానికి ఒక కారణం ఉంది. మన రాజకీయ నాయకులు వారానికి ఒక పార్టీ మారడం మొదలు పెట్టాక, ఒకరినొకరు కలుసుకునే అవకాశాన్ని ఎవరూ వదులుకోవడం లేదు. అసలు ఇలాంటి లావా దేవీలు పెళ్ళిళ్ళలో, పుట్టిన రోజు పార్టీల్లో జరుపుకోవడమే సులువు అని అందరికి తెలిసి పోయింది. కాబట్టే ఈ ఆప్యాయతలూ, అనురాగాలూ.

“బాగున్నారా?” అంటూ ఒకరి యొగ క్షేమాలు ఒకరు విచారించుకున్నారు. ఇంతలో బొగ్గుపారా రెడ్డి సెల్ ఫోన్ చిన్న బీప్ ఇచ్చింది. ఫోన్ తీసి వచ్చిన మెసేజ్ చదువుకున్నాక బొగ్గుపారా రెడ్డి మొహం పాలిపోయింది.

“ఏమైంది రెడ్డి గారు? ఏదైనా దుర్వార్తా?” ఆందోళనగా అడిగాడు సూర్య బాబు.

“అలాంటిదేమీ కాదు కానీ, అంతకంటే బ్యాడే లెండి. మీ వాయు కళ్యాణ్ ఉన్నాడుగా, ఆయన ఇప్పుడే టిట్టర్ మీద టీట్ చేశాడు, “సిగ్గు శరం అభిమానం లజ్జ లాంటివి ఉంటే గాంక్రెస్ నాయకులు అంతా అంధేరా ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా గురించి ఉద్యమించాలని”. ఏడిచినట్టు ఉంది! మా మీటింగులకు జనాలని తీసుకు రావడమే గగనమైపోతూంటే, అసెంబ్లీలో ఒక సీట్ లేని మేము ఏం ఉద్యమిస్తాం చెప్పండి? ఇదేమన్నా న్యాయంగా ఉందా?” తన బాధ వెళ్ళగక్కాడు బొగ్గుపారా రెడ్డి.

“అవును, ఆ టీట్ నా ఫోన్‌కి ఇప్పుడే వచ్చింది,” తన ఫోన్ చూసుకుంటూ చెప్పాడు సూర్య బాబు. అంతలోనే ఉక్రోశంగా, “అయినా మా వాయు కళ్యాణ్ ఏంటండీ బాబూ! మొన్న వదిలిన టీట్లు మీరు చదవలేదా? మా పార్టీ ఎం.పీ.లు పార్లమెంట్‌కి అటెండ్ అయ్యేది గంట అయితే, పార్లమెంట్ క్యాంటీన్‌లో మెక్కేది పది గంటల పాటు అట! అంధేరా ప్రదేశ్ ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉంటే, ఆ చౌక ధరలో వచ్చే తిండి తిన్నా ఎలా అరుగుతుంది అని సెటైర్ ఒకటి. ఆ దెబ్బకి భయపడి మా వాళ్ళు పార్లమెంట్ క్యాంటీన్‌లో తినడం మానేసి బయట ఫైవ్ స్టార్ హోటల్స్‌లో తిని ఆ బిల్లులు అన్నీ మా చిన్న బాబుకి పంపిస్తున్నారు. అసలు టిట్టర్ తెరవాలంటే భయంగా ఉంది,” అన్నాడు.

“అసలు వోటర్లకే కాదు, ఈ రాజకీయ మిత్రులకి కూడా అసలు విశ్వాసం లేదండి. ఏదో, ప్రజల కోసం ఈ అవమానాలు అన్నీ భరించాల్సి వస్తూంది,” సానుభూతి ఒలికిస్తూ చెప్పాడు బొగ్గుపారా రెడ్డి.

ఈ సారి, ఇద్దరి సెల్ ఫోన్‌లు ఒకే సారి బీప్ చేశాయి. ఇద్దరూ ఫోన్‌లో వచ్చిన కొత్త టీట్ చదువుకున్నారు.

దాని సారాంశం, “అధికారంలో ఉన్న పార్టీ మరియు ప్రతిపక్షం కలిసి ప్రజలకోసం పోరాడాలి కానీ, ఇలా ప్రజల టైమ్‌లో, ప్రజల కోసం కట్టిన అసెంబ్లీ ముందు నా మీద చాడీలు చెప్పుకోకూడదు,” అని.

“వాయ్యో, వామ్మో! రెడ్డి గారు, మనం తీరికగా తరువాత మాట్లాడుకుందాం లెండి,” అంటూ తన కార్ వైపు దౌడు తీశాడు సూర్య బాబు. ఆయన బాడీ గార్డులు ఆయన్ని ఫాలో అయ్యారు. బొగ్గుపారా రెడ్డి వాళ్ళ కంటే ముందే అక్కడినుంచి మాయం అయిపోయాడు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

One Response to నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటా!

  1. Jitu says:

    Jokes apart, twitter has brought a sea of changes( positive or negative depends on how one sees it) in the way we send and receive information. And the new breed of politicians… Modi, Kejriwal, Swaraj, Kalyan… know it’s power. Only, some are using it’s strength, others are misusing it. yet a few others are abusing it.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s