మమ్మల్నింత అవమానిస్తారా…


ఆదరాబాదరాలో ఉన్న అనేక బస్తీలలో అదొకటి. ఐతే ఈ బస్తీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్త్రీలింగం పురుష లింగం కాకుండా మూడో లింగానికి చెందిన జనం నివసిస్తూ ఉంటారు. ఆ బస్తీలో, ఒకానొక ఇంట్లో నలుగురు మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు.

“నువ్వేమన్నా చెప్పు అక్కా, ఇది మనందరికి చాలా అవమానకరమైన విషయం,” ఏడుపు గొంతుతో చెప్పాడు నవనీతం.

“మనకు అవమానాలు కొత్తేంట్రా నవనీతం, దీనికి ఇంత బాధ పడడానికి?” అన్నాడు రమ్య.

“అవి వేరు, ఇవి వేరు అక్కా. మనం పొట్ట కూటికోసం కొన్ని అవమానాలు భరిస్తాం. సమాజం మనం అర్థం కాక భయంతో మనని దూరంగా ఉంచింది. కాని ఇది వేరు. అందరికి తెలుసు ఎవరు ఎలాంటి వారో,” కాస్త ఉక్రోశంగా అన్నాడు నవనీతం.

“నవనీతం చెప్పింది నిజమే అని నాకూ అనిపిస్తూంది. మనమంతా కలిసి ఎదురు తిరగక పోతే ఇది ఎంత దూరమైనా వెళ్తుంది,” అన్నాడు సుందరి.

“నేను ఇప్పుడే వచ్చాను, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండి,” కోపంగా ప్రశ్నించాడు లావణ్య.

“ఇందులో చెప్పేదేముందిరా లావణ్య? రోజూ వార్తలు చదవట్లేదా? ఈ వార్త చదివితే నీకే తెలుస్తుంది నవనీతం బాధేంటో!” అంటూ తన దగ్గర ఉన్న ఒక న్యూస్‌పేపర్‌ని లావణ్యకి ఇచ్చాడు సుందరి.

అందులో సుందరి చూపించిన వార్తని చదివిన లావణ్య మొహం పాలిపోయింది. “మరీ ఇంత దారుణమా? ఇంత అవమానిస్తారా?” మెల్లగా గొణిగాడు.

అందులో వార్త సారాంశం ఏమిటంటే, ఢిల్లీ డాలీలో పార్లమెంట్ సమావేశాలకి వెళ్తున్న అంధేరా ప్రదేశ్ యొక్క MPలు, అంధేరా ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సంపాదించకుండా తిరిగి వస్తే, వారికి కొజ్జాలతో స్వాగతం పలకాలి అని అంధేరా ప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనా సమితి నిర్ణయం తీసుకుంది అని.

“చూశావా అదీ నా బాధ! అంటే వాళ్ళకంటే కూడా మనం తక్కువ అని కద అర్థం? ఎలా తక్కువరా? మనం అడుక్కున్నామే కానీ వాళ్ళలా ప్రజా ధనం దోచుకున్నామా? ఎన్నికల ముందు ప్రత్యేక హోదా వెంటనే వచ్చేస్తుంది అని ప్రగల్భాలు పలికి, తీరా ఎన్నికల్లో గెలిచాక, సిగ్గు శరం లేకుండా ప్రత్యేక హోదా దొరకడం చాలా కష్టం అని సన్నాయి నొక్కులు నొక్కామా? లేక పదవుల కోసం మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టామా? అసలు మనకి వారికి పోలికేంట్రా?” ఆవేశంగా అడిగాడు నవనీతం.

“ఏం చేస్తాం నవనీతం. ఆ సమితిలో ఉన్న వారు కూడా రాజకీయ నాయకులే కద. వాళ్ళకి ఇంత కంటే గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయిలే! అంతా మన ఖర్మ!” దిగులుగా అన్నాడు లావణ్య.

అక్కడున్న మిగిలిన వారందరూ నిజమే అన్నట్టు తల ఊపారు.

Special treament ready for tardy MPs

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

One Response to మమ్మల్నింత అవమానిస్తారా…

 1. Jitu says:

  Hmmm. An interesting twist in the story.

  Like one of your character says, there should be more shame in being a corrupt politician than in belonging to the third gender.

  Also, I guess in order to let the readers know that you are speaking of the third gender, you needed to address them as male while giving them female names. But to be politically correct, all of them would have to be addressed in feminine gender.

  It’s weird. Sanskrit has three genders for all verbs. I’ll assume here, that maybe other Indian languages did too. At least initially. So first we drop the third gender from our vocabulary and then struggle to find words to describe them. Makes me wonder if this is also a gift left to us by the British.

  Related to the topic at hand… I read recently that a college in West Bengal appointed a transgender as it’s Principal. A first of it’s kind move. Given the way the socio-politic scene is in WB, I have a feeling this is more of a political move that due to any realignment in the way our society thinks. Still… It’s a step in the positive direction. I hope that in the respected position of a college Principal at least, her life would be free of side glances, snide remarks or muffled laughters that otherwise lace the lives of all those considered ‘not normal’.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s