సంచలనమైన ప్రకటనలు – 1


సూర్య బాబు నాయుడు పొద్దున్నే న్యూస్‌పేపర్ తిరగేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఆయనకి ఎక్కడా తన గురించి పెద్ద న్యూస్ కనపడలేదు. కానీ వీ.సీ.ఆర్. ఇచ్చిన స్టేట్‌మెంట్స్, వై.నో.గగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ కుప్పలు తెప్పలుగా కనపడ్డాయి. ఇది ఆయనకి సుతరాము నచ్చలేదు. వెంటనే తన ఆంతరంగిక సలహాదారుకి కాల్ చేశాడు.

“ఏంటి సార్, పొద్దున్నే కాల్ చేశారు?” అడిగాడు సలహాదారు.

సంగతి చెప్పాడు సూర్య బాబు.

“చూడండి సార్, రాజకీయ నాయకుడు అన్నాక పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్శ్ ఇస్తూ ఉండాలి. వీ.సీ.ఆర్. గారినే చూడండి. పొద్దున సెట్ట్లర్లు అందరిని తరిమేస్తా అంటాడు. సాయంత్రం కడుపులో పెట్టుకుని చూసుకుంటా అంటాడు. అలా సంచలనం సృష్టిస్తాడు కాబట్టే ఆయన వ్యాఖ్యలను మీడియా పబ్లిష్ చేస్తుంది.

ఇక వై.నో. గగన్ అంటారా, ఆయన ఎప్పుడూ ఎవర్నో ఒకరిని ఓదారుస్తూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తాను తలుచుకుంటే మన ప్రభుత్వం పడిపోతుందంటాడు. రాష్ట్రాలు విడిపోయాక బృ.రా.స.కు మద్దతిస్తే ఏంటి అంటాడు. ఇవి కూడా సంచలనం సృష్టించే వ్యాఖ్యలే.

మీరేమో, కొత్త రాజధానిని రంగపూర్‌లా కట్టిస్తా, ఒక్కొక్కరు కనీసం ఒక్క ఇటుకైన దానం చేయండి అని దేబిరిస్తూ ఉంటారు. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఎవరు పబ్లిష్ చేస్తారు, ఎవరు చదువుతారు?”

జ్ఞాన నేత్రం తెరుచుకుంది సూర్య బాబుకి.

“నేను దేబిరిస్తాను అన్నప్పటికి, మంచి సలహా ఇచ్చావు. నేను కూడా సంచలనమైన స్టేట్‌మెంట్ ఒకటి పారేస్తా!”

“మంచి చెడు కాదు ఇక్కడ ముఖ్యం. మీరిచ్చే స్టేట్‌మెంట్ సెన్సేషనల్‌గా ఉండాలి. గుర్తు పెట్టుకోండి,” ఫోన్ పెట్టేశాడు సలహాదారు.

ఈ పొద్దున్నే తనకి ఎంత కష్టమొచ్చింది అనుకున్నాడు సూర్య బాబు. సడన్‌గా అతనికి వెలిగింది. “పొద్దున!” ఎస్! ఈ పాయింట్‌ని వాడుకునే తను సంచలనమైన ప్రకటన చేయాలి.

మరుసటి రోజు పేపర్లో సూర్య్ బాబు స్టేట్‌మెంట్ ఫ్రంట్ పేజ్‌లో వేశారు. దాని సారాంశం, “M.T.R. ముఖ్యమంత్రి అయ్యాకే ఆదరా బాదరా వాస్తవ్యులు పొద్దున్నే నిద్ర లేవడం నేర్చుకున్నారు. అప్పటి దాకా మద్యాహ్నం వరకు గురకలు పెడుతూ నిద్ర పోయే వారు. జై M.T.R.” అని.

ఆ వార్త పెను సంచలనమే సృష్టించింది. కానీ ఇంకో రకంగా. అసలే బృందగానాలో తెగులు దేశం పార్టీకి అంతంత మాత్రం ఉన్న ఆదరణ, దీనితో ఇంకా దిగజారింది. బృందగానా ప్రజలు, రాజకీయ నాయకులు, సూర్య బాబుని ఒక మోత మోసేశారు.

“M.T.R.కి నిద్ర పట్టక మూడు గంటలకే లేచి కూర్చుంటే, పెద్దాయనకి బోర్ కొడుతుందని, ఆదరాబాదర జనం కూడా లేచి కంపెనీ ఇచ్చేవారు. థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఈ సెటైర్లేమిటి?” అంటూ దుమ్మెత్తి పోశారు.

సూర్య బాబు మళ్ళీ తన సలహాదారుకి కాల్ చేశాడు. అతను ఫోన్ ఎత్తగానే, “నీ దిక్కు మాలిన ఐడియాని పాటించినందుకు నా పరిస్థితి ఎలా అయ్యిందో చూడు,” అంటూ మండి పడ్డాడు.

“ఏదో ఒక సంచలనమైతే సృష్టించారు కద! ఒక వేళ మీకు ఈ సంచలనం నచ్చక పోతే ఇంకో సంచలనమైన స్టేట్‌మెంట్ ఇవ్వండి. దీన్ని మర్చిపోతారు,” సలహా ఇచ్చాడు ఆయన.

“ఏంటది?”

“అసలు M.T.R. ముఖ్య మంత్రి అయ్యాకే, ఆదరా బాదరా ప్రజలు బ్రష్‌తో పళ్ళు తోముకోవడం మొదలు పెట్టారని, అంతకు ముందు వేప పుల్లతో దంత ధావనం కానిచ్చే వారని ఇంకో స్టేట్‌మెంట్ వదలండి.”

“అప్పుడు కానీ బృందగానాలో మన పార్టీ ఆఫీసు మూత పడదు. నువ్వూ, నీ చెత్త సలహాలు! ఇంకో వారం రోజులు నాకు కనిపించకు,” అని కోపంగా ఫోన్ పెట్టేశాడు సూర్య బాబు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s