సంచలనమైన ప్రకటనలు – 2


అక్కడ డుంబైలో మస్లాన్ ఖాన్ మెదడులో కూడా ఏదో పురుగు తొలిచింది. దానికి కారణం కూదా ఉంది. నటన మొదలు పెట్టినప్పటినుండి రోజుకో వివాదంలో ఇరుక్కోవడం అతనికి అలవాటు.

ఆ వివాదం తోటి నటీ నటులని (గమనించాలి, నటీమణులని కూడా వదలలేదు), దర్శకులని, నిర్మాతలని ఏదో ఒక వంక మీద చావ గొట్టడం కావచ్చు, తప్ప తాగి కారు నడుపుతూ, ఫుట్‌పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద ఎక్కించేసి వాళ్ళను ఆ దేవుడి దగ్గరకు చేర్చడం కావచ్చు, అక్రమంగా కృష్ణ జింకలని వేటాడడం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మొత్తానికి మస్లాన్ ఖాన్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచే వాడు.

గత కొద్ది రోజులుగా వార్తల్లో లేకపోవడం మస్లాన్‌కి ఎంతో బాధ కలిగించి ఉండాలి. అందుకేనేమో యాక్-థూ మెమోన్ అనే ఉగ్రవాదికి ఉరి శిక్ష ఖాయం కావడం గురించి అర్జెంటుగా స్పందించ దలిచాడు మస్లాన్.

ఇంతకు ముందు స్పందన తెలియజేయాలంటే ప్రెస్ కాన్‌ఫరెన్సులు పెట్టడం, లేదా టీవీలో ఏదో ఒక ప్యాపులర్ ప్రొగ్రాంకి గెస్టుగా రావడం లాంటివి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ వాడి టిట్టర్‌లో ఒక టీట్ పోస్ట్ చేస్తే చాలు, సెకన్లలో దేశంలో ఉన్న అందరికి చేరిపోతుంది.

మస్లాన్‌కి వార్తలు పూర్తిగా చదివే అలవాటు ఎప్పుడూ లేదు. అతనికి తెలిసిందల్లా, డుంబైలో పేలుళ్ళకి కారణమైన వాళ్ళలో ముఖ్యుడు లయన్ మెమోన్ అని, అతను దొరకలేదు అని, అతని తమ్ముడు యాక్-థూ మెమోన్‌ని ఉరి తీస్తున్నారని. అంతే! ఆ అర్ధ జ్ఞానంతోనే అతను రెచ్చిపోయి టీటుల మీద టీటులు వదిలాడు.

వాటి సారాంశం, తీస్తే లయన్ మెమోన్‌ని ఉరి తీయాలని, యాక్-థూ మెమోన్‌ని ఉరి తీస్తే, ఆ దేవుడు కూడా యాక్-థూ అంటాడని వగైరా వగైరా అని.

అయితే అందరికి తెలిసింది, మస్లాన్‌కి తెలియనిది ఏంటంటే, ఒక బాంబులు స్వయంగా పేల్చడం తప్ప, యాక్-థూ మెమోన్ అన్నీ చేశాడని. తొమ్మిది వందల అమాయకుల మరణానికి కావల్సిన సామాగ్రి అంతా అమర్చిన వాడిని ఉరి తీయకపోతేనే దేవుడు యాక్-థూ అంటాడని.

మస్లాన్ టీటులని చదివిన హిండియా పౌరులు బూతులు చదివినట్టు ఫీలయ్యి, మస్లాన్ మీద విరుచుకు పడ్డారు.

ఆఖరికి మస్లాన్ నాన్న లసీం ఖాన్, తన అబ్బాయి ఒక వెర్రి వెంగళప్ప అని, విషయం గురించి ఏ మాత్రం తెలీకుండానే స్పందించాడని అతని తరపున క్షమాపణ చెప్పుకున్నాక కానీ ప్రజలు శాంతించలేదు.

“వీడితో రోజుకొక పోరు వస్తూంది. ఈ సారి వీడు తాగాక, వీడి మొబైల్ లాక్కుని, వీడిని ఏదో ఒక రూమ్‌లో వేసి తాళం వెయ్యడం బెటర్,” అనుకున్నాడు లసీం ఖాన్, చావు తప్పి, కన్ను లొట్ట పోయి.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s