మీ బోడి వింగ్లీష్ ఎవరికి కావాలి! – 1


కుమార్ వాళ్ళ క్లాస్‌రూంలో అంతా గోల గోలగా ఉంది. అప్పుడే లోపలికి అడుగు పెట్టాడు వాళ్ళ వింగ్లీష్ లెక్చరర్.

“Silence please!” రిక్వెస్ట్ చేశాడు వింగ్లీష్ లెక్చరర్. స్టూడెంట్ల గోల మరింత పెరిగింది.

“This is a classroom for God’s sake!” కొంచెం కోపంగా బిగ్గరగా అన్నాడు ఆయన. విద్యార్థులు అస్సలు ఖాతరు చేయలేదు.

ఇక వింగ్లీష్ లాభం లేదనుకున్నాడేమో, తెగులులోకి స్విచ్ అయిపోయాడు లెక్చరర్. “అసలు మీరు విద్యార్థులేనా, ఏంటీ కాకి గోల?” గట్టిగా క్లాస్‌రూమ్ పెంకు ఎగిరిపోయేలా అరిచాడు ఈ సారి.

సడన్‌గా స్టూడెంట్లు సైలెంట్ అయిపోయారు. “హమ్మయ్య!” అనుకున్నాడు తనలో తాను లెక్చరర్. అంతలోనే వెనక వరసనుంచి ఎవరో అరిచారు, “కాకి గోలంటే ఇలా ఉండదు సర్! ఇప్పుడు చూడండి,” అంటూ. వెంటనే కావు కావుమన్న శబ్దాలతో నిండిపోయింది ఆ గది.

“ఈ తెలివి తేటలు చదువులో చూపిస్తే బాగుండేది. అయినా నాకు తెలీక అడుగుతాను. సినిమాల్లో చూస్తూంటాను కద. స్టూడెంట్స్ ఒక తెగులు లెక్చరర్‌ని మాత్రమే ఏడిపిస్తారు. ఎందుకంటే మన తెగులు వారిక్ తెగులు అంటే చిన్న చూపు కాబట్టి. I can understand that. కానీ నేను వింగ్లీష్ లెక్చరర్‌ని. మీరు నాకు అత్యంత గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మీ కెరియర్‌కి వింగ్లీష్ చాలా ఉపయోగపడుతుందని, మీ అందరికి వింగ్లీష్ అంటే రెస్పెక్ట్! మరి ఇదేంటి, నా క్లాస్‌లో కూడా అల్లరి చేస్తున్నారు?” అయోమయంగా అడిగాడు లెక్చరర్.

“సరే అడిగారు కాబట్టి చెప్తున్నాను,” అంటూ మహేంద్ర లేచి నిల్చున్నాడు. “మీరు చెప్పేది విరగ శాంతి కాలం నాటి నిజం. ఇప్పుడు రాజ్యమేలుతూంది రక్కుల ప్రీత్ సింగ్, మతన్నా లాంటి హీరోయిన్లు. ఇప్పుడు వింగ్లీష్ అంత అక్కర్లేదు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజో, ఇంకేదైనా సాఫ్ట్‌వేర్ పాకేజో నేర్చుకుంటే చాలు, అరెమికాకి వెళ్ళి హాయిగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిపోవచ్చు. ఇప్పుడు మేము గౌరవం ఇచ్చేది, కేవలం లావా, సైతాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని టీచ్ చేసే లెక్చరర్లకే,” అంటూ సూక్ష్మం వివరించాడు.

“ఓర్నీ, అరెమికాకి వెళ్తానంటున్నావు, మరి వింగ్లీష్ అక్కర్లేదా?” ఆశ్చర్యపోయాడు లెక్చరర్.

“చెప్పాను కద సర్, మీరు ఇంకా విరగ శాంతి, నాభు ప్రియ కాలంలో ఉన్నారని! అరెమికాకి వెళ్ళడానికి, అక్కడ జీవించడానికి బట్లర్ వింగ్లీష్‌ వస్తే చాలు. మ్యానేజ్ చేయొచ్చు, చేనుకు తెగులు పట్టినట్టు, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంతా మన తెగులు వారే ఉన్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, తెగులులో మాట్లాడుకుంటారు, తెగులు షాప్స్‌కే వెళ్తారు, తెగులు సినిమాలే చూస్తారు. మొన్నే మా కజిన్ చెప్పాడు. వాడు ఖాళీఫోర్నియాలో ఉంటాడు. వాడు వింగ్లీష్‌లో ఒక్క పదమైనా మాట్లాడి, రెండు సంవత్సరాలు అయ్యిందట. కాబట్టి మీ బోడి వింగ్లీష్ ఎవరికి కావాలీ, మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు?” కుండ బద్దలు కొట్టాడు మహేంద్ర.

అవాక్కయ్యాడు వింగ్లీష్ లెక్చరరు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s