మీ బోడి వింగ్లీష్ ఎవరికి కావాలి! – 2


సరిగ్గా అదే టైమ్‌కి ప్రిన్సిపాల్ క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టాడు. విద్యార్థులంతా వెంటనే సైలెంట్ అయిపోయారు.

“ఇంతకు ముందే ఇలా పక్క నుండి వెళ్తూంటే, ఈ రూమ్‌నుండి కావు కావుమంటూ శబ్దాలు వినిపించాయి. నువ్వు వీళ్ళకి నేర్పుతూంది, వింగ్లీషా, లేక పక్షుల అరుపులా?” సీరియస్‌గా అడిగాడు ఆయన లెక్చరర్‌ని.

“అలాంటి మిమిక్రీనే వస్తే, ఎప్పుడో కెరియర్ మార్చేద్దును సర్. మీరు విన్న కాకులు వీళ్ళే. నేను క్లాస్ తీసుకోకుండా అల్లరి చేస్తున్నారు.”

“నిజమా? వాళ్ళ కెరియర్ పెరుగుదలకి, వింగ్లీష్ ఎంత ఇంపార్టెంటో చెప్ప లేక పోయావా?”

“వాళ్ళకి వద్దుట సర్. ఏ లావానో, సైతానో వస్తే చాలట. బట్లర్ వింగ్లీష్‌తోనే మ్యానేజ్ చేస్తారట.”

“ఓహో, తెలివి మీరి పోయారన్న మాట. వీళ్ళకి ఇంకో రకంగా నచ్చజెప్పాలి,” అంటూ విద్యార్థుల వైపు తిరిగి, “డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సమస్య వింగ్లీష్ ఒక్కటే కాదు. ఇందులో క్రమశిక్షణ లాంటివి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి,” హితవు చెప్పాడు ప్రిసిపాల్.

తల పట్టుకున్నాడు లెక్చరర్. వాళ్ళకు ఉపయోగం కలిగించేది అంటేనే తన మాట పట్టించుకోని వీళ్ళు, క్రమశిక్షణ అనగానే పశ్చాత్తాపం చెంది ఎలా మారిపోతారని అనుకుంటున్నాడు ఈయన అని కాస్త చిరాకు వేసింది కూడా.

కానీ అక్కడే ప్రిన్సిపాల్ తన తెలివితేటలని ప్రదర్శించాడు. “మీరు స్టూడెంట్స్! మీ ఇమేజ్ గురించి అయినా మీరు పట్టించుకోవాలి. ఇదేమన్నా పార్లమెంట్ అనుకుంటున్నారా, లేక మీరేమైనా గాంక్రెస్ పార్టీ సభ్యులు అనుకుంటున్నారా?” అన్నాడు ఆవేశంగా.

“సార్! అలా అనకండి,” కోరస్‌గా అరిచారు విద్యార్థులంతా. మహేంద్ర మొహంలో కూడా షాక్ స్పష్టంగా కనిపించింది.

“మరింకెలా అనమంటారు? రోజూ చూస్తూనే ఉన్నారుగా టీవీలో, నలభై మంది ఉన్న గాంక్రెస్ సభ్యులు పార్లమెంట్ సాగకుండా ఎలా అడ్డుకుంటున్నారో? ఆ వెర్రమ్మ వెర్రెక్కినట్టు వెల్‌లోకి ఎలా దూసుకుపోయి స్పీకర్‌ని వేదిస్తూందో? పవర్ పోయిందన్న కక్షతో ప్రజా పాలనని ఎలా స్తంభింపజేస్తున్నారో? మీరు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారా?” స్వరం పెంచాడు ప్రిన్సిపాల్.

“సారీ, ప్రిన్సిపాల్ గారు. మేము అలా ఆలోచించలేదు. ఇక వింగ్లీష్ క్లాస్‌కి ఎలాంటి ఆటంకం కలిగించం. మీరు కూడా ఆ అంకఛండాలమైన గాంక్రెస్ పార్టీతో మమ్మల్ని పోల్చమని మాట ఇవ్వండి,” రిక్వెస్ట్ చేశాడు మహేంద్ర. మిగతా స్టూడెంట్స్ అంతా కూడా తల ఊపారు.

“Done! ఇక నువ్వు హ్యాపీగా పాఠం చెప్పుకోవయ్యా!” అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

5 Responses to మీ బోడి వింగ్లీష్ ఎవరికి కావాలి! – 2

  1. Siva Kumar K says:

    Like… 😀 😛

  2. Zilebi says:

    soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooper !

    :ఇదేమన్నా పార్లమెంట్ అనుకుంటున్నారా, లేక మీరేమైనా గాంక్రెస్ పార్టీ సభ్యులు అనుకుంటున్నారా?”

    ఇంతకన్నా మేలైన తిట్టే మన్నా ఉందా 🙂

    జిలేబి

  3. kinghari010 says:

    మొత్తానికి ఈ రకంగానన్నా లెకామే గారి భూతం వదిలి గులుతె వృధ్ధి పొందుతుందన్నమాట,భేషో భేషు!

  4. Upendar says:

    హ హ హ… చాలా బావుంది కాని మీరు టపాని మరీ చిన్నదిగా వ్రాస్తున్నారు అనేదే నాయొక్క పిర్యాదు!…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s