TFII లొల్లి – 1


శంకర్రావు గారు యదా విధిగా వరండాలో కూర్చుని, పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు. కేశవరావు గారు కూడా తన వాకింగ్ ముగించుకుని వచ్చి ఆయన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.

“ఎలా ఉన్నారు కేశవరావు గారూ?” పలకరించారు శంకర్రావు గారు.

“ఏముందండి? అంతా మామూలే. నిన్న వాకింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక చోట మూడు వైపులా మురిక్కాలువలు ఉన్నాయి అని చెప్పాను గుర్తుందా?”

“ఆ గుర్తుంది. ఈ రోజు మీరు వెళ్ళినప్పుడు అవి పూడ్చేసి ఉన్నాయా?”

“మీరు మరీనూ. ఈ రోజు నేను తిరిగి వస్తున్నప్పుడు అదే స్పాట్‌లో ఉండగా, నాలుగో వైపు కూడా ఒక మురిక్కాలువ ప్రవహించడం మొదలయ్యింది.”

“అయ్యో, మరి ఎలా బయట పడ్డారు?”

“ఏం చేస్తాను చెప్పండి? నా ఇష్ట దైవం హనుమంతుల వారిని తలుచుకుని, అన్నిటి కంటే వెడల్పు తక్కువ ఉన్న మురిక్కాలువ మీద నుండి లంఘించి బయట పడ్డాను. ఇంతకీ వార్తలు, విశేషాలు ఏంటి?”

“ఈ మధ్య ఎక్కడ చూసినా, చదివినా ఆ TFII గొడవేనండి. అదే చదువుతున్నాను.”

“TFII అంటే ఏమిటి సార్?”

“టైమ్‌పాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అఫ్ హిండియా అని ఒకటి ఉంది లెండి.”

“అదేం ఇన్స్టిట్యూట్?”

“అక్కడ సినిమాలు ఎలా తీయాలో నేర్పిస్తారు, కేశవరావు గారు. అక్కడ కోర్సులు, రెండేళ్ళ నుంచి మూడేళ్ళ వరకు ఉంటాయి. మన సెంట్రల్ గవర్నమెంటే దాదాపు మొత్తం ఖర్చు భరిస్తుంది కాబట్టి, స్టూడెంట్స్‌కి చదువే కాకుండా హాస్టల్, తిండి అన్నీ యమా చీప్!”

“శుభం! మరి సమస్య ఎక్కడ వచ్చింది?”

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

4 Responses to TFII లొల్లి – 1

  1. akriki says:

    TFIH (not TFII) H for Hindia – right?

    • Murali says:

      మీరన్నది కరెక్ట్. కానీ ఈ బ్లాగ్‌లో ఇండియా ఎప్పుడూ హిండియానే. 🙂

      • akriki says:

        నేను చెబుతున్నదీ అదేనండి. ఈ బ్లాగులో హిండియా కాబట్టి ‘I’ బదులు ‘H’ ఉండాలని సూచిస్తున్నాను.

      • Murali says:

        TFIH అంటే పాఠకులు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టే #TFII# అని రాయాల్సి వచ్చింది. మీరన్నట్టు దాని ఫుల్ ఫార్మ్‌గా టైమ్‌పాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా అనే రాయాలి. కానీ నా బ్లాగులో అసలు పేరులు ఉండవు కద! అందుకే ఇండియా బదులు హిండియా అని రాశాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s