TFII లొల్లి – 2


“TFIIకి అంత ప్రోద్బలం, అండ ఉన్నప్పటికి, అది అచ్చూ మిగతా గవర్నమెంట్ ఆఫీసుల్లానే తయారయ్యింది. 1997లో కొందరు స్టూడెంట్లకి డిప్లొమాలు ప్రదానం చేశాక, మళ్ళీ అలాంటిది ఏదీ జరగలేదు. దీనికి తోడు గత పదిహేనేళ్ళుగా అంతా టెంపరరీ మ్యానేజ్‌మెంట్ కావడంతో, ఒక దశా నిర్దేశం లేకుండా పోయింది,” చెప్పారు శంకర్రావు గారు.

“ఐతే, TFII స్టూడెంట్స్, మన సినిమా నటులు బోలెడు ఆనందించి ఉండాలి ఈ పరిణామానికి, అవునా?” ఉత్సాహంగా అన్నారు కేశవరావు గారు.

“అదిగోండి, మీరు ఇలా మాట్లాడితేనే నాకు మండుకొచ్చేది. రేపు మీరు వాకింగ్‌కి వెళ్ళినప్పుడు నాలుగు బదులు ఎనిమిది మురిక్కాలువల మధ్యలో ఇరుక్కోవాలని శపిద్దాం అన్నంత కోపం వస్తుంది.”

“అయ్య బాబోయి, అంత తప్పు మాట నేనేమన్నాను?”

“లేకపోతే ఇలాంటి పరిణామాలకి స్టూడెంట్స్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎందుకు ఆనందిస్తారు? స్టూడెంట్స్‌కి పాత పద్ధతే సౌకర్యంగా ఉంది. వాళ్ళని ఏం చదువుకుంటున్నారు, ఎంత చదువుకుంటున్నారు అని అడిగే నాధుడే లేడు. ఎన్ని రోజులు అక్కడ తిష్ట వేసినా వద్దనే వాడు కూడా లేడు. అలాంటిది ఈ జగేంద్ర చౌహాన్ వచ్చి ధాష్టీకం చలాయిస్తే ఎలా ఊరుకుంటారు? పైగా జగేంద్ర చౌహాన్‌కి జే.బీ.పీ. మనిషి అన్న ముద్ర ఉంది. ఇన్ని రోజులు అక్కడ, ఎర్ర పార్టీల సానుభూతి పరులు మాత్రమే రాజ్యమేలారు. అలాంటిది ఒక కాషాయం గాడు ఆ కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి ఎంత నామర్దా?”

“అవును నిజమే, కళలు అనేవి కేవలం ఎర్ర పార్టీలకు చెందిన వారి, వామ పక్ష భావాలు ఉన్న వారి అబ్బ సొత్తు కద! కాషాయం గాళ్ళకి కళ గురించి ఏం తెలుసు?”

“మన మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారం సమర్థవంతంగా చేసింది కాబట్టే, మీ లాంటి చాలా మంది నమ్మారు కాబట్టే, జగేంద్ర చౌహాన్‌ని డైరెక్టర్ చేశారన్న విషయం తెలియగానే అందరూ హాహాకారాలు చేసి, అతను ఆ పదవికి పనికి రాడు అని, అంతకు ముందు ఆ పదవిలో ఉన్నా వారి స్టేచర్‌తో పోలిస్తే ఇతనికి ఏ మాత్రం అర్హత లేదని, ఇతను దిగి పోవాలని డిమాండ్ చేశారు. TFII స్టూడెంట్స్‌కి మద్ధతు ప్రకటించారు.”

“ఇంతకి జగేంద్ర చౌహాన్ చేసిన నేరాలు ఘోరాలు ఏమిటి?”

“జగేంద్ర చౌహాన్ డైరెక్టర్ కాగానే TFIIని ఉద్ధరించాలని ఆశ పడ్డాడు. అసలు పదిహేనేళ్ళ పాటు సరి అయిన యాజమాన్యం లేకుండా భ్రష్టు పట్టిన TFIIని ఎవరైనా బాగు పరచడమే కానీ, పాడు చేసే అవకాశమే లేదు. ఐనా సరే అతను దిగి పోవాల్సిందే అని అందరూ డిమాండ్ చేశారు. జగేంద్ర చౌహాన్ ఏం చేశాడంటే…” ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళారు శంకర్రావు గారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత and tagged . Bookmark the permalink.

3 Responses to TFII లొల్లి – 2

  1. Siva Kumar K says:

    అవును నిజమే, కళలు అనేవి కేవలం ఎర్ర పార్టీలకు చెందిన వారి, వామ పక్ష భావాలు ఉన్న వారి ***************#%#^%&# కాషాయం గాళ్ళకి కళ గురించి ఏం తెలుసు?
    అతుకుల బొంతకాదండీ — ఉతుకుళ్ళ బొంత .. మీ ఉతుకుడు నచ్చింది.. 😉 🙂

  2. kinghari010 says:

    పాపం యెర్ర మేతావులకి తిండీ నీడా కరువైపోయే రోజులచ్చినయ్!
    అందుకే గామాల నోబెలు బెంగాలీ అమర సింహం గాండ్రిస్తుందోయ్?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s