హెయిర్ కట్ అక్కర్లేదుగా! – 3

“లేదు, పైగా రిపీటర్‌కున్న ఆస్తుల్లో ఒక ఫ్లాట్‌ని తన పేరు మీద రాయమని గొడవ చేయడం మొదలు పెట్టింది. అప్పుడు చంద్రాణి తన భర్తతో కలిసి షానాని గొంతు నులిమి చంపేసింది!”

“తల్లి ఇలా తన కూతుర్ని తాను చంపడమేంటి సార్,” ఇంకో సారి జుత్తు పీక్కున్నారు కేశవరావు గారు.

“ఊరుకోండి కేశవరావు గారు, మన సమాజమే అలా తయరయ్యింది.”

“చంద్రాణి సంగతి సరే, అసలేం సంబంధం లేని రిపీటర్ ఎందుకు సార్, షానాని చంపడంలో సహాయం చేశాడు?”

“ఓ సారీ, భర్త అన్నానా? కాదు చంపడానికి సహాయం చేసింది ఆమె మాజీ రెండవ భర్త, మృతజీవ్ ఖన్నా.”

“వామ్మో అసలు వీడెందుకు సార్ చంద్రాణికి హెల్ప్ చేశాడు? వీడికి షానాతో ఏ రకంగానూ సంబంధం లేదు కద!” ఈ సారి కాస్త గట్టిగానే జుత్తు పీక్కున్నారు కేశవరావు గారు.

“షానాతో సంబంధం లేకపోవచ్చు కానీ, చంద్రాణితో ఉంది కద. చంద్రాణి నెట్‌వర్క్ అలాంటిది. అందరితోనూ సత్సంబంధాలు పెట్టుకుంది, ఒక పిల్లలతో తప్ప.”

“కనీసం వాళ్ళకి భయం కూడా లేదా, మర్డర్ చేస్తే దొరికిపోతామని?”

“లేదనుకుంటా, షానా శవాన్ని కాల్చి బూడిద చేశాక, షానా, పోహుల్ భారి నుంచి తప్పించుకోవడానికి అరెమికా వెళ్ళిపోయింది, అని ప్రచారం చేసింది చంద్రాణి. అందరూ నమ్మారు. ఆఖరికి మిస్సింగ్ పర్సన్ కేస్ కూడా ఎవరూ రిజిస్టర్ చేయలేదు. ఒక మూడేళ్ళ తరువాత, అనుకోకుండా చంద్రాణి డ్రైవర్, తాగి ఒక బార్‌లో ఇదంతా వాగుతున్నప్పుడు, అక్కడే ఉన్న ఒక పొలీసు వినడం ద్వారా, మొత్తం సంగతి బయటకి వచ్చింది.”

మళ్ళీ తనివి తీరా తన జుత్తు పీక్కోబోతున్న కేశవరావు గారి చేయి పట్టి ఆపేశారు శంకర్రావు గారు. “ఇంక చాలు! ఏమే, ఒక చిన్న అద్దం తీసుకురా!” అంటూ పురమాయించారు పార్వతమ్మ గారికి.

ఆవిడ తెచ్చిన అద్దంలో తన మొహం చూసుకున్న కేశవరావు గారు “అరే, నా జుత్తుకేమయ్యింది, ఇలా పల్చబడిపోయింది?” అంటూ నిర్ఘాంతపోయారు.

“నేను చెప్పాను కద సార్, ఈ కథ విన్నాక మీకు హెయిర్ కట్ అవసరం ఉండని,” అన్నారు శంకర్రావు గారు.

“నిజమే! ఇంకా హెయిర్ కట్‌కి వెళ్ళక్కర్లేదు,” ఒప్పుకున్నారు కేశవరావు గారు నిట్టూరుస్తూ.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

3 Responses to హెయిర్ కట్ అక్కర్లేదుగా! – 3

 1. kamudha says:

  Good serial. keep going. I think soon you will reach 2lakhs visits.

 2. kinghari010 says:

  కొందరి కయితే కేశమూలాలు కూడా తెగిపోయి ఉంటాయి:-)

 3. Jitu says:

  Announcement on a Prime Time yelling match on a Prime Time channel anchored by a Prime TIme journalist.

  “As a mark of protest against the inactivity of this blogger, we threaten to confer a Sahitya Akademi on him. The blogger better be warned and start writing again… else the national level humiliation of receiving a Sahitya Akademi will be insurmountable for the rest of his life. ”

  – Association of Secular Sensationalist Haughty Over-rated Liberal Elitist Sahityakaars

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s