మరీ ఓవర్ చేయకురోయి!

(హమ్మయ్య! దసరా సెలవుల తరువాత మళ్ళీ మనం కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏంటీ? నా బ్లాగ్‌కి దసరా సెలవులు ఇచ్చానన్న విషయం మీకు తెలీదా? ఇన్ని రోజులు, కొత్త టపా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారా? అయ్యయ్యో! నేనే చెప్పడం మర్చిపోయినట్టున్నాను. ప్చ్! ఇంకో సారి ఇలా జరగదు లెండి. ఈ సారి సెలవులు తీసుకునే ముందే ఆ విషయం ప్రకటిస్తాను.)


“మొన్నే రిలీజ్ అయిన ఫెన్స్ సినిమా గురించి విన్నారా?” శంకర్రావు గారిని ప్రశ్నించారు కేశవరావు గారు.

“ఆ చూశాను చాలా మంచి సినిమా! రెండో ప్రపంచ యుద్ధంలో మన హిండియన్ సోల్జర్స్ పోషించిన పాత్రని చూపించిన మొదటి సినిమా. అంతే కాదు, దేశాల మధ్యే కాదు, మనుషుల మధ్య కూదా ఫెన్సులు ఉంటాయి. వాటిని కూడా కూలదోయాలి అన్న సందేశం. డైరెక్టర్ స్విష్ చిన్న వాడైనప్పటికి ఎంతో గొప్పగా తీశాడు. మన తెగులు సినిమాల్లో అన్నీ మసాలా మూవీసే అనే వారు ఇలాంటి సినిమా తప్పక చూడాలి,” కాస్త ఉద్వేగంతో అన్నారు శంకర్రావు గారు.

“అందుకనే ఎంతో మంది ప్రముఖులు స్విష్‌కి కాల్ చేసి మరీ అభినందిస్తున్నారట.”

“అవును ముఖ్యంగా గడ్డమేంద్రుడు రె. కాఘవేంద్ర రావు లాంటి సీనియర్ డైరెక్టర్ కూడా స్విష్‌తొ స్వయంగా మాట్లాడి అభినందనలు తెలిపాడట,” తనకు తెలిసిన ఇన్‌ఫర్మేషన్ పంచుకున్నారు శంకర్రావు గారు.

“దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మన సినీ ప్రముఖలకు మంచి సినిమాలు అంటే ఎంతో ఇష్టం,” గద్గదమైన స్వరంతో అన్నారు కేశవరావు గారు.

ఇక, నిజంగా జరిగింది ఏంటో చూద్దాం:

*******************************************

“నీ కొత్త సినిమా ఫెన్స్ చూసి కాల్ చేశానోయి,” స్విష్ ఫోనెత్తగానే అన్నాడు రె. కాఘవేంద్ర రావు.

“థాంక్యూ సార్! మీ అంతటి డైరెక్టర్ కాల్ చేయడం నా లాంటి యువ దర్శకులని ఎంతో ఇన్‌స్పైర్ చేస్తుంది,” ఆనందంగా అన్నాడు స్విష్.

“నీ మొహం, నిన్ను పొగడ్డానికి కాదు చేసింది. పాత ఛాందస భావాలలో కూరుకుపోయిన తెగులు సినిమాని అతి కష్టంతో నా సినిమాల ద్వారా మాడ్రన్ ప్రంపంచంలోకి తెచ్చాను. నేను సినిమాల్లో హీరోయిన్లని చూపించిన తీరుని, అశ్లీలంగా ఉన్నా ప్రేక్షకులు తప్పు పట్టకుండా ఒప్పుకోవడాన్ని చూసి, ఎంతో మంది కుర్ర డైరెక్టర్లు నాలా మాస్ మసాలా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అకస్మాత్తుగా అరవయి ఏళ్ళు పైబడిన లేడీస్ కూడా బొడ్డు కింద చీర కట్టడం మొదలు పెట్టారు. అసలు ఇదే నాగరికత అని అందరూ కన్‌విన్స్ అయిపోయారు.

దాదాపు 30 ఏళ్ళ తరువాత, అసలు కథ, రూపం, నటన ఏవీ అవసరం లేకుండానే సినిమాలు తీయొచ్చు అని అందర్ని నమ్మించగలిగాను, ప్రేక్షకులతో సహా. దాని వల్ల ఎంత ప్రగతి సాధించామో చూడు! ఇప్పుడు ప్రతి అడ్డమైన వెధవ, కాస్త డబ్బులుంటే చాలు, తనను తాను హీరోగా పెట్టుకుని సినిమాలు తీసుకుంటున్నాడు. ఆ స్టార్ నా కొడుకులు అయితే ఏకంగా 20 సినిమాలు ఫ్లాప్ ఐనా, తండ్రుల డబ్బులతో సినిమాలు తీసి జనాల మీదకు వదులుతూనే ఉన్నారు. సింపతీ వేవ్ వచ్చైనా వారి సినిమాలు హిట్ కావొచ్చని వారి ఆశ.

అలా ఎంతో కష్ట పడి నా జీవితాన్ని ఫణంగా పెట్టి, తెగులు సినిమాలని ఇలా భ్రష్టు పట్టించాక, నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఒక కుర్ర కుంకవి, ఒక  చారిత్రాత్మకమైన బ్యాక్‌డ్రాప్‌తో, కథ నుంచి డైవర్ట్ కాకుండా, అనవసరమైన క్యామెడీ సన్నివేశాలు పెట్టకుండా, ఎక్స్‌పోజ్ చేసే అవకాశమున్న చోట కూడా చేయకుండా, ఇలాంటి సినిమా తీస్తావా? నీకు ఎన్ని గుండెలు అసలు! పైగా ఇది బాగా ఆడుతూందట కూడా. ఇది సక్సెస్ ఐతే ఇంకేమన్నా ఉందా! మళ్ళీ మంచి చిత్రాలు రావడం మొదలవుతుందేమో, బాబోయి!

నువ్వు మరీ ఓవర్ చేయకురోయి! ఈ సారి తీసే సినిమాలో కథ ఏదైనా సరే, మూడు ఫైట్సూ, నాలుగు చేజులూ, ఆరు మాస్ సాంగ్సూ, పన్నెండు వెకిలి క్యామెడీ సన్నివేశాలు పెట్టకుండా తీశావో, నువ్వు మళ్ళీ టాలివుడ్‌లో కనపడకుండా చేస్తాను జాగ్రత్త!” పళ్ళు కొరుకుతూ వార్నింగ్ ఇచ్చాడు రె. కాఘవేంద్ర రావు.

స్విష్ దడుచుకుని ఫోన్ పెట్టేశాడు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

2 Responses to మరీ ఓవర్ చేయకురోయి!

  1. Zilebi says:

    ఆయ్ మా రే ఖగ’ వేంద్రుని మీద ఇంత సెటైరా ! ఉండండి మీ గురించి మరాపా గోల వర్మ కి చెప్పి మీ మీద ఒక సెటైరో త్రిల్లర్ చిత్రం తీయమని జెబ్తా 🙂

    చీర్స్
    జిలేబి

    • Murali says:

      సారీ తప్పై పోయింది. శ్యాం గోపాల్ వర్మకి మాత్రం చెప్పకండి. లోషే లాంటి సినిమానే భ్రష్టు పట్టించిన ఘనుడాయన. అలాంటి ఆయన నా మీద సెటైర్ వేస్తే నానేటి కాను!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s