మా ఆయన అలాంటోడు కాదు!


శంకర్రావు గారి ఫ్యామిలీ, శంకర్రావు గారు, దేవి, కుమార్, పార్వతమ్మ గారితో పాటు, కేశవ రావు గారు కూడా కూర్చుని టీవీలో, సైజ్ 100 సినిమా ఆడియో ఫంక్షన్ చూస్తున్నారు.

“తనుష్క చాల కష్ట పడి, ఈ సినిమా కోసమే ఇరవయి కేజీల బరువు పెరిగి, సినిమా షూటింగ్ అయ్యాక, మళ్ళీ రాహుకలి పార్ట్ 2 కోసం, తన ఒరిజినల్ వెయిట్‌కి వచ్చేసిందట. గొప్ప డెడికేషన్ కదూ! ఈ ఆడియో ఫంక్షన్ నిజానికి ఆమెకి ఒక సత్కారం వంటిది,” అన్నారు శంకరావు గారు.

“మరే, ఎప్పటిలానే దీనికి యాంకరమ్మ యాంకరయ్యలు, ఉమా ఇంకా వాలీ అట,” తనకు తెలిసిన ఇన్‌ఫర్మేషన్ తనూ అందించారు కేశవ రావు గారు.

ఐతే ఒక వైపు శంకర్రావు గారికి భయంగానే ఉంది. మంచి క్యామెడీ చేసే వాళ్ళని మంచి కమేడియన్స్ అంటారు కానీ, కమేడియన్‌లు ఏది చేస్తే అది క్యామెడీ కాదు. కానీ వాలీ ఆ మాట మరచి పోయి చాలా రోజులయ్యింది. గత కొన్నేళ్ళుగా ఆడియో ఫంక్షన్లలో డబుల్ మీనింగ్ డయలాగ్స్ చెప్తూ, ఫంక్షన్ ఫంక్షన్‌కి వాటి శ్రుతి పెంచుకుంటూ వస్తున్నాడు అతను.

సాధారణంగా ఇవి కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు కాబట్టి, ఫ్యామిలీ ప్రేక్షకులకి ఇది కాస్త ఇబ్బందిగా తయారయ్యింది. పేరుకి తగినట్టు రూపం కూడా కోతిలా ఉంటుంది కాబట్టి, సహజంగానే కోతి చేష్టలు చేస్తున్నాడేమో అని ఎంత సరి పెట్టుకున్నా, మెల్ల మెల్లగా వాలీ యాంకరింగ్ అంటేనే దడుచుకునే స్టేజ్‌కి వచ్చేశారు వాళ్ళంతా.

ఆడియో ఫంక్షన్ ప్రారంభమై కాసేపు కాగానే వాలీ ఫార్మ్‌లోకి వచ్చేశాడు. వాలీ మొహం క్షణ క్షణానికి వెకిలిగా మారిపోతూండడం గమనించి ఉమకి కూడా కాస్త టెన్షన్ మొదలయ్యింది.

ఇంతలో ఆ క్షణం రానే వచ్చింది. ఉమ అక్కడ ఉన్న ఒక హీరోయిన్‌ని వాయల సీమ స్టైల్‌లో తొడ కొట్టమని చాలెంజ్ చేసింది. ఆ పిల్ల ఆ చాలెంజ్‌ని స్వీకరించలేదు అనుకోండి. అది జరిగి కాసేపయ్యాక మైక్ తన చేతికి రాగానే, వాలీ ఆ సంఘటనని తన పైత్యపు క్యామెడీకి వాడుకోవడానికి తయారు అయిపోయాడు.

“ఇదిగో ఉమ, నువ్వు సరైన అమ్మాయిని చాలెంజ్ చేయలేదు. ఆ పిల్లకు తొడలే ఉండవు. నువ్వు ఆ చాలెంజ్ చేయాల్సింది తనుష్కకి. తన తొడలు…” అని వాలీ అంటూండగానే కుమార్ వేగంగా శంకర్రావు గారి చెవులు మూసేశాడు.

“నా చెవులు మూస్తావేంట్రా?” కసిరారు శంకర్రావు గారు.

“అంటే, ఆ బూతులు మీ లాంటి వాళ్ళు వినకూడదని,” నసిగాడు కుమార్.

“ఏడ్చినట్టు ఉంది. నువ్వు రక్షించాల్సి ఉంది మన ఇంట్లో ఉన్న ఆడ పిల్లని. ఏమేవ్! మన దేవి చెవులు మూసి పక్క గదిలోకి తీసుకునిపో. ఈ ఫంక్షన్ అయ్యాక నేను పిలుస్తానులే,” పార్వతమ్మ గారికి పురమాయించారు శంకర్రావు గారు.

పార్వతమ్మ గారు అలాగే చేశారు. ఈ లోగా వాలీ, తను తనుష్క గురించి ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగా మాట్లాడేశాడు. పైకి తనుష్క నవ్వు మొహం పెట్టినా, ఆమె ఈ క్యామెంట్స్‌కి బాగా హర్ట్ అయ్యిందని ఆ ఫంక్షన్ చూస్తున్న వారందరికి అర్థం అయ్యింది.

మొత్తానికి ఏదో ఆడల్ట్ సినిమాలా మిగతా కార్యక్రమాన్ని అక్కడ మిగిలిన మగవాళ్ళు మాత్రమే చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

******

మరుసటి రోజు కేశవ రావు గారు శంకర్రావు గారింటికి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది.

“ఆ అమ్మాయి సినిమాల్లో అసభ్యమైన దుస్తులు ధరించి ఉండవచ్చు కానీ, తను ఎప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్‌కి చాలా డిగ్నిఫైడ్‌గానే డ్రెస్ అవుతుంది. అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో కూడా అనవసరం, శంకర్రావు గారూ, పాయింట్ అది కాదు! ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో, ఆ ఫంక్షన్‌ని పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తున్నారని తెలిసి కూడా , ఆ కోతి వెధవ అలా వాగాడు ఏంటండి! పరమ దుర్మార్గుడు వాడు,” బాధగా అన్నారు కేశవరావు గారు.

“అతని కంటే దుర్మార్గపు శాల్తీ ఇంకొకరు ఉన్నారు. కాస్త టీవీ వైపు చూడండి,” అన్నారు శంకర్రావు గారు.

టీవీ వైపు చూసిన కేశవరావు గారికి స్క్రీన్ మీద వాలీ భార్య, విలేఖరులతో ఆవేశంగా మాట్లాడుతుండడం కనిపించింది.

“మా ఆయన అలాంటోడు కాదు. ఆయన ఏది చేసిన క్యామెడీ కోసమే. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఆయన్ను అంతా తిట్టిపోస్తున్నారు. మా ఆయన్ని పట్టుకుని వాడూ వీడూ అంటూంటే మరి నాకు బాధగా ఉండదా? ఆ విషయం ఎవరూ ఆలోచించరేంటి?” అంటూంది ఆమె.

“అది అలా ఉంచండి. జస్ట్ క్యామెడీ కోసం నేను మీ గురించి అలాంటి క్యామెంటే చేస్తే మీరు స్పోర్టివ్‌గా తీసుకుంటారా?” అడిగాడు ఒక విలేఖరి.

“చెప్పు తెగుద్ది!” కోపంగా సమాధానం ఇచ్చింది వాలీ భార్య.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

24 Responses to మా ఆయన అలాంటోడు కాదు!

 1. Venu Aasuri says:

  ఆయన భార్య సమర్థింపు చూస్తుంటే, భారతంలో కీచకుడికి భార్యలేదుగాని, ఉంటే తనని వెనకేసుకొచ్చేదేమో అనిపిస్తుంది.

  చాలా బాగుంది.

  • Murali says:

   LOL. Really funny. As Jitu mentioned below, just like “Orange is the new Black,” Keechakas seem to be the new role-models

 2. Jitu says:

  Are all wives like that?? For that matter.. are all men like that?? Never mind… this is a satire and I am losing my sense of humor, if it ever was present to begin with.

  In any case… Naaku mee TV anchor reference ardham kaa ledu(TV choodanu kaabatti), kaani Meeru cheppadalchkune visham mattuku ardham ayindi. Some anchor passing lewd comments on an actress in a live show.

  A few months ago AIB had done just that.

  For some people, like AIB and many of their ilk, specially those that do stand-up, making a distinction between comedy and vulgarity is difficult. Like there is color blindness, where a person cannot differentiate between colors, these specimens have common-sense-blindness, etiquette-blindless, etc.

  The problem is… pointing out a lack of etiquette, logic, common-sense or even basic courtesy, is seen and projected as ‘regressive’. And cheering the vulgarity is seen as ‘progressive’ and ‘modern’. So a regular person is caught between fitting in the crowd and following the basic manners he/she grew up with. One does not need to look further. Just check SM on any given day. Anyone hauling up a comedian for his misbehavior… and social media rips apart the person questioning. I can only imagine how it is in actual shows.

  About wives defending their husbands… guess besides political-correctness of the scenario, there is another aspect to it. Not just wives but sisters, mothers, fathers, brothers too defend. Kichakudu was supported by his sister and brother-in-law. Robert wadra is supported by his wife and mother-in-law. Bhai-bhateejawaad is not just rampant in India, I see it in my American friends too. ‘La familia’. “My son could never do such a thing”. “My daughter is an angel”… is as much common as “maa aayina alaatodu kaadu”.

  In India, there is another kind of kinship besides the one bonded by blood. In fact is stronger than blood ties. That of liberal, secular intellectuals. The secular-in-laws and intellectual-in-laws, stand by one another no matter what.

  Last lo choobetteru kadaa… “Thana daaka vaste, taguve ledu”. Hypocrisy and double-standards are up there in “The Guide to be a Progressive Individual”… right next to the rule of using double-entendres and filthy language.

  PS: Sorry about ranting wrt to a mere satire. Nothing seems funny these days. 😦 😦 “Orange is the New Black” laaga… Outraging is the latest fad. 😛

  • Murali says:

   Jitu,

   The thing with all the groups you mentioned above is, they are relentless in their propaganda. It’s a full time job for them, since they do never really do anything useful with their life. We, on the other hand, need to take care of a lot of real world things and also fight against this evil. So, it makes it even more imperative that we should never stop ripping their arguments apart.

   The idiot anchor in the post has been warned several times by several prominent people to check himself. He has not obliged. The reason is clear. There are some groups in our society that like this kind of “comedy.” These groups are his bedrock of strength. And he will never change.

   I am sure there are some among my readers too, who feel that what this male anchor has done is nothing outrageous. After all, she is a heroine and apparently a ‘loose woman.’ So anybody can comment anything about her. Never mind what it tells us about the character of the guy making those comments. This group is fine with that. They would even hail him for telling the “truth”.

   The reason why we should rip these “liberals” apart is not because we would change them. There are several people, younger adults mainly, in the middle, who are still forming their opinions about values and trying to shape their primary ideology. By fighting back, we provide this really important group a choice.

   May they choose wisely. 🙂

   -Murali

  • karthik says:

   cant help but agree with you Jitu garu, particularly these words:
   pointing out a lack of etiquette, logic, common-sense or even basic courtesy, is seen and projected as ‘regressive’. And cheering the vulgarity is seen as ‘progressive’ and ‘modern’.

 3. kinghari010 says:

  వాలీ ఎందుకిలా తయారయినట్టు చెప్మా?
  వాలీ ఇక ముందైనా మారతాడా,ఏమో!

 4. Ketan Kumar says:

  నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
  నీకోసమె కన్నీరు నించుటకు
  తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.

  అన్న పాట backgroundలో వినిపించింది నాకామె సమర్ధింపు చూస్తుంటే.

 5. kinghari010 says:

  Dear Mr.Murali

  “The reason why we should rip these “liberals” apart is not because we would change them. There are several people, younger adults mainly, in the middle, who are still forming their opinions about values and trying to shape their primary ideology. By fighting back, we provide this really important group a choice.”

  I fully agree with these opinion. By these words I could identify that you have a mission just like me.
  keep it up

  • Jitu says:

   Even among the ‘Younger adults’, I see a lot of close-minded liberals. In fact almost all self-proclaimed liberals seem pretty close minded.

   The ones with minds open enough to at least listen to both side of the story before forming an opinion, are not too liberal to begin with. They are the conservative kids, who thinks before they leap, who follow old wisdom. They are the only ones who are in the middle. These are the kids who weigh in right and wrong, in most situations independently before taking sides. Be it vulgarity or political ideology.

   If the mission is to influence their opinion, I hope this blog and more such blogs reaches these young readers.

 6. Ketan Kumar says:

  మితవాదం (liberalism) తప్పంటే దానర్ధం extremism (తీవ్రవాదం) ఒప్పనా?

  Sticking to the subject… అలీ చేసిన వ్యాఖ్యలు తప్పన్న భావతీవ్రతను, వారి మొహమాటాలు అధిగమించేశాయి. ఇదే అలీ ఒక ‘హీరో’ కూతురుని ఇలా కామెంటుచేస్తే, చాలా మంది walk-out చేసేవారు. హీరోభిమానులు మరికొంచెం ముందుకువెళ్ళి non-liberalగా సమాధానమిచ్చుండేవారు (అలీక్కూడా ఆ విషయం బాగా తెలుసుకాబట్టే, ఆ కొరివితో తలగోక్కోడు). చెప్పొచ్చిందేమిటంటే మనం చెప్పేనితులు చెప్పడానికే తప్ప (ఇలా బ్లాగుల్లో రాయడానికేతప్ప) అవేమీ ‘పరమంపవిత్రం’ కావు. అవన్నీ సభామర్యాద కొనగోటిక్కూడా విలువచెయ్యవు.

  గుండెల మీద చేతులూ, కాళ్ళూ వేసుకోవాల్సిన అవసరంలేదు మాస్టారూ… మీరేగనుక అదే సభలో ఉంటే, మీలో ఎంతమంది అలీ-పనిని నిండుసభలో ఖండించుండేవారు? అలా ఖండించిన సందర్భాలు మీ జీవితాల్లో ఏమైనా ఉన్నాయా? మీరు సాఫ్ట్వేర్ జీవులైనట్లైతే, మీ మేనేజరు నిండు సభలో (meeting లో) colleague మీద నోరు పారేసుకున్నప్పుడు ఎంతమంది ఆ మ్యానేజరుకు అదే సభలో తలంటుపోసారు? మీఈఓ మీరు మాట్లాడుకోండి బయటకు చెప్పఖర్లేదు.

  ఇంత అసభ్యకరమైన వ్యవహారాన్ని తెలుగుసినిమాభీష్ములందరూ నిమ్మకుండి కానించారు. కొందరైతే చప్పట్లతో ప్రోత్సహించారు. టిక్కెట్టు దొరకడమే ముఖ్యమనుకున్న జనం ఈలలువేసి తమ అభిరుచికి తగిన హాస్యాన్ని ప్రోత్సహించుండొచ్చు (నా భాగ్యం కొద్దీ నేను తెలుగు చానెళ్ళు చూడను కాబట్టి నాకు తెలీదు). మీరింతగా నీతులూ, సంస్కృతీ అంటూ గొంతు చించుకుంటున్నారే.. ప్రజాబాహుళ్యానికి పట్టని సంస్కృతీ, సంస్కారమూ ఎందుకుసార్?

  ఇంకా మాట్లాడుకుందాం… దీన్ని అధిక్షేపిస్తూ కోర్టులో అనూష్క కేసు వేస్తారా? పోనీ మీరు వేస్తారా? అంతా వట్టిమాటలుసార్ (దాన్నే హిందీలో బక్-చోదీ అంటారు). మనం నిత్యజీవితంలో పట్టించుకోని మర్యాదలను సభల్లో లోపిస్తేమాత్రం తెగ ‘ఇదై’పోతాం.

  • Murali says:

   నన్ను ఇలా ఆవేశ పడడం అనవసరం అని చెప్తూ మీరు చాలా ఆవేశ పడ్డారు. 🙂 ఎవరి ఆవేశం వారికి ముద్దు.

   మీరు దివ్య దృష్టితో మా (నా) ప్రవర్తన ఊహించారు. For example, not speaking against the manager when he is blasting a colleague, లేదా అందరు నీతులు చెప్తారు కానీ పాటించరు అని, లేదా నేను ఒక్క ఆలీనే నిందిస్తున్నాను, సినీ భీష్ములని, అభిమానులని, ప్రజల్ని తప్పు పట్టడం లేదని.

   మీ దివ్య దృష్టి మీకు చాలా విషయాలు చెప్పింది. కానీ మీ దివ్య దృష్టి రాంగ్. మీరు ఇంకొంత ప్రాక్టీస్ చేయాలి. 🙂

   The crux of your argument is అందరూ ఈ పరిస్థితికి బాధ్యులే కాబట్టి అందరూ ఏ తప్పు జరిగినా ఏమీ అనకుండా నోరు మూసుకుని కూర్చోవాలి. అస్సలు ఆవేశ పడకూడదు. ఒక వేళ ఎవరైనా ఆవేశపడితే మీరు ఆయాసపడతారు. మనం ఏం చేసినా ఈ సమాజం మారదు. కాబట్టి మేము ఆవేశ పడకూడదు. ఆవేశపడే చాన్స్ మీ ఒక్కరిదే, అంతేనా?

   ఇంకా Specificగా మీరు చెప్పేది, ఈ వాదన్లు, బ్లాగులు అన్నీ వేస్ట్. ఒక వేళ ఆలీ లాంటి వారు అసభ్యంగా సభలో ఏదైనా మాట్లాడితే, వెంటనే అరిచి, గోల చేసి, ఆయన్ను స్టేజ్ మీద నుంచి దింపెయ్యక పోతే, వారంతా నీతులు చెప్పకుండా నోరు మూసుకుని కూర్చోవాలి. లేకపోతే మీరు నోరు తెరుస్తారు.

   మీ రెస్పాన్స్ చూస్తూంటే , “గాయం” సినిమాలో సిరివెన్నెల గారు పోషించిన పాత్ర గుర్తుకి వస్తూంది. ఆయన పాత్ర అంతే, తప్పు చేసే వారిని విమర్శించదు కానీ, ఎవరైనా ఏదైనా తప్పుని వేలెత్తి చూపిస్తే, వారి మీద చెల రేగి పోతుంది. ఆ సినిమాలో విలన్ కంటే కూడా చిరాకు పుట్టించే పాత్ర అదే. 🙂

   • “ఒక వేళ ఆలీ లాంటి వారు అసభ్యంగా సభలో ఏదైనా మాట్లాడితే, వెంటనే అరిచి, గోల చేసి, ఆయన్ను స్టేజ్ మీద నుంచి దింపెయ్యక పోతే, వారంతా నీతులు చెప్పకుండా నోరు మూసుకుని కూర్చోవాలి.”
    మీకు బాగానే అర్ధం అయ్యింది. అదైనా చెయ్యొచ్చు. లేదా కనీసం నిరసనగా వాకౌట్ చెయ్యొచ్చు. ఈ రెండూ చెయ్యలేని వాళ్ళకు (తమ నిజజీవితాల్లో అలా చెయ్యనివాళ్ళకు) నీతులు చెప్పే నైతిక హక్కు ఉండదు. ‘గాయం’ నాగ్గుర్తులేదు. ‘సూత్రధారులు’ ప్రయత్నించండి. ఏది మంచిదన్న ‘తేట’ (clarity) జనాలకేలేనప్పుడు extremist ‘తీట’ ఎవరికీ మంచిదికాదు.

    నేను ఆవేశపడడంలేదు. మనమెప్పుడో మరిచిపోయినవిలువలని మనమింకా రాతల్లో పట్టుకువేలాడుతూ ఇంకొకరు అనుసరించట్లేదని ఆవేశపడిపోయే extremist మేధావుల హిప్పోక్రసీని చూసి నవ్వుకుంటున్నాను. నిజంగానే చెపుతున్నాను నేనీమీ ఆవేశపడుతూ అది రాయలేదు (in fact, ఆవేశం కూడదన్న భావం నా వ్యాఖ్యలో ప్రతివాక్యానా కనిపిస్తుంది) మీక్కుంచెం గట్టిగా తగిలిందంటే!

    నా దివ్యదృష్టితో ఒకవిషయం చెప్పనా… ఇలాంటి non-liberal కామెడీరాతలు చదువుకోడానికి బాగుంటాయి. నవ్వుతెప్పిస్తాయి. వీతివల్ల short-termలో కానీ long-termలో కానీ ఏ ఉపయోగమూ ఉండబోదు. ఎందుకంటే.. సభ్యత అనేది అంత ముఖ్యమని ఇప్పుడెవరూ అనుకోవడంలేదు (ఉదా :- జబర్దస్త్ కార్యక్రమం). సభ్యతకంటే ముఖ్యమైన విలువలు మనకు చాలానే ఉన్నాయి (ఇంతకుముందొకసారి నేను చెప్పునట్లు) సభామర్యాద, loyalty to the caste, people, industry and defending them.

   • Murali says:

    “ఒక వేళ ఆలీ లాంటి వారు అసభ్యంగా సభలో ఏదైనా మాట్లాడితే, వెంటనే అరిచి, గోల చేసి, ఆయన్ను స్టేజ్ మీద నుంచి దింపెయ్యక పోతే, వారంతా నీతులు చెప్పకుండా నోరు మూసుకుని కూర్చోవాలి. ఒక వేళ ఎవరైనా ఆవేశపడితే మీరు ఆయాసపడతారు.” -Murali

    మీకు బాగానే అర్ధం అయ్యింది. అదైనా చెయ్యొచ్చు. లేదా కనీసం నిరసనగా వాకౌట్ చెయ్యొచ్చు. ఈ రెండూ చెయ్యలేని వాళ్ళకు (తమ నిజజీవితాల్లో అలా చెయ్యనివాళ్ళకు) నీతులు చెప్పే నైతిక హక్కు ఉండదు. -Ketan Kumar

    అది సరే మాస్టారు. నేను కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటాను.

    కానీ ఫంక్షన్ అటెండ్ కాకుండా, అక్కడ జరిగిన ఒక విషయం తెలిసి, అది నచ్చక దాని గురించి స్పందిస్తున్న మా మీద ఎందుకని విరుచుకుపడ్తున్నారు? మేము అంతా ఆ ఫంక్షన్‌లో ఆడియెన్స్‌లా ఏమీ చేయలేని వాళ్ళం అని as usual మీ దివ్య దృష్టితో కనిపెట్టేశారా? 🙂

    (అందుకే, Jitu మీకిచ్చిన సమాధానంలో ఒక వేళ అలా చేసినా పెద్దగా లాభం ఉండదు అన్న ఉదాహరణ ఇవ్వబడింది. అందుకే, “So passively influencing the way of thinking of people via blogs and articles is much better than creating a furore for everything. Furore begets a backlash.# అని తను రాసింది.)

    మీ మొదటి క్యామెంట్ నిండా ఇలాంటి అవాకులు చెవాకులు చాలానే ఉన్నాయి. అసలు అది మొట్ట మొదట చదివినప్పుడే, ఈయన గారు ఏం చెప్పదలుచుకున్నారు, ఈయన గారి ఆక్రోశం ఆక్రందన దేని గురించి అని అనుకున్నాను.

    అయినా మీకు benefit of doubt ఇచ్చి మీ వ్యాఖ్యకు సమాధానం ఇచ్చాను. దానికి ప్రతి సమాధానం మీరు రాశాక అర్థమయ్యింది, మీరు attention కోసమే కానీ, అర్థవంతంగా ఉండాలని రాయడం లేదని. (Of course, you were successful in getting that attention. Negative, it might be. But do people like you care? 🙂 )

    ఎందుకంటే, నేనొకటి అడిగితే మీరొకటి చెప్తున్నారు. ఉదాహరణకు మీకు వ్యంగ్యం గురించి బొత్తిగా తెలీదని మీ రెండో కామెంట్ తెలియ జేస్తూంది.

    నేను liberals అన్న పదం quotation makrsలో పెట్టి వాడాను. వాళ్ళు నిజమైన liberals కారు అని దాని అర్థం. పాపం మీకు అది అర్థం అయినట్టు లేదు. కాబట్టి మీ రెండవ వ్యాఖలో, extremist అంటూ, అతి అంటూ, సగం వ్యాఖ్య ఆ సబ్జెక్ట్ మీదే రాశారు.

    అలాగే నా వ్యాఖ్యలోని అతి ముఖ్యమైన వ్యంగ్యం కూడా మీకు అర్థం కాలేదు. “మమ్మల్ని విమర్శించద్దూ అంటూ మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారేంటి?” అని అడిగాను. ఉహూ. మీ నుంచి సమాధానం లేదు.

    నేను ఆవేశపడడం లేదు అని పదే పదే ఒట్టు వేసుకున్నారు. మీరు అంత భుజాలు తడుముకోనక్కర్లేదు. మీ మొదటి కామెంట్ లోని ప్రతి వాక్యంలో మీ ఆవేశం, అవహేళన కనిపిస్తూనే ఉన్నాయి. పైగా ఆవేశం కూడదన్న భావం మీ ప్రతి వాక్యంలో కనిపిస్తుందని ఇంకొక అబద్ధపు వివరణ!

    గాయం సినిమా గుర్తు లేదంటూ, ఆ టాపిక్‌ని దాట వేయాలని చూశారు. మీరు తప్పక చూడాల్సిన సినిమా అది. అందులో సిరివెన్నెల పాత్రని చూసి, మీరు ఈలలు వేస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తారు. మీ mindsetకి ఆ పాత్ర మహా బాగా నచ్చుతుంది. 🙂

    మీకు ఎక్కడెక్కడ ఏమేం తగలాలో అన్నీ సరిగ్గా తగిలాయి అని నాకు తెలుసు. అయితే మీరు ఒక “మేధావి” కద! కాబట్టి ఒక అప్రస్తుతమైన వ్యాఖను ఇంకో అసంబద్ధమైన వ్యాఖ్యతో కవర్ చేయాలని ప్రయత్నించారు పాపం.

    నేను రాసిన పోస్టూ అర్థం కాలేదు, ఇచ్చిన సమాధానం వంట పట్టలేదు. మీకు దివ్య దృష్టి ఏంటి మీ మొహం! కనీసం హ్రస్వ దృష్టి కూడా లేదు. 🙂

    నేను ఈ బ్లాగ్ రాసేదే, మీ లాంటి “మేధావుల” నుంచి సగటు పాఠకులని కాపాడడానికి. 🙂 అందుకే సాధారణంగా, మీ లాంటి వారి కామెంట్స్ నా బ్లాగ్‌లో ప్రచురించి, నా బ్లాగుని మీకో వేదికగా చేయను. మామూలుగా ఐతే, అవి చెత్త బుట్టలోకి పోతాయి.

    ఐతే అప్పుడప్పుడు మీలాంటి వారు చేసే మరీ తేడా కామెంట్స్ వస్తూంటాయి. అలాంటి వాటిని ప్రచురించి వాటికి సమాధానం ఇస్తాను. ఎందుకంటే, మీ లాంటి “మేధావులు” ఎలా ఆలోచిస్తారో ఈ బ్లాగు పాఠకులకు తెలిస్తే, వాళ్ళకు నేను చెప్పదల్చుకుంది ఇంకా బాగా అర్థం అవుతుంది అని, తద్వారా వాళ్ళకు ఇంకాస్తా వినోదం వస్తుందని. ఆ రకంగా మీ కామెంట్ నాకు ఉపయోగ పడింది!

    Jitu సమాధానంలో ఇంకో మంచి పాయింట్ ఉంది. ప్రైవేటుగా ప్రవర్తించినట్టు పబ్లిక్‌గా ప్రవర్తిస్తే కుక్కలకు మనుషులకి తేడా ఉండదని. అర్థమయ్యింది అనుకుంటాను! మళ్ళీ కుక్కలు మనుషుల కంటే ఎంతో మేలు అంటూ ఇంకో తల తిక్క కామెంట్ రాయకండి.

    ఎందుకంటే, ఇప్పటి వరకు సరదాగానే ఉంది, మీతో బక్-చోదీ కానీ (అదే సార్ మీ మొదటి కామెంట్‌లో మీరు మొదలు పెట్టిన బక్-చోదీ కి సమాధానం ఇవ్వడం), ఇక పొడిగించడం అనవసరం. కనీసం నా పాఠకులకు క్యామెడీ కూడా దొరకదు. శుద్ధ వేస్ట్!

    కాబట్టి ఇంకో కామెంట్ పెట్టకండి. దాన్ని ప్రచురించను. సమాధానం అసలే ఇవ్వను.

    మీరే చెప్పినట్టు, నా బ్లాగ్ మీకు నచ్చలేదు కాబట్టి, నిరభ్యంతరంగా వాకౌట్ చేయండి.

    You won’t be missed. 🙂

  • Jitu says:

   Muraligaaru… ‘Ad hominem’, the flavor of the season. 😀 😀

   KKgaaru,

   You ask how many times one has seen a person object to vulgarity in a live show. I can answer that. A stand-up comedian in India made crude jokes about 1. The PM and 2. Some Hindu gods.

   Now, in a truly liberal society, neither of those should be beyond criticism/mockery. I agree.

   But the aforementioned stand-up comic is famous for his secular credentials and makes fun of only Hindu gods. Well, it so happened that a lady felt offended and objected to it. She even mentioned that the crude remarks being passed on the PM are non-factual hence should come with a disclaimer ‘at least’.

   Guess what… the comic retorted back saying that if she has a problem, she could leave. He went on further and asked as to why she purchased the ticket to watch the show to begin with. The audience rose up to support the stand-up comic and boo-ed the lady.

   So it’s not like individuals don’t take a stand. It’s just that such feisty individuals find themselves alone when they raise their voice.

   So passively influencing the way of thinking of people via blogs and articles is much better than creating a furore for everything. Furore begets a backlash.

   You ask another question… if liberalism is bad is radicalism good.

   In theory, liberalism is an ideology based on the idea of equality and liberty. But in a left-centric country like ours, only mocking certain sections of the society considered liberal. Criticizing traditional values is considered progressive. Why should there be disparity?? If one person can mock one section of the society, another person should have the freedom to mock any other section of their choice. Which means every individual has the right to mock the section of his/her choice, which will eventually balance out. But that is not how our society works. Does it?? Freedom of choice, freedom of speech, freedom of anything… are usurped by a leftist few and the rest of the populace is left to vent it’s frustration out.
   Some turn radical in retaliation and others take to a somewhat saner approach of indirect-speaking. Blogs, articles, opeds… all fall into this category. More popular the speaker, the wider his/her reach.

   Another funny point you raised… “మనం నిత్యజీవితంలో పట్టించుకోని మర్యాదలను సభల్లో లోపిస్తేమాత్రం తెగ ‘ఇదై’పోతాం.” I am not sure but that is the reason why there is a demarcation between, ‘Personal’, ‘Private’ and ‘Public’. I am not talking of hypocrisy where a person has one rule for himself but another for others. I am talking about how a person behaves in private has no bearing on how he behaves in public. The exact same comment between two lovers can be romantic where as if passed in public is considered vulgar. A gesture which in private is acceptable may not be acceptable in public.

   Umm… to put it crudely… that is what distinguishes men from dogs.

 7. Zilebi says:

  ఈ వాలి ఎవరు ! తనుసఖ ఎవరు ? అంతా గందర గోళం గా ఉంది . దీని వెనుక కథ ఏమన్నా ఉందేమో ?

  జిలేబి

  • Murali says:

   అదేంటి జిలేబి గారు! వాలీ, ఉమ, తనుష్క ఎవరో మీకు తెలీదా? హెంత విడ్డూరం!

 8. Siva Kumar K says:

  మురళి గారూ నీ అవార్డ్ నువ్వేతీసుకోరా సిరీస్ లో — అధోగతీ రప్ప గురించి ఓ నాలుగు లైన్లు ఆశిస్తున్నా… 😉 🙂

  • Murali says:

   అధోగతి రాయి లేకుందా ఆ సిరీస్ ఎలా పూర్తి అవుతుంది? పార్ట్ 3లో ఉందిగా! 🙂

   Pasting them for your convenience:

   ఇలాంటి మేధావులకు తలమానికమైన అధోగతి రాయి మనం షాక్మీరు ప్రజలను రాచి రంపాన పెట్టడం మూలానే పీకిస్తాన్ దుండగులు డుంబై దాడులు చేసారని వాక్రుచ్చింది కూడా.”

   “అన్నట్టు ఆవిడ కూడా అవార్ద్ తిరిగి ఇచ్చేసిందండోయి!”

   “అసలు ఇంత ఆలస్యం చేయడమే ఆశ్చర్యం. ఈ ఐడియా తనకే ముందు ఎందుకు రాలేదని కుమిలిపోయి ఉంటుంది పాపం.”

 9. ashok8734 says:

  meeru maatv/etv gurtuledu oka game show vastundi adi chudandi. naku ali comedy ante istam kani recent cinemalo ali comedy vegutu kadu vantiki vastundi. mukhyanga puri cinemalalo. ee comedy showlalo sruthiminchutundi boothucomedy. ali ippatikaina artham chesukunte melu. ayana bharya nijanga venakesukochchinda damn ali = vulgarity la thayaru ayyadu.

  • Murali says:

   I think you are talking about the “Ali 369” show. I have seen it a few times and couldn’t stand it.

   As you said, Puri has been a bad influence on Ali. Especially after the “Lachimi” role in the movie “Chiruta”, Ali’s comedy started turning more and more vulgar.

   So, I have been avoiding Ali, along with a lot of my friends, for the last couple of years.

   ఆలీ స్క్రీన్ మీద రాగానే మా ఫ్రెండ్స్ నుంచి విన వచ్చే మాట, “వెకిలి వెధవ మళ్ళీ వచ్చాడు. ఈ సారి ఏం వాగుతాడో?” అని. We all used to like Ali’s comedy to varying degrees before. Not any more.

   This is the video where his wife is seen defending Ali’s actions:

 10. రవి says:

  ఎలాగో ఆ షో మిస్ అయి ప్రాణాలతో బతికి ఉన్నాను. అలీ ఆంకరింగ్ బ్లూ ఫిలిమ్ ఆడియో కేసెట్ కన్నా ఘోరం.

  మీ పోస్టు కన్నా, పైన కామెంట్ల వరుస ఇంకా బాగా అలరించింది. మేధావిత్వం జిందాబాద్ అని మనసులో కేకలు పెట్టుకున్నాను 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s