ఈ రోజు టెర్రరిస్టులకు సెలవా? – 1


“నాన్నోయి నాన్న!” గట్టిగా అరుచుకుంటూ వరండాలోకి వచ్చాడు కుమార్. యదా విధిగా శంకర్రావు గారు కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు.

“ఏంట్రా ఆ గావు కేకలు? ఏమయ్యింది ఇంతకీ?” కాస్త విసుగ్గానే అడిగారు శంకర్రావు గారు.

“ఈ రోజు లేవగానే అర్ధ గంట టీవీలో న్యూస్ చూశాను, నాన్నా! ఒక్క టెర్రరిస్ట్ అటాక్ కూడా లేదు. ఎంత ఆశ్చర్యం కదూ! అందుకే ఈ ఆదుర్దా, అరుపులూ!”

“టీవీలో చూపెట్టేదే న్యూస్ కాదురా అబ్బాయి. ఇంకా చాలా sources ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు జరగడానికి వీలే లేదు. నాకు గుర్తున్నంత వరకు, నువ్వు పుట్టినప్పటి నుండి, ప్రతి రోజూ, అహ్మదీయ టెర్రరిస్టుల దుశ్చర్యలు లేని రోజు లేదు.”

“నాకు తెలుసు నాన్నా! షాక్మీరులోనో, చిరాక్‌లోనో, ఇకరాన్‌లోనో, ఈఫ్రికాలోనో, ఐ-రోప్‌లోనో, ఏదో ఒక చోట, రక రకాల సంస్థలకు చెందిన అహ్మదీయ ఉగ్రవాదులు, సామాన్య పౌరులని బాంబులు వేసి చంపడమో, BK-47లతో, థియేటర్లలోనో, ఆడిటోరియంలలోనో ఎక్కడో ఒక చోట దూరి కాల్చడమో, ట్రెయిన్లు పేల్చేయడమో, ప్లేన్లు కూల్చేయడమో, లాంటివి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏమీ లేకపోతే, పీకిస్తానులో అహ్మదీయులు (షున్నీలు, జియాలు) ఒకర్ని ఒకరు చంపుకుంటారు. కానీ నీ మీద ఒట్టు! ఈ రోజు అలాంటి ఒక్క సంఘటన కూడా రిపోర్ట్ చేయలేదు.”

“నేను నమ్మను! ఉండు, పేపర్ మొత్తం తిరగేస్తా,” అంటూ శంకర్రావు గారు, పేపర్ సాంతం పరీక్షించారు. “నిజమేరా, ఒక టెర్రరిస్ట్ అటాక్ కూడా లేదు,” అని ఒప్పుకున్నారు.

“పేపర్లోనే కాదు, సార్! పొద్దున్నుంచి రేడియో వింటున్నా కద, అందులోనూ ఇలాంటి వార్తలేవీ వినలేదు,” అప్పుడే అక్కడికి వచ్చిన కేశవరావు గారు అన్నారు.

“ఇంకా రేడియో వింటున్నారా అంకుల్?” ఆశ్చర్యంగా అడిగాడు కుమార్.

“అంటే మా ఇంట్లో నాకు టీ.వీ. దొరకదు కద బాబూ. అందుకే ఇలా అడ్‌జస్ట్ అయిపోతాను,” చెప్పారు కేశవ రావు గారు.

“అంతర్జాలం ఏమంటూందో?” సాలోచనగా అన్నారు శంకర్రావు గారు.

“అంతర్జాలమా, అదేంటి?” ఆశ్చర్య పోయారు, కేశవ రావు గారు.

“Internet సార్. మన వాళ్ళు ఇలా ఈ మధ్య అన్ని హింగ్లీష్ పదాలకి, తెగులు ప్రత్యమ్నాయం ఉండేలా చూసుకుంటున్నారు,” కించిత్ గర్వంగా చెప్పారు శంకర్రావు గారు.

“నీకో విషయం తెలుసా నాన్నా? ఇలాంటి కొత్త తెగులు పదాలు విని జడుసుకుని, మా యూత్ కొంత మందికి తెగులు నేర్చుకోవాలన్న ఆసక్తి చచ్చిపోతూంది,” చెప్పాడు కుమార్.

“ఏడ్చారులే! నేర్చుకోకుండా ఉండడానికి అదొక సాకు, అంతే! ఇంతకీ internet మీద ఏమన్న టెర్రరిస్ట్ అటాక్స్ న్యూస్ ఉందేమో?”

“లేదు నాన్నా, నేను పొద్దున్నుంచి జ్వాలా జంబూకం వాడి బోలెడు గూళ్ళకి విహరించాను. ఎక్కడా ఏమీ లేదు,” అప్పుడే వచ్చిన దేవి చెప్పింది.

“ఏమే? నువ్వు మాట్లాడుతూంది తెగులేనా?” జుట్టు పీక్కున్నంత పని చేశాడు కుమార్.

“సారీరా అన్నయ్య, నీ తెగులు కొంచెం బలహీనం కద! నేను చెప్పింది చాలా sites firefox వాడి browse చేశానని,” ట్రాన్స్‌లేట్ చేసింది దేవి.

“ఓహో, ఐతే నిజంగానే ఈ రోజు ఏ టెర్రరిస్ట్ అటాక్ జరగలేదన్న మాట! కాబట్టి ఈ విషయాన్ని మనమే కాకుండా మొత్తం ప్రపంచం కూడా గుర్తించే ఉంటుంది. పదండి, ఈ పాటికి వివిధ చానెళ్ళలో దీని గురించి చర్చ జరుగుతూంటుంది. టీవీ చూద్దాం,” సజెస్ట్ చేశారు శంకర్రావు గారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s