ఈ రోజు టెర్రరిస్టులకు సెలవా? – 2


టీవీ పెట్టగానే, DNTV చానెల్‌లో తమ అభిప్రాయాలు చెప్పడానికి కూర్చున్న పాత్రికేయులు, రాజకీయ నాయకులు, కళాకారులు దర్శనమిచ్చారు.

“నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. చూశారా? ఈ సింధూ మతోన్మాదులు అందరూ, అస్లాం చాలా violent మతం అని, ఎప్పుడూ ఏదో ఒక చోట, ఏదో ఒక అకృత్యం చేస్తూనే ఉంటుందని నోరు పారేసుకుంటూంటారు. కానీ చూడండి. ఈ రోజు మొదలై 20 గంటలు అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ నుండి కూడా అహ్మదీయులు చేసిన ఒక్క ఉగ్రవాద చర్య మన దృష్టికి రాలేదు. అస్లాం నిలువెల్లా శాంతితో నిండిపోయిన మతం అని చెప్పడానికి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి?” ఆవేశంగా అడుగుతున్నాడు ఉత్త ప్రదేశ్ లీడర్ ముభావం సింగ్ యాదవ్.

“మీరు అన్నది అక్షరాలా నిజం. దీనికి మా కళాకారుల కృషి కూడా ఎంతో ఉంది. మన హిండియాలో చాలా మంది మేధావులు, కళాకారులు తమకు వచ్చిన కమల శ్రీలు, కమల భూషణ్‌లు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం వల్ల, అస్లామిక్ స్టేట్ వారు కడు సంతసించి, ఈ రోజు ఏ ఉగ్ర వాద చర్య చేపట్టలేదు. ఒక వేళ మనము ఎలాగో అలా సురేంద్ర మోడీని దింపేస్తే, అస్లామిక్ స్టేట్ ఆయుధాలనూ, హింసనూ విసర్జించి, జన జీవన స్రవంతిలో కలిసి పోతూంది! అర్థం చేసుకోరూ! ఎందుకైనా మంచిది, మన వెంగలూరు ఎయిర్ పోర్ట్‌కి తుప్పు సుల్తాన్ పేరు పెట్టి అతని దేశభక్తిని గౌరవిద్దాము,” అన్నాడు రిగీష్ కర్నాడ్.

“అందుకే నేను మన దేశ ప్రజలకి విజ్ఞప్తి చేసేది. మత పరమైన అసహనం ఉంది అని ఘోషిస్తున్నారని, మన మేధావులని తప్పు పట్టకండి. అలా చేస్తే, మన దేశ ప్రజలు ఎంత అసహన పరులో అందరికి తెలిసిపోతుంది. అంతా సహనంగా మన అసహనం గురించి వినండి,” హితవు చెప్పాడు సాహుల్ గాంధి.

“ఇందుకే నేను సాహుల్ గాంధిని రాజకీయాల్లో రైజింగ్ స్టార్ అని పిలిచేది,” చెప్పాడు అసంతృప్త జే.బీ.పీ. లీడర్ మితృఘ్న సింహా.

“ఒక సారి మిగతా ప్రముఖుల అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం,” అన్నాడు టీవీ యాంకర్. టీవీ స్క్రీన్ మధ్యలో రెండు భాగాలుగా చీలింది. రెండో భాగంలో ప్రఖ్యాత హీరో హమీర్ ఖాన్ మొహం దర్శనమిచ్చింది.

“ఈ రోజు ఒక్క ఉగ్రవాద చర్య కూడా ఇప్పటి దాకా జరగలేదు. ఎందుకంటారు?” ప్రశ్నించాడు టీవీ యాంకర్.

“ఎందుకు జరగడంలేదు? మన దేశంలోనే బోలెడు జరుగుతున్నాయి. మత పరమైన అసహనం పూర్తిగా పెరిగి పోయింది. మా ఆవిడీ రికన్ రావు ఇంత అసహనమైన దేశంలో ఉండేందుకు తనకి సహనం లేదనీ, మనమంతా వేరే ఏదైనా దేశానికి వలస పోదామని సజెస్ట్ చేసింది. నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తూంటే, మీ కాల్ వచ్చింది,” చెప్పాడు హమీర్ ఖాన్ బాధగా.

“ఓ! ఏ దేశానికి టికెట్ బుక్ చేసారు? పీకిస్తాన్‌కా?” ఆసక్తిగా అడిగాడు యాంకర్.

“ఎహే, అక్కడికెందుకు పోతాను? ఈ మధ్య షాక్మీర్ ప్రశాంతంగా ఉంది కద, అక్కడికి ఒక ట్రిప్‌కి వెళ్దామని,” చెప్పాడు హమీర్ ఖాన్.

“ఓహో! ఇంతకి మీకు హిండియాలో అసహనం పెరిగి పోయింది అని ఎప్పుడు అనిపించింది?”

“నా ఆఖరి సినిమా, “పీకేయి” వరకు పరిస్థితి కాస్త అదుపులోనే ఉంది. నేను సింధూ మతం యొక్క మూఢ విశ్వాసాలను అవహేళన చేసినా, సింధువులు ఎవరూ ఏం పీకలేదు. కానీ ఈ మధ్య గోవధ గురించి చర్చ మొదలయ్యాక, నాకు సడన్‌గా ఎటు చూసినా అసహనమే కనిపిస్తూంది.”

“ఈ ప్రభుత్వంలో, హమీర్ ఖాన్‌కే రక్షణ లేదు. కావున మోడీ ప్రభుత్వం మూకుమ్మడిగా రాజీనామా చేయాలి అని గాంక్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూంది,” పిడికిలి బిగించి అరిచాడు సాహుల్ గాంధి.

“అవును! నేను కూడా సాహుల్ గాంధిని సమర్థిస్తాను. రాజీనామ చేయని పక్షంలో, కనీసం మన ప్రధాన మంత్రి మోడీ దీన్ని ఒక ఎమెర్జెన్సీలా భావించి, వెంటనే హమీర్ ఖాన్ ఇంటికి వెళ్ళి, ఆయన దేశం వదిలి పారిపోయేంతలో, ఆయన్ని బుజ్జగించి ఆపాలి,” డిమాండ్ చేశాడు ముభావం సింగ్ యాదవ్.

“మొన్న మీ రాష్ట్ర మంత్రి హజం ఖాన్, రేప్ బాధితురాలైన ఒక స్త్రీని బుజ్జగించినట్టా?” అడిగాడు టీవీ యాంకర్. ( ఆ సంఘటనలో హజం ఖాన్, ఆ స్త్రీని, “రేప్ అయిన విషయాన్ని పది మందిలో పబ్లిసిటీ కోసం సిగ్గు లేకుండా చెప్పుకుంటావా?” అని మందలించాడు లెండి.)

“అనవసరంగా టాపిక్ మార్చకండి. ఇప్పుడు మనం మాట్లాడుతూంది, మత పరమైన అసహనం గురించి. అబ్బాయిలు రేపుల్లాంటివి ఏవేవో చేస్తూంటారు. దానికీ, దీనికీ పోలికేంటి?” అసహనంగా అన్నాడు ముభావం సింగ్.

“ఇంకో గంటలో ఈ రోజు పూర్తవుతుంది. ఇది ఒక అపూర్వమైన దినం. విశ్వ శాంతి మనుగడకి గొప్ప ఋజువు. ఇంకా ఎన్నెన్నో!” ఆవేశంతో రిగీష్ కర్నాడ్ గొంతు బొంగురు పోయింది.

“నిజమే కేశవరావు గారు, ఇదంతా చూస్తూంటే నాకు కూడా ప్రపంచానికి మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తూంది,” వణుకుతున్న గొంతుతో అన్నారు శంకర్రావు గారు.

“ఆగండి, ఏదో బ్రేకింగ్ న్యూస్ వస్తూంది, అది చూద్దాం,” అన్నాడు టీవీ యాంకర్.

ఇంకొక న్యూస్ రీడర్ మొహం టీవీ మీద ప్రత్యక్షమయ్యింది.

“ఇప్పుడే అందిన తాజా వార్తలు. పీకిస్తాన్‌లో ఒకరి నమాజ్ వేళ ఒకరు బాంబులు వేసుకుని, నూట పాతిక షున్నీలూ, జియాలూ చనిపోయారు. చిరాక్‌లో మానవ బాంబు పేలి ఒక ఎనభయి మంది మృతులయ్యారు. జిరియాలో ఎవరు ఎవరి మీద దాడి చేశారో మేము కనిపెట్టలేక పోయాం కానీ, మొత్తానికి రెండొందల మంది దివంగతులయ్యారు. ఐరోప్‌లోని ఒక కాఫీ హోటెల్‌ని అస్లామిక్ స్టేట్ దుండగులు చుట్టు ముట్టారు. చనిపోయిన వారి సంఖ్య తేలలేదు. ఈ వార్తలన్నీ ముందుగానే మీకు అందించలేక పోయినందుకు సారీ. ఎందుకంటే ఈ సంఘటలు జరిగిన ప్రదేశాల్లో న్యూస్ కవర్ చేస్తున్న విలేఖరులని, టీవీ సిబ్బందినీ, అందరి కంటే ముందుగా లేపేయడం వల్ల, మాకు వార్త అందడానికి ఆలస్యం అయ్యింది,” వెల్లడించింది ఆవిడ.

బ్రేకింగ్ న్యూస్ అయిపోగానే, కళాకారులూ, పాత్రికేయులూ, రాజకీయ నాయకులూ హడావుడిగా టీవీ స్టూడియో నుండి నిష్క్రమించారు,

“చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామనుకున్నా, ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చి అంతా పాడు చేసింది,” తనలో తాను గొణుక్కుంటూ బయట పడ్డాడు ముభావం సింగ్ యాదవ్.

“విశ్వ శాంతి కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలనుకుంటా,” అంటూ లేచి నిలబడ్డారు శంకర్రావు గారు. మిగతా వారు కూడా ఎవరి పనులు వారు చూసుకోవడానికి అక్కడినుండి నిష్క్రమించారు.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

3 Responses to ఈ రోజు టెర్రరిస్టులకు సెలవా? – 2

 1. kamudha says:

  అమీర్‌ఖాన్ విషయం ఇంత సింపిల్‌గా తేల్చేయడం నాకు నచ్చలేదు.

  • Murali says:

   తేల్చేయ్య లేదు. హమీర్ ఖాన్ అప్పుడప్పుడు అసహనంగా దర్శనమిస్తూనే ఉంటాడు. 🙂

 2. GKK says:

  మితృఘ్న సింహా- it is too good. cracker of a satire

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s