రామదండులాగ అందరొక్కటౌదామా! (ఆధునిక బేతాళ కథలు – 5)


పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా స్మశానము కేసి నడువ సాగాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నీ శ్రమ, దీక్ష చూస్తూంటే నాకు ముచ్చటేస్తూంది. పేరు కోసం మాత్రమే జనానికి సహాయం చేసే వారి గురించి నువ్వు ఎప్పుడూ వార్తా పత్రికల్లో చదువుతూంటావు, ఇంకా టీవీలో చూస్తూంటావు. అయితే నీ లాంటి వారికి తెలియని ఇంకో కోణం కూడా ఉంది. ఇప్పుడు నీకు అలాంటి కథే ఒకటి చెప్తాను, విను,” అంటూ మొదలు పెట్టాడు.

“హిండియాలో దక్షిణాదిన నెచ్చై అనే మహా నగరం ఉంది. అక్కడ సాధారణంగా ఎప్పుడూ ఫెళ్ళుమని ఎండ కాస్తూంటుంది. చలికాలంలో కూడ అర పంచ కట్టుకుని జనాలు తిరుగుతూంటారు. ఎప్పుడూ నీటి కొరత ఉంటుంది.

జన సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూండడం వల్ల, ఆ నగరంలో స్థలం లేమి ఏర్పడింది. ఎలాగూ ఎప్పుడూ ఎండి ఉంటాయి కాబట్టి, అక్కడ ఉన్న చాలా చెరువులని చదును చేసేసి, వాటిపై పెద్ద పెద్ద అపార్ట్‌మెంటులు కట్టేసుకున్నారు నెచ్చై ప్రజలు.”

మాట్లాడితే బేతాళుడు మాయం అయి పోతాడు కాబట్టి, ఏమీ అనలేక, విక్రమార్కుడు, ఫ్రీగా ఉన్న రెండో చేతితో తన ముక్కు గోక్కున్నాడు.

“నాకు నీ బాధ అర్థమయ్యింది రాజా. నాకు నెచ్చైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమీ లేదు. నీకు ఒకటో, డజనో అపార్ట్‌మెంటులు అంటగట్టే ఉద్దేశం కూడా లేదు,” నవ్వుతూ అన్నాడు బేతాళుడు.

విక్రమార్కుడు కాస్త స్థిమిత పడ్డాడు.

కథ కంటిన్యూ చేశాడు బేతాళుడు. “”నెచ్చై వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఎంతో మంది celebrities ముందుకి వచ్చారు. కొందరు లక్షల్లో దానాలు చేశారు. కొందరు పెద్ద తలకాయలు కోట్లల్లో విరాళాలు ఇచ్చారు. కొందరు యువ నటులు నెచ్చై వీధుల్లో తిరుగుతూ బాధితులకి నిత్యావసర వస్తువులు పంచారు.

శివాఖ పట్నంలో తుఫాను వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోని కొందరు తెగులు హీరోలు కూడా బాగానే హడావుడి చేశారు. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున వెయ్యి కోట్ల సహాయం ప్రకటించింది,” చెప్పడం ఆపాడు బేతాళుడు.

విక్రమార్కుడు కాస్త అయోమయంగా మొహం పెట్టాడు, ఈ కథలో తనను అడగబోయే ప్రశ్న ఏముందబ్బా అని.

విక్రమార్కుడి సందేహం అర్థమైనట్టు బేతాళుడు చిరునవ్వు నవ్వాడు. “రాజా, ఇప్పుడు చెప్పు, వీరిలో ఎవరు అందరి కంటే ఎక్కువ సేవా తత్పరత కలిగిన వారు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో, నిన్ను కబింగం canal మధ్యలో వదిలేస్తా!” అని బెదిరించాడు.

ఉలిక్కి పడ్డాడు విక్రమార్కుడు. “అంత పని మాత్రం చెయ్యబాకు. అటూ వైపు పోదామంటే వరదలు, ఇటు వైపు పోదామంటే సముద్రం. ఎటూ పోలేక జల సమాధి అయిపోతాను. నువ్వు చెప్పిన వారంతా ఎంతో కొంత సహాయం చేసిన వారే. కాదనను. అది ప్రెస్‌కి భయపడి కావచ్చు, నిజంగా ఆదుకోవాలనే తపనతో కావచ్చు, కొంత డబ్బు ఇస్తే ఎనలేని కీర్తి దక్కుతుందని ఆశించి కావచ్చు. మొత్తానికి ఎలాగైతేనేం వారి వల్ల నెచ్చై ప్రజలకి మేలే జరిగింది.

కాని ఏ పేరు ఆశించకుండా, దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, విపత్తులు వచ్చినా, అందరి కంటే ముందు అక్కడికి చేరుకుని సహాయం చేసే సంస్థ ఒకటుంది. అదే మన సిక్యూలరిస్టులు ఎప్పుడు ఆడి పోసుకునే S.R.R.! ఈ సారి కూడా వారు సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోయారు. పడవలు వెళ్ళడానికి వీలు లేని ప్రదేశాలకి కూడా S.R.R. సేవకులు, రామ దండులా చేరుకుని, ప్రజల్ని ఆదుకున్నారు. కాబట్టి ఎక్కువ సేవా తత్పరత ప్రదర్శించింది వారే,” అని సమాధానం ఇచ్చాడు.

ఆ సమాధానం కరెక్ట్ కావడంతో బేతాళుడు “జై శ్రీరాం!” అని అదృశ్యమయ్యాడు.

చేసేది లేక విక్రమార్కుడు, కంచు లక్ష్మి వగైరా నటులు షాపర్ల నుంచి నెచ్చై కోసం విరాళాలు సేకరిస్తున్న, రోఫమ్ మాల్ వైపు బయలుదేరాడు.

http://www.catchnews.com/chennai-news/in-pictures-rss-volunteers-carrying-out-relief-work-in-chennai-1449055598.html

“It’s conceded by even their worst detractors that the RSS has been in the forefront of the non-offical rescue and relief(operations). This has led to an upsurge of goodwill for the Sangh.” – India Today, Feb 12, 2001 issue.

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

2 Responses to రామదండులాగ అందరొక్కటౌదామా! (ఆధునిక బేతాళ కథలు – 5)

  1. రవి says:

    SRR వాళ్ళు ఆ పని చేశారంటే దానివెనక ఏదో మతతత్త్వం ఉండే ఉంటుంది. సెక్యులరిజం ప్రకారం అలా ఎక్కువగా హెల్ప్ చేయడం నేరం కూడా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s