మనమంతా అహ్మదీయులమే! or కంచు మోగినట్టు కనకంబు మోగునా!


ఎప్పుడైతే అరెమికాలో ఎన్నికలకు నిలబడుతున్న రోనాల్డ్ బంప్, అరెమికాలోకి అహ్మదీయులని ఎవర్నీ రానివ్వకుండా ఆపేయాలి అన్నాడో, చాలా మంది pseudo-liberals యొక్క సున్నితమైన మనోభావాలు దెబ్బ తిన్నాయి. అధోగతి రాయి లాంటి వారు ఒకరోజు తిండి మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయారు. ఈ psuedo-liberalsకి ఆద్యుడైన సైకో మూర్, ఒక బోర్డ్ మీద, “మనమంతా అహ్మదీయులమే” అని రాసుకుని రోనాల్డ్ బంప్ బిల్డింగ్ బయట నిలబడి తన నిరసన వ్యక్తం చేశాడు.

ఇదేదో బాగుంది అని ప్రపంచ వ్యాప్తంగా pseudo-liberals అందరూ టిట్టర్ మీద ఎక్కి ఈ క్యాంపెయిన్‌కి మద్దతు ఇచ్చారు. వారిలో కంచు లక్ష్మి ఒక్కతి.

కంచు లక్ష్మి అంధేరా ప్రదేశ్, బృందగానా రాష్ట్రాలకు సుపరిచితురాలైన నటి. ఈవిడ చిన్న వయసులోనే పిన్నీసు బుక్‌లోకి ఎక్కి రికార్డ్ సృష్టించింది. కారణం ఏడేళ్ళు, కేవలం ఏడేళ్ళు, అరెమికాలో ఉండడంతో ఆవిడ LKG పిల్లలు మాట్లాడినట్టు ముద్దు ముద్దుగా తెగులు మాట్లాడడం మొదలెట్టింది. యాక్సెంట్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇలాంటి వింత హిండియాలో ఎవరూ కనీ వినీ ఎరగరు. పిన్నీస్ బుక్ కూడా ఆ విషయం గుర్తించి ఆమె కోసం ఒక పేజీ కేటాయిచింది.

అందరు pseudo-liberalsలానే కంచు లక్ష్మికి కూడా ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ, కపటం బోలెడంత ఎక్కువ. ఈవిడ కానీ మిగతా pseudo-liberals కానీ అహ్మదీయ ఉగ్రవాదుల చేతిలో ఎంతమంది మరణించినా, వారి గురించి కిక్కురుమనరు. మనమంతా సింధువులం, మనమంతా షాక్మీరీ పండిట్‌లము లాంటి క్యాంపెయినింగ్ చేయను గాక చేయరు.

సింధూ మతంలో ఉన్న కులాల సమస్య గురించి, అరెమికా సామ్రజ్య వాదం(?) గురించి, ఈజీరెయిల్ పెరుగుస్తీనా ప్రజల్ని గురి చేస్తున్న అణచివేత గురించి ఎప్పుడూ గొంతు చించుకునే వీరు, ప్రపంచంలో 99 శాతం పెద్ద గొడవల్లో అహ్మదీయులే ఎందుకుంటారో మాట్లాడరు. ఆ మతంలోనే హింసను ప్రేరేపించే అంశాలు ఏమైనా ఉన్నాయా అని అసలు ఆలోచించరు. ఒక వేళ ఆలోచించి కనుక్కున్నా ఎవరికి చెప్పకుండా కడుపులోనే దాచుకుంటారు. అందుకే ఈ మెదడు లేని మేధావులని మిగతా వారు pseudo-liberals అని పిలుచుకుంటారు.

సరే, మొత్తానికి కంచు లక్ష్మి కూడా తన చేతిలో “మనమంతా అహ్మదీయులమే” అని రాసి ఉన్న బోర్డ్ ఒకటి పట్టుకుని ఫోటో దిగి, టిట్టర్లొ సంచలనం సృష్టించింది.

విలేఖరులు వెంటనే కంచు లక్ష్మిని చుట్టు ముట్టారు. “ఇలాంటి అద్భుతమైన ఐడియా మీకెలా వచ్చింది?” అడిగాడు ఒక విలేఖరి.

“చిన్నప్పటినుండి నాన్న గారి పెంపకంలో ఎంతో క్రమశిక్షణతో పెరిగాను. అందుకే అన్యాయాన్ని సహించలేను. ఈ బోర్డ్ నేనే తయారు చేశాను. నా స్వంత handwriting. ఎలా ఉంది?” గర్వంగా అడిగింది లక్ష్మి.

“అబ్బో బెమ్మాండం! అచ్చం మీరు చేసే టీవీ షోలలా ఉంది,” తెలివిగా సమాధానం చెప్పాడు ఇంకో విలేఖరి.

“అదీ సంగతి! ఇంతకు ముందు చెప్పినట్టు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా నేను చెలరేగి పోతాను” అంటూ సమావేశం ముగించింది లక్ష్మి.

సమావేశం అయ్యాక చేతిలో బోర్డ్‌ని అలానే పట్టుకుని, స్టూడియో వైపు బయలు దేరింది కంచు లక్ష్మి. దారిలో ఆమె కారుకి అడ్డంగా ఒక వ్యాన్ వచ్చి ఆగింది. కంచు లక్ష్మి డ్రైవర్‌కి కార్ ఆపక తప్పలేదు.

వ్యానులోంచి నలుగురు ఆగంతకులు దిగారు. వంటి నిండా నల్ల బట్టలు ధరించి ఉన్నారు. మొహాలకి మాస్క్ వేసుకున్నారు. కంచు లక్ష్మిని కార్ దిగమని సైగ చేశారు.

“ఓ మై గాడ్, ఓ మై గాడ్,” అంటూ కార్ దిగింది లక్ష్మి.

వారిలో లీడర్‌లా కనిపిస్తున్న వ్యక్తి కంచు లక్ష్మి చేతిలో ఉన్న బోర్డ్‌ని చూసి మెచ్చుకోలుగా తల ఊపాడు.

“సూపర్ మచ్చీ! ఐతే నువ్వు కూడా అహ్మదీయురాలివే అన్న మాట. జిగాద్!” అని గట్టిగా అరిచాడు అతను.

కంచుకి కాస్త ధైర్యం వచ్చింది. “అవును, నేనొక్కదాన్నే ఏంటి, మనమంతా అహ్మదీయులమే,” గర్వంగా చెప్పింది లీడర్ గారితో. “మీరెవరు?” అని వెంటనే ప్రశ్నించింది.

“ఉగ్రవాదులు అని ఎప్పుడూ టీవీలో చెప్తూ ఉంటారే, వారే మేము,” తను కూడా గర్వంగా చెప్పాడు లీడర్.

మళ్ళీ కంచు లక్షికి భయం ముంచుకొచ్చింది. “తెత్తెత్తే, బెబ్బెబ్బే,” అంది సన్నని గొంతుతో.

“సరే అహ్మదీయురాలివి అంటున్నావు, ఆ అసభ్యకరమైన దుస్తులు ఏంటి? ఆ మేకప్ ఏంటి? మగాడి తోడు లేకుండా ఒక్కదానివే బలాదూర్ తిరిగుతున్నావేంటి?” కాస్త కోపంగా అడిగాడు లక్ష్మిని.

“అలా తిరగకూడదా అండి?”

“అస్సలు తిరగకూడదు. నువ్వు మన మతగ్రంధం సరిగ్గా చదివినట్టు లేదు. మేము సరిగ్గా చదివాం కాబట్టే, ప్రపంచమంతా దాని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.”

“అంటే ఇక్కడ హిండియాలో అహ్మదీయులు అందరూ అంత స్ట్రిక్ట్‌గా ఉండరండి. ”

“తెలుసు, హిండియాలో ఉన్నారు కాబట్టి మీరంతా బతికిపోయారు.”

“మరి మా హమీర్ ఖాన్ మా దేశంలో మత అసహనం ఎక్కువయ్యింది అంటాడేంటి?”

“వాడి మొహం! వాడు ఏ పీకిస్తాన్‌లోనో, ఉఫ్ఘనిస్తాన్‌లోనో ఉండి ఉంటే, వాడు సహనం అనేంతలో వాడిని ఖననం చేసుండే వాళ్ళం. నీ అంత మేకప్ అక్కర్లేదు, ఉఫ్ఘనిస్తాన్‌లో జస్ట్ లిప్ స్టిక్ వేసుకున్నందుకే ఆడవాళ్ళని కాల్చి పడేశాం.”

ఉలిక్కి పడి తన పెదవులకున్న లిప్‌స్టిక్ అర్జెంట్‌గా తుడిచేసుకుంది కంచు లక్ష్మి.

“అంతే కాకుండా, ఈ సినిమాల్లో నటించడం, టీవీల్లో ఇకిలించడం కూడా మానేయి. మీ పాత బస్తీలో చవకగా బుర్ఖాలు దొరుకుతాయి, ఒక డజన్ కొనుక్కో. ఈ సారి మేము మళ్ళీ నిన్ను కలిస్తే, నీ మొహం మాకు కనపడకూడదు. అంటే బుర్ఖా చాటున ఉండాలి.”

“బాబోయి! అన్నట్టు ఒక సందేహం. మా సిక్యూలరిస్టులంతా, అహ్మదీయుల్లో ఒక 15% మాత్రమే ఉగ్రవాదులని నమ్ముతాం. అందరికి చెప్తూ ఉంటాం కూడా. మీరు కనపడ్డారు కానీ, ఆ 85% జనం కనపడట్లేదేంటి?”

“పిచ్చి దానా. సైలెంట్ మెజారిటీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదని నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా? ఉదాహరణకు పీకిస్తాన్‌లో 85% మంది వోటే వేయరు. అక్కడ దేశాన్ని పాలించేది, దాని దశా దిశా నిర్దేశించేది మిగిలిన 15% మాత్రమే. ఎప్పటికీ జరిగేది అదే. గుర్తు పెట్టుకో!”

“ఓహో!”

“ఇంతకీ, మేము చెప్పినదంతా అర్థమయ్యింది కద. అసలైన సిసలైన అహ్మదీయురాలిలా బ్రతుకు ఇక నుంచి.”

“నన్ను క్షమించండి బాబోయి! ఏదో ప్లాకార్డ్ పట్టుకుని ఫోటో దిగితే ఘనంగా ఉంటుందని టెంప్ట్ అయి ఇలా చేశాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు.”

“మొదటి సారి కాబట్టి వార్నిగ్ ఇచ్చి వదిలేస్తున్నాం. జాగ్రత్త!” అంటూ వారంతా అక్కడినుంచి తమ వ్యానులో నిష్క్రమించారు.

వాళ్ళు వెళ్ళగానే తన చేతిలో ఉన్న బోర్డ్‌ని అక్కడ దూరంలో ఉన్న చెత్త కుండీలో పడేసి తను కూడా కార్ ఎక్కింది లక్ష్మి.

స్టూడియో చేరుకోగానే, అక్కడ మళ్ళీ ఒక విలేఖరుల గుంపు ఆమెని చుట్టు ముట్టింది.

“అదేంటి, మీరు ఏదో ప్లాకార్డ్ పట్టుకుని తిరుగుతున్నారని మాకు న్యూస్ వచ్చింది. మీ చేతుల్లో అలాంటిదేమీ లేదే?” కోరస్‌గా ప్రశ్నించారు వారంతా.

“అదా! మరేమో, మరేమో, దాన్ని కాకెత్తుకు పోయింది!” ముద్దు ముద్దు పలుకులతో సమాధానమిచ్చింది కంచు లక్ష్మి.

ఈ చిత్రం చూశారా?

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

4 Responses to మనమంతా అహ్మదీయులమే! or కంచు మోగినట్టు కనకంబు మోగునా!

 1. Zilebi says:

  అందరూ అసమదీయులే అంటారా 🙂

  జిలేబి

  • Murali says:

   అబ్బే, నేనెందుకలా అంటాను. జస్ట్ 15% మాత్రమే అట. 🙂

 2. bkrmaadhav says:

  చాలా బాగుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s