బాబాయికి ప్రేమతో, అబ్బాయికి ద్వేషంతో, గూడ్స్ రాజా, జోక్ గాడే పెద్ద నాయన!


“నాన్నోయి, నాన్న!” అరుచుకుంటూ వచ్చాడు కుమార్.

“ఏంట్రా, ఆ హడావుడి?” అడిగారు వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శంకర్రావు గారు.

“ఎప్పుడూ మన తెగులు సినిమాల్లో వెరైటీ లేదు అని గోల పెడుతూంటావు కద! ఈ సంక్రాంతికి చూడు నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. దేనికదే స్పెషల్, తెలుసా!” గర్వంగా చెప్పాడు కుమార్.

“అబ్బో, అంత గొప్ప వెరైటీ సినిమాలు వచ్చాయా? ఏంటో అవి?”

“మొదటిది గూడ్స్ రాజా అని ఒక లో బడ్జెట్ సినిమా.”

“గూడ్స్ రాజానా? అదేం టైటిల్ రా?”

“అంటే ఈ సినిమాలో హీరో తొందర పడి ఏ పని చేయడు. అందుకన్న మాట.”

“ఇంటరెస్టింగ్. కథేంటి?”

“హీరోకి కుక్కలంటే పడదు. కానీ ప్రేమ కోసం సిటీ అంతా తిరిగి తప్పిపోయిన హీరోయిన్ కుక్కని వెతికి పట్టుకుని, హీరోయిన్ దగ్గరకి తీసుకు వెళ్ళి తోకూపుతాడు. హీరోయిన్ అతన్ని మెచ్చి, మేక తోలు కప్పి, పెళ్ళి చేసుకుంటుంది.”

“వండర్‌ఫుల్. నెక్స్ట్ సినిమా?”

“జోక్ గాడే పెద్ద నాయనా. రాగార్జున సినిమా!”

“దీని కథేంటో?”

“మంచి వాడు, మొహమాటస్తుడు ఐన తన కొడుకును కాపాడడానికి, కొంటె వాడు, దుడుకు వాడు ఐన అతని చనిపోయిన తండ్రి భూమ్మీదకి దిగి వచ్చి, తన కొడుకుని సరైన దారిలో పెట్టి అతని కష్టాలు తీరుస్తాడు. కాస్త రూరల్ టచ్ ఉన్న సినిమా కద, కొంత సరసం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ భలే కనెక్ట్ అయిపోయారు. దీనితో రాగార్జునకి తిరుగులేని కాన్‌ఫిడెన్స్ వచ్చేసింది. సోలో హీరోగా ఇంకో పదేళ్ళు నటిస్తాడట.”

శంకర్రావు గారికి తాగుతున్న కాఫీ పొలమారి దగ్గుతూ ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

“ఏంటో, కాఫీ సడన్‌గా చేదుగా అయిపోయింది. ఇంతకీ నెక్స్ట్ సినిమా ఏంటి, దాని కథేంటి?”

“బాబాయికి ప్రేమతో. ఇందులో సెంటిమెంట్ పిండేశారు. పైగా ఈ సినిమా చూసిన వారికి తెలివి తేటలు ఓవర్‌నైట్ డబుల్ అయి కూర్చుంటాయి.”

“అంటే 40 ఉండే సగటు తెలుగు ప్రేక్షకుడి IQ 80 కి పెరుగుతుందన్న మాట!”

“కరెక్ట్, కరెక్ట్!”

“ఐతే రెండో సారి చూస్తే IQ 160 అవుతుందంటావా?”

“నాన్నా, ఏమిటా పిచ్చి ప్రశ్నలు? కాంతి కంటే వేగంగా ఏదీ ఎలా ప్రయాణించలేదో, సగటు తెలుగు ప్రేక్షకుడి IQ కూడా 100 దాటే సమస్యే లేదన్న విషయం నీకు తెలీదా? ఇక ఆఖరి పిక్చర్ గురించి చెప్తాను విను. సగటు తెలుగు ప్రేక్షకుడి IQ గురించి అన్ని సందేహాలు నీకు తీరిపోతాయి.”

“ఏంటో అది?”

“నాలుగో సినిమా అబ్బాయికి ద్వేషంతో అన్న కళాఖండం.”

ఉలిక్కి పడ్డారు శంకర్రావు గారు.

“అదేం పేరురా?”

“అంటే అబ్బాయి సినిమాకి పోటీగా సేం వీక్ కసిగా ఈ మూవీ రిలీజ్ చేశారులే. అందుకన్న మాట! హీరో మన బుజ్జి కృష్ణే. చాలా ఒరిజినల్ కథ. ఇప్పటి దాకా రాలేదు. హీరో ఒక అనామకుడిలా బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే, అతని గతంలోని పాత్రలు మళ్ళీ ఎదురవుతాయో, అప్పుడు సడన్‌గా గంగి గోవులాంటి హీరో గౌడి గేదెలా మారిపోతాడు. ఇందులో బోలెడు పవర్‌ఫుల్ డయలాగులు ఉన్నాయి. మచ్చుకి ఒక్కటి చెప్పనా?”

“వద్దులే, ఇది బుజ్జయ్య 99వ సినిమా కదూ? అంటే. వందో సినిమా కూడా త్వరలోనే వచ్చేస్తుందన్న మాట,” శంకర్రావు గారి గొంతులో ఎక్సైట్‌మెంట్ వినిపించింది.

“నువ్వు బుజ్జి కృష్ణ ఫ్యానా నాన్నా?”

“కాదురా, ఆ వందో పిక్చర్ తరువాత ఇక యాక్టింగ్ చేయడట కద? అందుకే వెయిటింగ్ ఇక్కడ.”

“పిచ్చి నాన్నా! మొన్నే చెప్పాడుగా తన కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని? మిస్ అయ్యావా?”

“అయ్యే ఉంటాను,” నీరసంగా అన్నారు శంకర్రావు గారు.

“ఇక పేపర్‌లో మన దేశంలో ఏమవుతుందో చెప్పే పనికి మాలిన న్యూస్ తీరికగా చదువుకో,” అంటూ ఇంటి నుండి బయట పడ్డాడు కుమార్.

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

11 Responses to బాబాయికి ప్రేమతో, అబ్బాయికి ద్వేషంతో, గూడ్స్ రాజా, జోక్ గాడే పెద్ద నాయన!

 1. GKK says:

  ‘fun’tastic. really liked it. the post title is too good.

 2. Ganswar says:

  Satirical bomb!

 3. రవి says:

  >>అప్పుడు సడన్‌గా గంగి గోవులాంటి హీరో గౌడి గేదెలా మారిపోతాడు

  తెలిసిన దయ్యం తెలియని దేవునికంటే మేలన్నట్టు – ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గేదె రంకెలూ, తొడ చరుపులే తెలివైన సినిమాల కంటే మేలు.

 4. kinghari010 says:

  మాస్టారూ,అతుకుల బొంత అని పెట్టారు గానీ ఒక్కొక్కళ్ళనీ చితక్కొట్టేస్తున్నారు;-)
  నాకు తెలకడగతన్నా,చితుకుల మంట అని పేరు మారిస్తే ఎట్లా ఉంటుందంటారూ!

  • Murali says:

   బాగానే ఉంటుంది. 🙂 నా అభిమాన సంఘాల మెంబర్స్‌ని కనుక్కుని చెప్తాను. అసలే నాకు ఫ్యాన్సేదేవుళ్ళు!!!

 5. Arun says:

  I second Haribabu garu, please change the title to “చితుకుల మంట” also please give regular updates

 6. nmraobandi says:

  ఓహోహో … చితక్కొట్టేశారు …
  అన్ని సినిమాలు pip లో ఒక్కసారే చూసినంతగా …
  కోలుకోలేనంతగా …
  మీ దేవుళ్లలో నన్ను కూడా లెక్కేసుకోండి …
  🙂

 7. Vijaya Kurada says:

  Excellent Murali. So nice to see your blog. Very funny. Didn’t know about this blog all these years till Narain mentioned.

  Keep writing.

 8. Sameera says:

  చాలా బాగుందండి. క్షణం సినిమా చూశారా మీరు? దాని గురించి మీ అభిప్రాయం తెలుపండీ

  • Murali says:

   ఇంకా చూడలేదు. చూశాక, దాని ప్రస్తావన ముందు రాయబోయే టపాలలో వస్తుంది లెండి. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s