మాకు రెండు మీకు ఒకటి, అవేంటో చెప్పుకోండి చూద్దాం!


నెత్తి మీద వేసుకున్న పసుపు రంగు గుడ్డని అప్పటికి మూడో రకంగా మార్చి మళ్ళీ వేసుకున్నాడు సూర్యబాబు నాయుడు. గ్రేటర్ ఆదరా బాదరా ఎన్నికల ఫలితాలు ఆయన్ని మిక్కిలిగా బాధిస్తున్నాయి అని వేరే చెప్పక్కర్లేదు. తనలాంటి అపర మేధావి అంచనాలు ఎక్కడ తప్పాయో ఆయనకి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. శోకేశ్‌కి ఐతే మరీ ఉగ్గు పాలల్లో రాజకీయాలు రంగరించి నేర్పించాడు, అయినా వాడు జోక్యం చేసుకున్నా లాభం లేకపోయింది. బాధ తట్టుకోలేక నెత్తిన వేసుకున్న గుడ్డనే నోట్లో కుక్కుకున్నాడు బాబు.

“ఇదిగో నాయుడు గారూ, మీరు కనక నోట్లో నుంచి గుడ్డ తీసేస్తే, మీకొక పొడుపు కథ వదులుతాను, దానికి సమాధానం చెప్పాలి మీరు,” నవ్వుతూ అన్నాడు అంధేరా ప్రదేశ్ అధ్యక్షుడు బొగ్గు పారా రెడ్డి.

“ఇల్లు కాలి పోయి ఒకడేడుస్తూ ఉంటే… అన్నట్టుంది మీ వరస. ఏంటి ఆ పొడుపు కథ,” కాస్త కోపంగానే అడిగాడు నాయుడు.

“మాకు రెండు, మీకొకటి! అవేంటో చెప్పుకోండి చూద్దాం,” చిలిపిగా నవ్వుతూ అడిగాడు బొగ్గు పారా రెడ్డి.

“ఛీ ఛీ! బూతు, బూతు! ఈ బూతు పొడుపు కథలేంటండి, సిగ్గు లేకుండా? ఐనా మీకు అంధేరా ప్రదేశ్ అసెంబ్లీలో సున్నా సీట్లు వచ్చాక మీరు కనీసం ఇంకో ఐదేళ్ళు నోరెత్తరని అనుకున్నానే?”

“ఆ అవకాశం మీరే ఇచ్చారు. ఇక్కడ సున్నా సీట్లు వచ్చినా, గ్రేటర్ ఆదరా బాదరా మునిసిపల్ ఎన్నికలలో మాకు రెండు సీట్లు, మీకు ఒక సీటు వచ్చాయి కద, అదన్న మాట సంగతి!” విశాలంగా నవ్వుతూ అన్నాడు బొగ్గు పారా రెడ్డి.

“అంత మురిసిపోకండి, ఆ బృందగానా రాష్ట్ర సమితి వాళ్ళు, ఒక వారంలో మీ సీట్లు, నా సీటూ కూడా ఎత్తుకుపోయి వాళ్ళ 99కి కలుపుకుంటారు. అప్పుడు ఇద్దరికి మిగిలేది సున్నానే!” కసిగా అన్నాడు నాయుడు.

“ఏం ఫర్లేదు! మాకు సున్నా సీట్లు ఉండడం ముందు నుంచి అలవాటే! ఎటొచ్చి మీ పరిస్థితి చూస్తూంటేనే గుండె చెరువైపోతూంది. కి కి కి,” నవ్వాడు బొగ్గు పారా రెడ్డి.

“అదే చెరువులో కొన్ని చేపలు పెంచుకోండి. చేపల చెరువైనా మిగులుతుంది,” ఉక్రోశంగా అన్నాడు నాయుడు.

****

ఇటు బృందగానా రాష్ట సమితి ఆఫీసులో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.

తన కాళ్ళ మీద పడిన తనయుడిని లేవనెత్తుతూ, “కొడకా, గా బాబాయికి ప్రేమతో సైన్మా చూసి, గసొంటి బిడ్డ యాణ్ణన్న ఉంటడా అనుకున్నా. నీ ముందు గాడెంత బేటా! నాయనకి ఏమన్నా నజరానా ఇచ్చినవా?” గద్గదమైన గొంతుతో అన్నాడు బృందగానా ముఖ్య మంత్రి వీ.సీ.ఆర్.

“గిప్పుడైతే మనం ఆ మజిల్స్ పార్టీతో మేయర్‌గిరి పంచుకొనుడు గూడా అక్కర్లేదు. ఐదేళ్ళు మనోడే మేయర్ ఉంటడు,” ఆనందంగా అన్నాడు నాయాల నరసింహా రెడ్డి.

“మజిల్స్ అంటే గుర్తొచ్చింది అన్నో! గా మజిల్స్ పార్టీ ఎం.ఎల్.యే. బీర్బలుద్దిన్ ఓవైసీ, గింతకు ముందే ఫోన్ కొట్టిండు. పాత బస్తికి పోయి జర గీ మేయర్ విషయం డిస్కస్ జేయాలంట,” చెప్పాడు వడియం శ్రీహరి.

“నువ్వు పోయొస్తవా బిడ్డా?” కొడుకుని అడిగాడు వీ.సీ.ఆర్.

“ఏంది, పోయెడిది! గాడికి డ్యాన్స్ చేసుకుంట పోయి, మీ అవసరం మాకు లేదు. మాకు సొంతంగా మెజారిటీ వచ్చింది. మీతో మేయర్ గిరి పంచుకోమూ అని చెప్తే ఇంకేమన్నా ఉందా? బొక్కలు ఇరగ్గొట్టి చేతిల పెట్టి పంపిస్తరు. మొన్న కబీర్ ఆలీని గెట్ల తోమిర్రో సూడ లేదా?” భయంగా అన్నాడు వీ.టీ.ఆర్.

“గదేంద్రా, రాష్ట్ర ప్రభుత్వమూ మనదే, గిప్పుడు ఆదరా బాదరా మేయర్ గిరి కూడా మనదే. సెటిలర్లే మనతో సెటిల్ అయిపోదామని డిసైడ్ చేసినంక వీల్లేమ్ పీకుతర్రా?” చిరాగ్గా అన్నాడు వీ.సీ.ఆర్.

“నాయనో, ఎవలితో ఎవలన్న కలుస్తారేమో గానీ, పాత బస్తీలో ఎగిరేది గాల్ల మజిల్స్ పార్టీ జెండానేనే. గాడకి పోనికి మన హిండియన్ ఆర్మీకి తప్ప ఎవనికి దమ్ములు లెవ్వు,” ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పాడు వీ.టీ.ఆర్.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

12 Responses to మాకు రెండు మీకు ఒకటి, అవేంటో చెప్పుకోండి చూద్దాం!

 1. kinghari010 says:

  గిన్నేండ్లకి మజిల్స్ పార్టీ గాండ్ల సపోర్టా అవుసరం పడని గద్దె దక్కింది.మెల్లంగ గీ చాణక్యంతోని గా బీర్బలుద్దీన్ పని బట్టాలె.

  • Murali says:

   నిజంగానే బృ.రా.స ఆ పని చేస్తే ఎవరికి అభ్యంతరం ఉంటుంది (ఒక్క మజిల్స్ పార్టీకి తప్ప)? కానీ మజిల్స్, బృ.రా.స.కి మిత్ర పక్షం కద! 🙂

   • Matthew 8:26
    And he saith unto them, Why are ye fearful, O ye of little faith? Then he arose, and rebuked the winds and the sea; and there was a great calm

   • Murali says:

    అంతే అంటారా? పవిత్ర గ్రంధంలో కూడా అదే రాసి ఉంది అంటారా? ఐతే వెయిట్ చేస్తాం లెండి. తుఫాన్ తరువాత ప్రశాంతత కోసం. 🙂

 2. kinghari010 says:

  అయితే జై గారూ,ప్రశాంతతకి ముందు వచ్చే తుఫానుకి భయపడక్కర్లేదంటారా:-(

  • Murali & kinghari010:
   నా ఉద్దేశ్యం తూఫాను ప్రశాంతత గురించి కాదు నమ్మకం గురించి. తెలంగాణా రానే రాదన్నారు, వచ్చినా తెరాస గెలవదు అన్నారు, గెలిచినా హైదరాబాదులో రాదన్నారు, ఇప్పుడు మజ్లిస్ దుర్గం బెద్యం కాదంటున్నారు.

   Predictions derived from preference are doomed to fail. You may like to believe others who forecast on objective grounds, o ye of little faith!

   • Murali says:

    ఈ బ్లాగ్ ఎప్పుడూ తెలంగాణాలోని ఎన్నికల గురించి ప్రెడిక్షన్స్ చేయలేదు. అది పక్కన పెడితే, కె.సీ.ఆర్. కనక మజ్లిస్ కొమ్ములు వంచితే, నేను ఆనందం పట్టలేక, ఆయన్ని ముద్దు పెట్టుకుంటాను.

    హ్మ్! ఇప్పుడు అంత ఈజీ కాదేమో, ముఖ్య మంత్రి, పైగా సెక్యూరిటీ బోలెడు ఉంటుంది. సరే లెండి, ఆయన బదులు ఒక గొంగళి పురుగును ముద్దు పెట్టుకుంటాను. 🙂

    కె.సీ.ఆర్. లానే నేను కూడా ఒక సారి మాట ఇచ్చాక మడమ తిప్పను. దీనికి kinghari010 గారే సాక్ష్యం!

 3. రవి says:

  సూర్య బాబు ఓడిపోడానికి గజన్ కారణమని శోకేశ్ బాబు అనలైజ్ చేసి నిర్ధారించాడట. అదీ అసలు కారణం.

  • Murali says:

   ఓటుకు నోటుకు ఓటుకు నోటుకు ఓటుకు నోటుకు…

  • nmraobandi says:

   నిజం కావాలంటే ఓ చెంచాడు
   ఎప్పటిలాగానే ఆలో’చించాడు’ !!
   he can always be, just an analyst
   could never become, a catalyst

 4. nmraobandi says:

  సరదాగా నిజాలు విప్పేశారే !!!
  బోల్డు చీర్స్ …
  (ఉత్త చీర్స్ పేటెంట్ ఆల్రెడీ బుక్కై
  పోయింది మరి!)
  🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s