భలే మంచి కాస్ట్లీ బేరము!

అది జయవాడలో తెగులుదేశం పార్టీ కార్యాలయం. పార్టీ అధ్యక్షుడు సూర్య బాబు నాయుడు లైట్లార్పేసి ఉన్న రూమ్‌లో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం ఆ రూమ్ శోకమందిరంగా డిక్లేర్ చేయబడింది. అందులో మూడ్‌కి తగినట్టే అక్కడ ఉన్న అందరూ విషాదంగా ఉన్నారు.

“ఎంత పని చేస్తివిరో రెడ్ టమ్మీ దయాకర్ రావు, నువ్వెంత పని చేస్తివిరో రెడ్ టమ్మీ దయాకర రావు. నన్ను షాకులో ముంచేస్తివిరో, ఇగ నువ్వు నా దోస్తు కానే కావు,” అంటూ పాడుతున్నాడు సూర్య బాబు.

“ఊరుకోండి సార్ , ఆయన మన పార్టీలో ఉన్న మిగతా లీడర్స్‌తో  గొడవ పెట్టుకుని, అందరిని బృ.రా.స.కి తోలేస్తున్నప్పుడే ఆయన్ని పీకేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు,” అన్నాడు బుచ్చెం నాయుడు.

“మరి ఆ సంగతి నాకు ముందే చెప్పొచ్చు కద? అంతా అయిపోయాక ఇప్పుడా చెప్పేది?” గుర్రుగా అడిగాడు బాబు.

“నాకు సంబంధించని శాఖల్లో వేలు పెట్టొద్దు అని మీరు మర్యాదగా చెప్పారు కద, సార్! అందుకే నోరు మూసుకున్నాను,” వినయంగా జవాబిచ్చాడు బుచ్చెం నాయుడు.

“నాన్నోయి, మనకు మొన్న ఆదరా బాదరా ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చినా, క్రితం సారి కంటే లక్ష వోట్లు ఎక్కువ పడ్డాయి,” అప్పుడే లోపలికి వచ్చిన శోకేశ్ బాబు, ఉత్సాహంగా చెప్పాడు.

“నువ్వు నోరు మూసుకుని ఇక్కడినుంచి వెళ్ళిపోరా శోక్‌గా. చిన్నప్పటి నుంచి నీ మీద చెయ్యి వేయలేదు. ఆ సాంప్రదాయాన్ని అర్జెంట్‌గా మార్చుకోవాల్సి వస్తుంది,” కఠినంగా చెప్పాడు బాబు.

“అది కాదు నాన్నా, మన పార్టీది టెస్ట్ మ్యాచ్‌లు ఆడే సామర్థ్యం, టీ-20లు మనకు సరిగ్గా రావు అని కూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేశా. బాగా చెప్పాను కదూ?” బాబు మూడ్ అర్థం చేసుకోకుండా మళ్ళీ నోరు జారాడు శోకేశ్ బాబు.

“నిజమేరా, బ్రహ్మాడమైన స్టేట్‌మెంట్ ఇచ్చావు. అందుకే నీకు మన పార్టీ spokesperson పదవి ఇచ్చి…”

“థాంక్యూ నాన్నా!”

“నీకున్న మిగతా పదవులన్నీ పీకేస్తున్నా,” కసిగా అన్నాడు బాబు.

“అన్యాయం నాన్నా!”

“ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావంటే, ఈ కొత్త పదవి కూడా ఉండదు. పో అవతలికి!” గట్టిగా అరిచాడు బాబు.

శోకేశ్ అర్జెంట్‌గా అక్కడి నుంచి జంప్ అయిపోయాడు.

“బృందగానాలో మన పార్టీలో ఇంకా ఎంతమంది మిగిలారు?” నీరసంగా అడిగాడు బాబు.

“ఈ రోజు పొద్దునకి 5 మంది సార్. మజ్జాన్నానికి మళ్ళీ లెక్క చూసి చెప్తాను,” సమాధానమిచ్చాడు దుర్జన చౌదరి.

“రేపు సాయంత్రం వరకు వెయిట్ చేస్తే మంచిది. అప్పుడు ఏకంగా ఒక రౌండ్ ఫిగర్ చెప్పొచ్చు,” ఉచిత సలహా పారేశాడు బుచ్చెం నాయుడు.

దుర్జన చౌదరి ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి కాసేపు మాటాడి, సూర్యబాబు వైపు తిరిగి, “సార్, రెడ్ టమ్మీ గారు కాల్ చేశారు. మీతో ఏదో మంచి బేరం మాట్లాడలట,” చెప్పాడు దుర్జన.

“ఛీ, వాడితో నేను మాట్లాడను. కానీ ఒక అపర చాణక్యుడిలా నాకు తెలిసింది ఏంటంటే, ఎవరు ఎలాంటి బేరం ఇచ్చినా దాని గురించి మనం ఒక సారి తెలుసుకోవాలి. కాబట్టి ఆఫర్ ఏంటో కనుక్కో,” పురమాయించాడు బాబు.

ఇంకో రెండు నిమిషాలు మాట్లాడి మళ్ళీ రెడ్ టమ్మీ గారి సందేశం చేరవేశాడు దుర్జన. “రేపో మాపో ఆదరా బాదరాలో ఖాళీ అయిపోయే మన పార్టీ కార్యాలయాన్ని తనకే అమ్మమంటున్నాడు సార్. గ్యారంటీ ఇవ్వాలట. అప్పుడు మార్కెట్ రేట్ కంటే ఐదు శాతం ఎక్కువ ఇస్తాడట.”

ఈ సారి తట్టుకోలేక ఘొల్లుమన్నాడు బాబు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

10 Responses to భలే మంచి కాస్ట్లీ బేరము!

 1. Vamsi says:

  rofl post murali garu..keep them coming..!!

 2. Sridevi says:

  Nice, could not control laughter for the way it is presented, keep up writing!

 3. Sreenivas says:

  Your sense of humor stays ON Murali. Keep them coming.

 4. Zilebi says:

  ఆయ్ మీరు మరీను !

  మా బాబు గారి మీద ఇంతేసి సెటైర్ వేస్తారా 🙂 హడ్తాల్ చేస్తా ఉండాం 🙂

  జిలేబి

  • Murali says:

   మీరు ఊరుకోండి జిలేబీ గారు, మీకు ఎవరి మీద సెటైర్ వేసినా నచ్చదు. 😦

 5. nmraobandi says:

  అదేదో కాలి ఒకడేడుస్తుంటే
  ఏదేదో తెచ్చి చల్లుతున్నారే …
  అయ్యో మూలుగుతుందే పాపం! అని నక్కపై
  కూసింతన్నా జాలి లేకపోతె ఎలా…గండీ …
  మురళీ గారండీ …
  నేను కూడా జిలేబమ్మ
  హడ్తాల్ తో జత కడ్తాల్ …
  🙂

 6. kinghari010 says:

  ఎట్టా వస్తయ్యండి ఇట్టాంటి అవడియాలు మీకు:-)
  నవ్వాలా వద్దా,నవ్వితే చస్తానా?నవ్వకపోతే చస్తానా!
  వామ్మో, మీతో యమ డేంజరు:-(

  • Murali says:

   పొగుడుతాండా, తిడతాండా? (ప్రతిఘటన సినిమాలో కోటా శ్రీనివాసరావు డైలాగ్) 🙂

 7. MNR says:

  Good.
  write something on anti nationals of JNU & those political supporters

 8. kamudha says:

  I think you have stopped posting after koodali is closed. Please let me know if you making post on your face book. with you face book ID

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s