మదర్ తెరీమా – 2


“అంటే ఆవిడకి వారసులు ఎవరూ లేరు. సన్యాసిని. పాపం ఆమె డబ్బు ఏం చేసుకుంటుంది, మీరు మరీ చెప్తారు.”

“మహానుభావా, నేను ఆవిడ ఆ డబ్బులు తనే నొక్కేసింది అని చెప్పట్లేదు. ఆ డబ్బులు దేనికి ఉపయోగపడతాయి అన్న అభిప్రాయంతో ఆమెకి విరాళాలు ఇచ్చారో, వాటికి ఆమె వాడలేదు అని చెప్పడమే నా ఉద్దేశం.”

“మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయినట్టు?”

“లూటికన్ సిటీ అకౌంట్‌లోకి!” (Mother Teresa: Where are her millions?)

“ఈ లూటికన్ సిటీ ఏంటండి మధ్యలో?”

“మదర్ తెరీమా మత పెద్దలు ఉండే నగరం. ఒకసారి లూటికన్ సిటీ అకౌంట్స్‌లోకి ఏదైనా డబ్బు జమా ఐతే, ఆ దేవుడికి కూడా తరువాత లెక్కలు తెలీవు. వాళ్ళ మీద ఏ దేశానికి సార్వ భౌమత్వం లేదు కూడా. వాళ్ళు ఆడిందే ఆట, చేసిందే ప్రేయర్!”

“మరి ఆవిడ స్థాపించిన సేవా సంస్థలు ఎలా నడిచేవి?”

“ఆవిడ వాటిని స్థాపించిన మొదట్లో మాత్రమే కూసింత సహాయం చేసేది. అవి కాస్త నిల దొక్కుకోగానే ఆమె నుంచి ఒక పైసా కూడా వాటికి అందేది కాదు. లోకల్‌గా స్థానికులు ఇచ్చిన కొద్ది పాటి డబ్బుతో, వస్తు రూపేణ చేసిన దానాలతో అవి నడిచేవి.”

“అంటే ఎలాగో అలా నడిచేవి కద!”

“నడిచేవి లెండి. వాటిలో ఉన్న అభాగ్యులకు కనీస వసతులు కూడా ఉండేవి కావు. వాడిన వస్తువులనే, మళ్ళీ మళ్ళీ, అవి పూర్తిగా చివికి ఆవిరి అయ్యే వరకు వాడే వారు.”

“పొదుపుగా వాడితే తప్పేంటండి, మీరు అన్నిటిని ఆడిపోసుకుంటున్నారు!”

“పొదుపుగా వాడడం తప్పు కాదు, కేశవ రావు గారు! కాని ఇంజెక్షన్ ఇవ్వడానికి వాడిన సూదులని స్టెరిలైజ్ చేయకుండా మళ్ళీ వాడకూడదు కద! సెప్టిక్ అవుతుంది అని చెప్పినా మదర్ వినిపించుకునేది కాదు. అదీ మిలియన్ల కొద్ది డాలర్లు ఆవిడ సంస్థలకు సంబంధించిన అకౌంట్లలో మూలుగుతూ ఉంటే!”

“నేను నమ్మను! అలా ఏ మదర్ ఉండదు!”

“ఈ మదర్ ఉంటుంది. ఆవిద సంస్థలలో చేరిన కొందరు, గౌరవప్రదంగా చావడానికి ముందే సెప్టిక్ అయి చచ్చారు.”

“ఇదంతా ఎస్.ఆర్.ఆర్. వారి ప్రచారంలా ఉంది. వాళ్ళకు కిరస్తానీలు అంటే బొత్తిగా పడదు!”

“కదా? ఈ విషయాలన్నీ మనకి తెలియడానికి కారణం ఆవిడ మతస్తులే. ఒక్కప్పుడు ఆవిడని ఆరాధించిన వారే. ముఖ్యంగా శ్వేత జాతీయులే! (The squalid truth behind the legacy of Mother Teresa)

అలాగే, ఆకలికి తాళలేక ఆవిడ చల్లని సంస్థలో మరణించిన ఒక చిన్నారి బాబు మరణించిన విషయం లాంటి సంఘటనలు అన్నీ వారు బయట పెట్టినవే! (An eye-witness tells what he saw at a Mother’s clinic)”

“!”

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

5 Responses to మదర్ తెరీమా – 2

 1. Siva Kumar K says:

  లూటికన్ సిటీ… 🙂
  వాళ్ళు ఆడిందే ఆట, చేసిందే ప్రేయర్ 😛 😀

 2. kinghari010 says:

  కోతి బసు బాగా ఆనందించాడు ఈవిణ్ణి చూసి:-)

 3. “మదర్ తెరీమా మత పెద్దలు ఉండే నగరం. ఒకసారి లూటికన్ సిటీ అకౌంట్స్‌లోకి ఏదైనా డబ్బు జమా ఐతే, ఆ దేవుడికి కూడా తరువాత లెక్కలు తెలీవు. వాళ్ళ మీద ఏ దేశానికి సార్వ భౌమత్వం లేదు కూడా. వాళ్ళు ఆడిందే ఆట, చేసిందే ప్రేయర్!”
  —————–
  అది ఒక నగరమే కానీ ఒక స్వతంత్ర దేశం కూడా.

  • Murali says:

   తెలుసు సార్! వారికి ఒక దేశానికి కావల్సిన హంగులు లేవు. కాని ఇటలీతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల వారికి ఆ స్వతంత్ర ప్రతిపత్తి దక్కింది. వారికి అన్నీ హక్కులే, బాధ్యతలు స్వల్పం. అదే నేను చెప్పదల్చుకుంది. Absolute Power and unlimited wealth…

 4. Zilebi says:

  లూటీ గదాజిలేబీ !
  సూటిగ తెలిపిరిట సదరు సూదికథలనూ !
  కోటల వెనుకను దాగిరి
  మూటల కొలది మన దస్కములనొక్కుచునూ !

  జిలేబి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s