న బూతో న భవిష్యత్


ఒక్క సారిగా తెగులు రాష్ట్రాలు రెండూ భగ్గుమన్నాయి. ఒక ప్రీ-రిలీజ్ సినీ ఫంక్షన్ యొక్క వేదిక మీద, చాలా-కుతి రావు అనే ఒక సీనియర్ నటుడు అమ్మాయిల గురించి అసభ్యంగా క్యామెంట్ చేయడమే దానికి కారణం. అసలే స్త్రీని అపరిమితంగా గౌరవించే తెగులు ప్రజల మనో భావాలు ఎంతలా దెబ్బ తిని ఉంటాయో చదువరులకి ఇప్పటికే అర్థమయి పోయుంటుంది.

చాలా-కుతి రావు చేసిన క్యామెంట్‌కి అపూర్వమైన స్పందన లభించింది. “పోకండోయి సినిమా చూడకుండా!” చిత్రంలో నటిస్తున్న, రక్కుల ప్రీత్ సింగ్, ఇంకా రాగ తైచన్య పగలబడి నవ్వారు. ప్రోగ్రాంకి యాంకర్‌గా వ్యవహరిస్తున్న కవి, “సూపర్ సార్!” అని అరిచి తన ఆమోదాన్ని తెలియజేశాడు.

అదే కనీసం ఏ పదేళ్ళ కిందో అయినా ఈ సంఘటన జరిగి ఉంటే దానికి ఇంత ప్రాముఖ్యత లభించేది కాదేమో! ఐతే సోషల్ మీడియా మన జీవితాల మధ్య వీరంగం వేస్తున్న ఈ రోజుల్లో, ఈ వార్త “వైరల్” అయిపోయింది. కాస్త నీచోపమానమైనా, ట్రాన్స్‌లేట్ చేసి చెప్పాలి అంటే, ఈ వార్త గజ్జిలా వ్యాపించింది.

దీనితో ఆ ఫంక్షన్ అటెండ్ అయిన చాలా మందికి ఎప్పుడు లేని విధంగా, చాలా అసయ్యంగా, తాము నీచ్ కుత్తే కమీనేలు కాము అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది.

“ఈ ఒక్క సారికి ఆయన్ను వదిలేయండి. ఇంకో సారి ఇదే బూతు క్యామెంట్ చేయకుండా మేము చూసుకుంటాం,” చెప్పారు సినీసం (సినీ నటుల సంఘం) ప్రతినిధులు, ప్రెస్ మీట్ పెట్టి మరీ.

“ఓహో! ఆ బూతు క్యామెంట్ మాత్రం మళ్ళీ చేయనివ్వము, వేరే బూతు క్యామెంట్లు చేయడని గ్యారంటీ ఇవ్వలేము అంటారు! ఎంత క్రమ శిక్షణ, ఎంత క్రమ శిక్షణ!” మెచ్చుకున్నారు అక్కడ చేరిన విలేఖరులు.

అప్పుడే ముసుగు వేసుకుని పక్కనుంచి జారుకోబోతున్న యాంకర్ కవిని గుర్తు పట్టేసి విలేఖరులు ఆయన్ని ఘెరావ్ చేశారు.

“యాంకర్ బాబూ, యాంకర్ బాబూ, మీరెందుకు “సూపర్ సార్” అన్నారు ఆ క్యామెంట్‌కి?” అంటూ అడిగారు.

“మరేమో యాంకర్‌ని కాబట్టి అలా అన్నాను. అసలు మాకు అంతకంటే మాట్లాడే అవకాశం ఎక్కడుంటుంది. సూపర్ సార్, అబ్బో బెమ్మాండం సార్, ఈ సినిమా మీ ప్రస్థానంలో ఒక మైలు రాయిలా నిలిచిపోతుంది సార్, మీరు మీ ఫ్యాన్లకి ఏం మెసేజ్ ఇవ్వదల్చుకున్నారు సార్, ఇలాంటి పడి కట్టు మాటలు అని అని, అలవాటు ప్రకారం అనేశాను. నిజం చెప్పాలి అంటే ఆయన ఏం అన్నారో నేను వినలేదు. నాకు అసలు ఆ రోజు టెంపరరీగా చెవుడు వచ్చింది. ఆయన పెదవులు కదలడం ఆగగానే, ఓహో ఈయన క్యామెంట్ అయినట్టుంది అనుకుని, “సూపర్ సార్!” అన్నాను. నిజంగా ఆయన చేసిన క్యామెంట్ వినపడి ఉంటే, రాహుకలిలో అభాస్‌లా అక్కడే కత్తి తీసి ఒక వేటుతో ఆయన తల నరికేసి ఉండేవాడిని,” ఆవేశంగా అన్నాడు యాంకర్ కవి.

ఈయనకు దూరంగా ఉండడం ఎందుకైనా మంచిది అనుకుని విలేఖరులు అక్కడే ఉన్న బుజ్జి కృష్ణని చాలా-కుతి రావు క్యామెంట్ మీద ఆయన అభిప్రాయం అడిగారు.

“ఆ.. మరీ.. సీనియర్ నటుడు అంటే ఆయన మన మహిళా లోకాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా, ఆ, బా, బా… అలా అనకుండా ఉండాల్సి ఉంది. నేను అసలు పబ్లిక్‌లో మాట్లాడేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకందరికి తెలుసు కద,” కళ్ళు పెద్దవి చేసి అటూ ఇటూ ఊగుతూ చెప్పాడు బుజ్జి కృష్ణ.

“అవునవును. ముఖ్యంగా మీకు అమ్మాయిలు అంటే వల్ల మాలిన గౌరవం. అప్పుడెప్పుడో నేను అమ్మాయిల వెంట పడను, నా ఫ్యాన్స్ ఒప్పుకోరు, అమ్మాయిలని ముద్దైనా పెట్టాలి, లేదా కడుపైనా చేయాలి అని చెప్పారు, అలా జాగ్రత్తగా మాట్లాడాలి కదూ?” అన్నాడు ఒక విలేఖరి.

“కరెక్ట్! నువ్వు చాలా షార్ప్‌గా ఉన్నావు. కావాలంటే నీకు నా ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూ ఇస్తాను, చేస్తావా?” అడిగాడు బుజ్జి కృష్ణ.

“మళ్ళీ ఎప్పుడైనా వస్తాను లెండి,” తెలివిగా తప్పించుకున్నాడు ఆ విలేఖరి.

ఆఖర్లో, “పోకండోయి, సినిమా చూడకుండా!” చిత్రం యొక్క హీరో మరియు హీరోయిన్‌లను తగులుకున్నారు విలేఖరులు.

“చాలా-కుతి రావు గారు అంత అసహ్యకరమైన మాట అనడం అటుంచండి. మీరిద్దరూ కి కి కి అని ఎందుకు నవ్వారు? చెప్పండి రాగ తైచన్య గారు?” అడిగాడు ఒక విలేఖరి.

“చీ చీ! మీరు నన్ను హోల్‌సేల్‌గా అపార్థం చేసుకున్నారు. నేను నవ్వింది దానికి కాదు. నిన్న మా తమ్ముడు కిల్‌కిల్ వేసిన జోకు నాకు అదే సమయంలో అర్థమయ్యింది. అందుకే కిల కిలా నవ్వాను. అసలు నేను లాగూలు వేసుకునే వయసు నుండి, ఆడ వాళ్ళని గ్యాప్ లేకుండా గౌరవిస్తున్నాను,” సంజాయిషీ ఇచ్చుకున్నాడు రాగ తైచన్య.

“ఏమ్మా, రక్కుల ప్రీతూ! ఆడ దానివై ఉండి నువ్వెందుకు నవ్వావమ్మా?” ఇంకో విలేఖరి ప్రశ్నించాడు.

“నాకీ తెగ్లూ కొంచెం కొంచెం వస్తయి. అందుకే నేను నవ్వినయి. ఐనా టెలిక్యాస్ట్‌లో ల్యాగ్ ఉంటయి. నాది రియాక్షన్ బిల్‌కుల్ లేట్ హై,” ముద్దు ముద్దుగా చెప్పింది రక్కుల ప్రీత్.

“ఏంటీ, ఆయన క్యామెంట్ రియల్ టైమ్‌లో వచ్చిందా. మీ నవ్వు ల్యాగ్‌లో వచ్చిందా! లాగూలు తొడుక్కునే వాళ్ళకి చెప్పండి, ఈ మాటలు,” చిరాకు పడ్డాడు ప్రశ్న వేసిన విలేఖరి.

అప్పుడే తైచన్య నాన్న రాగార్జున అక్కడికి దూసుకుని వచ్చాడు. “నేను చాలా-కుతి రావుగారి క్యామెంట్‌ని ఖండ ఖండాలుగా ఖండిస్తున్నాను. ఆడవాళ్ళంటే మా అబ్బాయి రాగ తైచన్య కంటే నాకు డబుల్ రెట్టింపు గౌరవం. ఐనా, డైనోసార్లకి కాలం చెల్లింది,” ఎవరూ ఏమీ అడగక ముందే అనౌన్స్ చేశాడు ఆయన.

“సారు ఏమి అంటయి? మా మూవీలో డైనోసార్లు ఉన్నయి?” అయోమయంగా అడిగింది రక్కుల ప్రీత్.

“మాకీ అర్థం అయ్యాక మీకీ చెప్తయి,” అని విలేఖరులు అక్కడి నుండి నిష్క్రమించారు.

***

ఇదంతా చూస్తున్న మన తెగులు కుటుంబ ప్రేక్షకులు ఈ వ్యవహారాన్ని చూసి అసహ్యించుకున్నారు.

“ఛీ, ఛీ, అందుకే నేను అసలు ఈ సినిమాలు చూడ్డమే మానేశాను. చక్కగా ఇంట్లో, టీవీలో, సంసార పక్షమైన ప్రోగ్రాములే చూస్తాను. ఆ, అమ్మాయి! ఆ ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది చూడు! మగాళ్ళు ఆడాళ్ళలా చీరలు కట్టుకుని, భలే జోకులు, పంచులూ వేస్తూ ఉంటారు. నీక్కూడా ఆ ప్రోగ్రామ్ అంటే భలే ఇష్టం. అది పెట్టమ్మా!” అన్నాడు ఒక పెద్దాయన తన కూతురితో.

“మీరు చెప్పేది బజర్దస్త్ క్యామెడి షో గురించి నాన్నా. పదండి, వెళ్ళి చూద్దాం!” ఉత్సాహంగా అంది ఆ అమ్మాయి.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్, మన సమాజం, సినిమాలు. Bookmark the permalink.

11 Responses to న బూతో న భవిష్యత్

 1. విన్నకోట నరసింహారావు says:

  ఆ సీనియర్ నటుడు గీతదాటే కామెంట్ చేసాడు, ఏమాత్రం సందేహం లేదు. తన అనుభవంతోనైనా కాస్త సమయస్ఫూర్తి చూపించవలసింది. మరి అసలటువంటి అసందర్భపు ప్రశ్న, వెకిలిప్రశ్న లేవనెత్తి ఈ గోలకంతా కారణమైన ఆ ఏంకర్లకు కూడా తగిన బుద్ధి చెప్పాలిగా? వాళ్ళనెందుకు వదిలేయాలి? తామేదో “వెరైటీ”గా ప్రోగ్రాంని “పండించేస్తున్నాం” అనే భ్రమతో / అహంకారంతో ఏంకర్లు చూపించే వెకిలితనం హద్దుమీరిపోతోంది. పైగా వీళ్ళు తాము “సెలిబ్రిటీ”లం అని ఫీలయిపోవడం ఒకటి.
  ఇక మీరు చివరి పేరాలో చెప్పిన ప్రోగ్రాం అసభ్యతకు పరాకాష్ఠ, దిగజారుడుతనానికి గొప్ప ఉదాహరణ.

  • Syamala says:

   ఈ కాలం లో అయినా , ఏ కాలం లో అయినా , నేర్చుకోవలసింది , చూపించవలసింది అలవరచుకున్న సంస్కారం కాని అనుభవంతో నేర్చుకున్న సమయస్ఫూర్థి కాదండి ..

 2. Zilebi says:

  ,అదురహో బల్ కత్తి 🙂

  జిలేబి

 3. Syamala says:

  మురళి గారు , మీరు ఎంచుకున్న title సాగర సంగమం లొ విశ్వనాథ్ గారు , ఒక character తో పలికించిన dialogue గుర్తు తెప్పించింది . ” నా బూతే నా భవిష్యత్ ” (I think it’s saagara sangamam. If not, pl. excuse my forgetfulness )

  • Murali says:

   మీరు చెప్పిన డయలాగ్ నాకు తెలిసినంత వరకు సాగర సంగమంలో లేదు. బహుశా స్వాతి కిరణం సినిమాలోది కావొచ్చు. ఆ చిత్రంలో ఒక రచయిత కొత్త కొత్త బూతు టైటిల్స్ కనిపెడుతూ ఉంటాడు.

   ఇక న భూతో న భవిష్యత్ అనేది అందరికి తెలిసిన పద ప్రయోగమే. నా టపా ప్యారడీ టైటిల్ కూడా ఎంతో మంది వాడుకున్నదే. ఐనా సరే, ఈ సందర్భంలో అంతకంటే మంచి టైటిల్ నాకు స్ఫురించలేదు.

 4. Lalitha TS says:

  మీ ఫన్-పోస్టుల్లో పన్ చాలా బావుంటుంది 🙂
  <>

 5. kinghari010 says:

  What chalapati rao actually talked?Mostly this man is full of sarcasm, I know.But I don’t think he will make himself a scapegoat!

 6. Sreenivas says:

  చాలా కుతి రావు ప్రయొగం పండింది మురళీ 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s