పాపిష్టి డబ్బు! (నేను సింధువుని ఎట్లైత? – 2)


వ్యాపారం నిజంగా అంత నీచమయినదా? వ్యాపారం చేసే వారు స్మగ్లర్లా?

ఇక్కడ వ్యాపారం గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. మనిషికి ఊహ తెలిసినప్పటి నుండి వ్యాపారం అనేది ఉంది. డబ్బు అనేది పుట్టక ముందు కూడా మనుషులు ‘ఇచ్చి పుచ్చుకునే’ వారు. ఐతే డబ్బు అనేది లేక ముందు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. చాలా సార్లు మన దగ్గర ఉన్న ఎక్కువ విలువ ఉన్న వస్తువుని (ఉదాహరణకు, ఒక గుర్రం) ఇచ్చి, తక్కువ విలువ కల వస్తువుని (ఉదాహరణకు, ఒక రోజుకి సరి పడేంత ఆహారం) పుచ్చుకోవాల్సి వచ్చేది. దీన్నే barter system అని ముద్దుగా పిలుస్తారు.తరువాత డబ్బు వచ్చి ఈ కష్టాలనుంచి మనుషులని తప్పించింది.

ఇదంతా బేసిక్ ఎకానమిక్స్ అని కొట్టి పారేయొద్దు. డబ్బు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన లోటు తీర్చింది. ఏదన్నా వస్తువుకి కానీ, పనికి కానీ, సరి అయినా ప్రతిఫలం పొందడం అనేది డబ్బు వల్లే సాధ్యం అయ్యింది.

డబ్బు నీచమైనది నికృష్టమైనది అనే వాళ్ళు తెలుసుకోవాల్సింది, అక్కడ నీచమైనది కేవలం మనుషులకి డబ్బు మీద ఉన్న దురాశ మాత్రమే అని.

అలాగే వ్యాపారం అనేది ప్రపంచంలోని అతి ముఖ్యమైన అంశం. వ్యాపారం లేనిది ప్రపంచం లేదు. వ్యాపారం వల్లే ప్రపంచపు ఎల్లలు చెరిగి పోయాయి. వ్యాపారం కానీ, వ్యాపారులు కానీ లేకుంటే మనం ఒక అడుగు తీసి, అడుగు వేయలేం.

మరి వ్యాపారులంటే హౌలయ్య లాంటి వారికి ఎందుకంత కసి?

ఎర్ర మేధావులు ముక్త కంఠంతో ఘోషించేది ఏమిటంటే, ఈ సృష్టిలోని అసమానతలు అన్నీ కేవలం డబ్బుతోనే పుట్టుకొచ్చాయి అని. కాబట్టి డబ్బు అనేది నీచమైనది. డబ్బుని సంపాదించాలనే కోరిక ఉన్న వారు నీచమైన వారు. వ్యాపారం చేసేదే డబ్బుని సంపాయించడాని కోసం కాబట్టి, వ్యాపారులు అంతా automaticగా నీచ నికృష్టులు. హౌలయ్య లాంటి వారు ఈ చిలక పలుకులనే రిపీట్ చేస్తారు. ఈ బూజు పట్టిన భావజాలానికి చెంచా కాబట్టే, అతన్ని చెంచా హౌలయ్య అనేది.

ఐతే, ఒక ఎర్ర మేధావులే కాదు, సర్వ మతాలు కూడా డబ్బు నీచాతినీచమైనదనే బోధిస్తాయి. ఇవంతా కలిపి డబ్బు సంపాదించాలనుకునే వారిలో ఎంత guiltని ప్రవేశ పెట్టాయి అంటే, డబ్బు సంపాదించడం అనేది, హత్యలు అత్యాచారాలు చేయడం కంటే కూడా దారుణమైనది అని చాల మంది డబ్బు సంపాదించే వారే, నమ్మే పరిస్థితి వచ్చింది.

కాబట్టి వారు, తమకున్న డబ్బులో కొంత, సమాజ సేవకోసం ఖర్చు పెట్టకపోతేనో, లేకపోతే దేవుడి హుండీలో కాస్త అదే డబ్బు వేయకపోతేనో, పాపం ఇంకా పెరిగి రౌరవాది నరకాలకు పోతామేమో అన్న భయంతో అలాంటివి చేసి తమ పాప ప్రక్షాళనం చేసుకుంటూ ఉంటారు. ఇవన్ని నమ్మని వారు కూడా, ఈ అపవాదులు కాస్త తగ్గించడానికి, సంక్షేమ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడమో, ఉచిత వైద్య శాలలు కట్టించడమో చేస్తూ ఉంటారు.

స్వచ్ఛందంగా సేవ చేయడం పట్ల, కావాలంటే తమ డబ్బుని అంతా ఊడ్చి ఖర్చు పెట్టడం పట్ల కూడా, నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని guilt ప్రేరేపించి తమకున్న డబ్బును కాస్తో ఎక్కువో పంచితేనే, “మంచి” ధనవంతులు అవుతారు అనే నియమం సృష్టించడం మాత్రం తప్పు.

వ్యాపారం “ద్రోహ చింతనం” అంటారు కానీ నిజానికి ద్రోహంగా చేస్తేనే వ్యాపారం సాగుతుంది అనేది తప్పు. వ్యాపారం చేయడానికి ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రభుత్వాలు, పైన చెప్పినట్టు డబ్బు సంపాదించడం అనేది ఒక దారుణమైన నేరం అని ప్రచారం చేసే మతాలు, ఇజాలు, ఇవన్నీ వ్యాపారులని self-defenceలోకి నెట్టి వేస్తాయి. ఎలాగూ డబ్బు నీచమైనప్పుడు, నీచమైన పద్ధతుల వల్ల దాన్ని సంపాదిస్తే కొత్తగా వచ్చే పాపం ఏమీ లేదని వ్యాపారులు అనుకునేలా చేస్తాయి.

నేను తప్పుడు పద్ధతులతో వ్యాపారం చేసే వారిని సమర్థించడం లేదు. డబ్బుకి ఒక నీచమైన ముద్ర వేసి, డబ్బు సంపాదించేవారిని (తద్వారా వేరే వారికి ఉద్యోగాలు సృష్టించే వారిని) పరమ నీచులుగా వర్ణించి, వారిని ఎలా ఒక no win situation వైపు తోస్తున్నారో మాత్రమే ఇక్కడ నేను చెప్ప దలుచుకుంది.

ఒక సారి ఇలాంటి ముద్ర పడ్డాక, ఇంకా బురద జల్లడం కష్టమైన పనేం కాదు. హౌలయ్య చేస్తూంది అదే. ఐతే ఇవి, కేవలం ఒక సామాజిక వర్గం మీద కోపమో, ఒక ఎర్రి (ఎర్ర) మేధావి మాటలు మాత్రమే కావు. దీని వెనకాల పెద్ద షడ్యంత్రం ఉంది. మన దేశాన్ని, సింధూ సమాజాన్ని చీల్చి ముక్కలు చేసే కుట్ర దాగుంది.

వచ్చే భాగాల్లో, అసలు ఈ హౌలయ్య లాంటి వారు ఎందుకు ఇలా ఉండుండి “అగ్ర వర్ణాల” మీద విరుచుకు పడతారో, ఎందుకు వీరికి చద్దర్ లాంటి మాజీ-మక్యూనిస్టుల మద్దతు లభిస్తుందో చూద్దాం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

8 Responses to పాపిష్టి డబ్బు! (నేను సింధువుని ఎట్లైత? – 2)

 1. Zilebi says:

  హౌలయ్యా ! ధనమూలమౌ జగమనన్,హాలాహలమ్మున్నిటన్
  చాలామట్టుకు జేర్చినావు గదవోయ్ ! చాలాకి గాదోయి మూ
  లాలన్గొట్టితి వీవు గాద గురువా లాలూచి యేలన్ప డే
  వో? లావై నిలిచేవు నాడు బరిలో వోడేవు కంచెన్విడన్ !

 2. “సర్వ మతాలు కూడా డబ్బు నీచాతినీచమైనదనే బోధిస్తాయి.” మురళీగారూ! హిందూమతం అలా అనదనుకుంటా. ఎందుకంటే, మనిషి నాలుగు(ధర్మ, అర్థ, కామ, మోక్ష) పురుషార్థాలకోసం ప్రయత్నించాలి అని సనాతనధర్మం చెబతుందని అంటారు కదా!

  • Murali says:

   మీరు చెప్పింది నిజమే. నేను కూడా దీని గురించి ఆలోచించాకే రాశాను. సనాతన ధర్మంలో నాలుగు పురుషార్థాల గురించి చెప్పినప్పటికి, ప్రస్తుతం హిందూ మతానికి పరి రక్షకులుగా భావింప బడుతున్న ఎంతో మంది మత పెద్దలు, డబ్బుని డబ్బుకోసం సంపాదించడం అన్న పాయింట్‌ని ఎప్పుడు హర్షించరు. కొన్ని conditions apply చేస్తారు. 🙂 అందుకే హిందూ మతాన్ని కూడా సర్వ మతాల్లో చేర్చడం జరిగింది.

   డబ్బు మీద అతి వ్యామోహం పెంచుకోకూడదు అని పెద్దలు చెప్పే మాటలతో నేను ఏకీభవిస్తాను. కానీ డబ్బుని అక్రమ మార్గాలకు పాల్పడకుండా, కేవలం డబ్బు కోసమే సంపాదించడం, నేరం మాత్రం కాదు.

   • O.K. అయినా నేను లేవనెత్తిన అంశం రామాయణంలో…వేట లాంటిదనుకోండి. ఐలయ్య వాదన, ఆగ్రహం ప్రధానంగా దేశంలోని social structure మీద అని నేను భావిస్తున్నాను. కానీ, బాగా చదువుకుంటే ఉన్నతస్థానానికి చేరటానికి కులాలకు అతీతంగా అందరికీ అవకాశాలు ఉన్న ఈ సమయంలో ఇంకా అగ్రకులాలమీద ఆయన ఉక్రోషం, కోపం అర్థంలేనివి. రిజర్వేషన్ అనుభవిస్తున్న కులాలలోనివారుకూడా తాము ఉన్నతస్థితికి చేరుకున్నాక తమలోని కిందవారిని పైకి తీసుకురావటానికి ప్రయత్నించటం చాలా తక్కువ. అన్ని కులాలలోనూ పేదవారున్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్నవారు ఉన్నారు., కులాలకు అతీతంగా పేదరికంలో ఉన్న పిల్లలకు విద్యావకాశావకాశాలు కల్పించటం, పేదలను కూడా అభివృధ్ధిలోకి తీసుకురావటం(Inclusive growth)వంటి విషయాలపైన ఉద్యమస్థాయిలో కసరత్తు జరగాలని నేననుకుంటున్నాను.

   • Murali says:

    మీరు చెప్పింది నిజం 🙂 ఐతే, ఇదంతా, మన మేధావులకి తెలీదు అనుకుంటారా. వారి ఆక్రోశం నిజంగా పీడిత తాడిత ప్రజల కోసమే అనుకుంటున్నారా? వారికి అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నారు. తరువాయి భాగాలు కూడా చదవండి.

 3. Luck says:

  Where’s the next part sir? Looking forward eagerly

  • Murali says:

   నాకూ రాయాలనే ఉంది సార్. పని భారం కాస్త ఎక్కువగా ఉంది. త్వరలోనే రాస్తా.

   హౌలయ్య అయితే, ఏ సింధూ సమాజం deservations ద్వారా తనకు ఉద్యోగం ఇచ్చిందో, దాన్ని చక్కగా పుచ్చుకుని, అదే సింధువులని బూతులు తిట్టి, “నేను సింధువుని అట్లెట్లైత?” లాంటి పుస్తకాలను తాపీగా రాసుకుంటాడు. నాకు ఆ వెసులుబాటు లేదు. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s