మరువనివ్వరు (నేను సింధువుని ఎట్లైత? – 6)

సరే, సింధూ మతం యొక్క చరిత్రను, దాని ప్రత్యేకతను కాసేపు పక్కన పెడదాము. ప్రస్తుతం నెలకొని ఉన్న ఈ డిజర్వేషన్ల వల్ల కుల విభేదాలు ఏమన్నా తగ్గాయేమో చూద్దాం.

దీనికి సమాధానం దాదాపు అందరి నుంచి ఒకటే వస్తుంది. అవి ఏ మాత్రం తగ్గలేదని. (నిమ్న జాతుల వారు జరగాల్సినంత వేగంగా న్యాయం జరగడం లేదంటారు. అగ్ర వర్ణాల వారు వారికి ఘోరమైన అన్యాయం జరుగుతూంది అంటారు.) ఈ డిజర్వేషన్లు అంత భేషైన పద్ధతి ఐతే పరిస్థితి కాస్తన్నా మెరుగు పడి ఉండాలి కద. దానికి బదులు ఇంకా అధ్వానంగా తయారయ్యింది. మరి ఎందుకిలాగా?

ఎందుకంటే డిజర్వేషన్ల వెనకాల ఉన్న మూల సిద్ధాంతమే తప్పు కాబట్టి. డిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది నిమ్న జాతులకి అన్యాయం జరిగింది అన్న ప్రాతిపదిక మీద. “తర తరాలుగా మాకు జరిగిన అన్యాయానికి పరిహారంగా ( లేక ప్రతీకారంగా) అగ్ర వర్ణాల వారు మమ్మల్ని కొన్ని తరాలు (ఎన్ని తరాలో ఎవరికీ క్లారిటీ లేదు లెండి) భుజాలపై మోసుకుని నడవాలి,” అన్నదే ఈ ప్రతిపాదన.

పైపైన చూస్తే ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఇది ముమ్మాటికి కాదు. ఒక రకంగా చూస్తే ఇంకా పెద్ద అన్యాయం. ఎందుకంటే ఇది జాతి మత వివక్ష లేకుండా అందరూ గౌరవించే ప్రతిభని దెబ్బ కొట్టే ప్రయత్నం.

నాణ్యతకి ప్రతిభకి అవినాభవ సంబంధం ఉంది. ప్రతిభ లేనిదే నాణ్యత రాదు. నాణ్యతని ప్రోత్సహించని సమాజం పురోగమనం ఎలా సాధిస్తుంది?

నేను ఇక్కడ నిమ్న జాతులకి అన్యాయం జరగ లేదని చెప్పడం లేదు. తప్పకుండా జరిగింది. ఐతే, ఈ అన్యాయాన్ని సరి దిద్దే మార్గం ఇది ఎంత మాత్రం కాదు.

ఇలాంటి అన్యాయాలు ఇంక ముందు జరగకూడదు అంటే మనకు కావల్సింది ప్రజా స్వామ్యాన్ని పరిపుష్టం చేసే సంస్థలు, శాంతి భద్రతలని కాపాడే పోలీసు వ్యవస్థ, లంచగొండి తనం లేని సమాజం, ప్రలోభాలతో ప్రజలని మభ్య పెట్టని రాజకీయ నాయకులు. అంతే కానీ, కులాన్ని ఎప్పటికి మరిచిపోనీయకుండా, రావణకాష్టంలా రగిలించే, “సామాజిక న్యాయం” కాదు.

మనుష్యుల మధ్య పూర్తి సమానత్వం ఎప్పటికీ రాదు. కానీ విజ్ఞత ఉన్న మనుషులుగా మనం చేయగలిగింది ఏమిటంటే, అందరికి ప్రతి పోటీలోనూ పాల్గొనడానికి సమానమైన పరిస్థితులు కల్పించడం.అలా కాకుండా మక్యూనిజంలా బలవంతంగా రుద్దితే సమానత్వం అనేది సిద్ధించదు అని ఎన్నో సార్లు ఋజువు అయ్యింది.

ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది ఇంతకు ముందు విన్నదే. కానీ మళ్ళీ ఇంకోసారి తలుచుకోదగింది.

ఒలంపిక్స్‌లో మన దేశం హై జంప్ లో ఒక్క పతకం కూడా సాధించ లేదు. ఈ పరిణామానికి కినుక వహించిన మన దేశం అంతర్జాతీయ సమితితో ఈ అర్జీ పెట్టుకుంది. “అయ్యా, ఎన్నో కారణాల వల్ల వెనక పడిపోయిన మా దేశం, ఈ హై జంప్ పోటీల్లో గెలవలేక పోతూంది. కాబట్టి మాది ఒక అభ్యర్థన. మిగతా అన్ని దేశాల కంటే మాకు హై జంప్ బార్‌ని ఒక అడుగు కిందకి దించండి. అప్పుడు మేము కూడా బోలెడు మెడల్స్ గెలుచుకుంటాం. సమానత్వం వర్ధిల్లుతుంది,” అని.

వినడానికే హాస్యస్పదంగా ఉన్న ఈ అభ్యర్థనని అంతర్జాతీయ సమితి ఒప్పుకుంటుందంటారా? ఒప్పుకోదు. కానీ మన దేశంలో డిజర్వేషన్ల వెనక ఉన్న మౌలికమైన సిద్ధంతం ఇదే!

ఈ ఉదాహరణ ఎవరినీ అవహేళన చేయడానికో ఇవ్వ లేదు. హాస్యం వెనక అంతర్లీనంగా విషాదం ఎలా ఉంటుందో, అలాగే ఈ ఉదాహరణ వెనుక ఎంతో మంది కడుపు మంట దాగి ఉంది.

సమస్యని ఎత్తి చూపడం అయ్యింది. ఇప్పుడు సమస్యని ఎలా పరిష్కరించ వచ్చో ఆలోచిద్దాం. ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలో మన దేశం హై జంప్ పోటీల్లో మెడల్స్ గెలవాలంటే కావల్సింది, తర్ఫీదు,సాధన; బార్ ఒక అడుగు దించడం కాదు.

సరి అయిన పరిష్కారం, మన దేశంలో ఉన్న క్రీడాకారులకు సరి అయిన శిక్షణ ఇప్పించి వారిని ప్రపంచంలోని మేటి ఆటగాళ్ళతో పోటీ పడి, గెలిచే స్థాయికి తీసుకు రావడం.

మరి మన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయదు? ఎందుకంటే ఇది సరి అయిన పద్ధతే కానీ ఏ మాత్రం సులభం కాదు. ఇది జరగాలంటే, బాల్య కార్మికులు తయారు కాకుండా చూసుకోవాలి, బీద వారికి మెరుగైన ఉచిత విద్యని అందించాలి. వారి చదువుకు డబ్బు ఆటంకం కాకుండా బతుకు తెరువు కల్పించాలి.

దీని వల్ల ‘సామాజిక న్యాయం” శరవేగంగా సిద్ధించదు. మెచ్చిన ప్రజలు టక్కున ఓటేసి రాజ్యాధికారం కట్టబెట్టరు.

కాబట్టి ప్రభుత్వాలు సులభమైన పద్ధతిని అవలంబిస్తాయి. అది నిమ్న జాతులకు కొన్ని డిజర్వేషన్లు ఇచ్చి, వారికి అర్హత ఉన్నా లేక పోయినా కాలేజుల్లో సీట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు, కట్ట బెట్టడం.

For the backward sections in the society, this, of course, leads to a false feeling of instant power.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

4 Responses to మరువనివ్వరు (నేను సింధువుని ఎట్లైత? – 6)

 1. Jtiu says:

  I am not sure about your other readers Muraligaaru, but if I am coming back to a blog after over a year and a half, that too to a political blog, and when we are in a middle of an election, and just after a near war-like situation in our country… I don’t think I want to spend time trying to un-jumble anagrams, guess which anadrome means what. It is an added chore imposed on the readers. Specially when there is no continuity, in terms of time) between parts of posts. There is a time for satire and word-play. I believe, this isn’t the time.

  Besides that very irritating aspect, I agree with the post. Reservations are not all that hunky-dory as they are made out to be. In fact, reservations and the way our census is done, together are some of the biggest perpetuators of caste differences and class divide. They help create a victim out of a regular person. Affirmative action, often does not reach the ones who were actually oppressed but are gobbled up by oppressors who don the garb of oppressed to snatch the benefit from the real victims.

  About the remedy to this past oppression and caste divide… am just glad that the Modi govt. took some steps in the right direction. Just yesterday I read a friend talk about his son getting a nice govt job in Haryana. Seems getting a simple job for an eligible guy was difficult in UPA era. More so without bribes and connections. Now, all that is being made transparent and clean of corruption, to the extent it is possible. So people, actual poor people, across castes lines are getting jobs, admission… based on merit. They have not succeeded in removing reservations. but they are using reservation in the right way. And not allowing a few privileged elite to hoard the resources( jobs/ college seats, etc). This is creating a positive impact. Have heard this a lot from UP, where a simple primary school teacher job cost a couple a lakhs in bribe for anyone. And the wrongs folks grabbed the jobs in the name of reservation. Now that practice is being reversed. My hope is, if this present govt wins again, and gets another term, they may become bolder in taking more positive steps and they may be able to root out more issues wrt corruption, bribes, fake certificates and misuse of reservation. And once a major chunk of lower class are employed/self reliant… reservation can slowly be eased away in time.

  But first things first, Modi sarkaar needs to get another chance with a full majority.

  PS: Sorry about the very long reply.

  • Jitu says:

   Correction,

   The friend talked about his *gardener’s son get a job. They are in Delhi and the father is working as a low level gardener due to lack of opportunities and govt. support to certain class of people. Seems, by digitizing a lot of services, Modi govt. managed to do away with bribing and foul play. And in doing so, the jobs are reaching the right folks and right folks are reaching the right jobs. This needs to continue for 15 years for the entire system to be cleaned of the leftist/congie junk

  • Murali says:

   I really don’t have too many ‘anagrams or anadromes’ in the above article. Just Deservations and Makyoonism. Shouldn’t be too hard to figure out what they are.

   Yes, a large gap like this between a series will disorient the readers. But I promise by the time I am done, I will circle back to the reason why I wrote the very first article in the series.

   Modi sarkar is doing well within its operational limits. Agreed.

   • Jitu says:

    I agree about Modi sarkar doing well ‘within operational limits’. Those operational limits and resistance from within and abroad is immense. Just read a news of a 75yr old man being stoned in TN for professing support for Modi. such is the hatred/propaganda/resistance. 😦 😦 😦

    In hating Modi.. the LeLis have now graduated to hating India itself. 😦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s