నీ దారి పూల దారి

సాహుల్ గాంధికి ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక గొప్ప అవుడియా, హిండియా జోడో పాద యాత్ర. జే.బీ.పీ. వల్ల దేశంలో అన్ని రకాల పొరపొచ్చాలు పెరిగిపోయాయి కావున, తాను దక్షిణ హిండియాలోని చివరాఖరి పాయింటు నుంచి, షాక్మీర్ వరకు నడిచేసి, దారిన కలిసిన ప్రజలందరి హృదయాలని కలిపేస్తే, ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయనకు అనిపించింది.

ఈ ఆలోచన రాగానే సాహుల్ ముందుగా వాళ్ళ మమ్మీకి చెప్పాడు. పిల్లాడు ఇప్పటికైన చేతికి అంది వస్తున్నాడని ఆవిడ బోలెడు ఆనందించింది. మనసు మార్చుకుని మళ్ళీ ఏ విదేశాలకో ఎక్కడ చెక్కేస్తాడో అన్న భయంతో, ఎందుకైనా మంచిదని, గాంక్రెస్ పార్టీ దశాబ్దాలుగా హిండియాలో కొల్లగొట్టిన సంపద నుంచి, కూసింత తీసి ఈ పాద యాత్రకు హడావుడిగా ఏర్పాట్లు చేసేసింది.

రాచ పీనుగ, ఛీ ఛీ, రాచ బిడ్డ ఒక్కడే నడిస్తే బాగుండదని, ఇంకో వంద మందిని సాహుల్‌కి తోడుగా పంపే ఏర్పాటు కూడా చేసింది. వారితో పాటు మిగతా మంది మార్బలం కూడా అదనంగా సమకూర్చబడ్డాయి.

అట్టహాసంగా సాహుల్ పాదయాత్ర ప్రారంభమయ్యింది. దీంతో, కలుగులో ఉన్న ఎలుకలు తిండి వాసన పసిగట్టి బయటకు వచ్చినట్టు, హిండియాలోని సిక్యూలరిస్టులందరూ కూడా తమ తమ స్థావరాల్లోంచి బయటకు వచ్చారు. అంతటితో ఆగకుండా సాహుల్‌తో పాటూ అడుగులో అడుగేశారు కూడా.

ఇలా వచ్చిన వారంతా దేశంలోని హేమహేమీలు. కూజా భట్, అపస్వరా భాస్కర్, మాజీ బ్యాంక్ గవర్నర్ రఘురాం వాజన్ అందులో కొందరు. ముఖ్యంగా వాజన్, “సాహుల్ గాంధిని పప్పు అని పిలవడం చాలా దురదృష్టకరం. ఆయనకి అపారమైన తెలివి తేటలు ఉన్నాయి,” అని వక్కాణించాడు.

“మరి ఆయన్ని అనకపోతే మిమ్మల్ని పప్పు అని పిలవచ్చా?” అడిగాడు ఒక విలేఖరి బుర్ర గోక్కుంటూ.

“ఎవరినీ పిలవకూడదు. ఇక్కడ పప్పులు/ఉప్పులు ఎవరం లేము. అంతా నిఖార్సైన మేధావులం,” కోపంగా అన్నాడు వాజన్.

“పైగా మీరు చూస్తున్నది నన్ను కాదుగా? నన్ను నేను చంపేసుకున్నాను,” గర్వంగా చెప్పాడు సాహుల్.

“మరి మా ముందు ఎలా తిరుగుతున్నారు?” ఇంకో విలేఖరిణి అడిగింది .

“చంపిన వాడిని బ్రతికించుకోలేనా? తిరిగి బతికాను. అయినా మీరు నన్ను చచ్చాడు అనుకున్నా, నాకు ఫర్లేదు. నాకు ఎలాంటి ఇమేజ్ అక్కరలేదు,” చెప్పాడు సాహుల్.

ఆ మాట విని అక్కడ సాహుల్ గాంధికి సరి సమానమైన IQ ఉన్న కొందరు చప్పట్లు కొట్టారు.

“అందుకే అనుకుంటా, మీరు ఈ చలిలో కేవలం టీ-షర్ట్ వేసుకుని నడిచేస్తున్నారు. చచ్చినోడికి చలి ఏముంటుంది?” సాలోచనగా అంది అదే విలేఖరిణి.

“ఇప్పుడు మీకు నేను కాస్త అర్థం అవుతున్నాను,” చిరు నవ్వుతో అన్నాడు సాహుల్.

యాత్ర మధ్యలో ఒక చోట సడన్‌గా ఆగిపోయాడు సాహుల్. తన కుడి చేతిని నుదిటి మీద పెట్టుకొని అటూ ఇటూ చూడడం మొదలు పెట్టాడు.

ఆయన వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోవలసి వచ్చింది. “ఏమయ్యింది, దేని కోసం చూస్తున్నారు?” అడిగారు వారిలో కొందరు.

“అదే, ఆ రెండూ కన పడడం లేదు. వాటి కోసం వెతుకుతున్నాను,” సాలోచనగా చెప్పాడు సాహుల్.

“ఏ రెండూ? లాడ్జింగూ, బోర్డింగా? అవైతే మన చేతిలో పనులే. మీరు ఊ అంటే ఇక్కడిక్కడే మన క్యాంప్ సెటప్ చేద్దాం. హాయిగా భోంచేసి ఒక కునుకు తీద్దురు గానీ,” ఆయనతో పాటూ పంపబడ్డ సహాయకులు సూచించారు.

“ఎహే, ఆవి కావు. సగం ప్రయాణం అయిపోవచ్చినా నాకు ఎక్కడా ద్వేషమూ, హింసా కనపడడం లేదు. కాబట్టి ఆగిపోయి చూస్తున్నాను.”

“ఓహో, వాటి గురించా మీరు చెప్పేది. మీరు నడిచే దారిలో అవి ఎలా ఉంటాయి చెప్పండి! మీ యాత్రతో సగం దేశం ఆల్‌రెడీ పునీతమయిపోయింది. కనపడే ఛాన్సే లేదు,” అన్నారు సాహుల్‌కి తోడుగా పంపబడిన భట్రాజులు.

“అంతే అంటారా? మిగతా యాత్ర కూడా వెంబటే పూర్తి చేసేస్తే బెటర్ అంటారా?” తన బవిరి గెడ్డం గోక్కుంటూ అడిగాడు సాహుల్.

“అంతే, అంతే!” అన్నారు అందరూ కోరస్‌గా.

ఆ తరువాత దక్షిణాది నటుడు కమాల్ హసన్ ముచ్చట పడి సాహుల్ గాంధిని ఇంటర్వ్యూ చేశాడు.

“దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,” ఉటంకించాడు రాహుల్.

“మీకట్టాగే అనిపించిందీ? నాకూ అట్టాగే అనిపించింది,” ఒప్పేసుకున్నాడు కమాల్.

“నైచా మన భూభాగంలో 2000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించింది. మొన్నే నేను నైచా రాయబారితో మాట్లాడి మరీ కన్‌ఫర్మ్ చేసుకున్నాను. ఐనా మన ప్రధానికి చీమ కుట్టినట్టైనా లేదు,” బాధగా అన్నాడు సాహుల్.

“అందుకే నేను మిమ్మల్ని మేధావి అనేది. మీరు కాబట్టి ఎవరిని అడగాలో వారిని అడిగారు. ఇంకెవరైనా ఐతే అసయ్యంగా మన హిండియన్ సైన్యాధికారులని అడిగేవారు. వాళ్ళేమో, కాదు బాబూ, నిజానికి 38,000 చదరపు కిలోమీటర్లను మీ ముత్తాత హెన్రూ గారి హయాంలోనే ఆక్రమించుకున్నారు అని అవాకులు చవాకులు పేలే వారు,” మెచ్చుకున్నాడు కమాల్ హసన్.

“పైగా మోడీ గారు వచ్చాక, మన కుటీర పరిశ్రమలు ఎన్నో భ్రష్టు పట్టాయి. ఉదాహరణకు మన ఖాదీ పరిశ్రమ. ఇప్పుడు ఎక్కడన్నా కొందామన్నా ఖాదీ దొరకడం లేదు,” బాధగా అన్నాడు సాహుల్.

“నిజమా! మొన్నే వార్తల్లో గత ఏడాది ఖాదీ పరిశ్రమ లక్ష కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారే! పచ్చి అబద్ధమన్న మాట! ఇంకా నయం, మీతో మాట్లాడాను కాబట్టి నాకు విషయం తెలిసింది,” ఆశ్చర్య పోతూ అన్నాడు కమాల్.

“ఇదే నేను చెప్పేది, మన దగ్గర శక్తిమంతమైన నాయకత్వం లేదు కాబట్టే మనము నైచాకి అలుసు అయిపోయాం. ఇలా చీటికి మాటికి మనతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.”

“బాగా చెప్పారు. ఒక్క సారి మీ లాంటి మేధావి, పైగా యువకుడు మనకు నాయకుడు అయితే, ఆ నైచా వెధవలు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతారు,” అంటూ క్యామెరా వైపు తిరిగి, “ద్వేషాన్ని ప్రేమతో జయిద్దాం, సాహుల్ నెత్తిన కిరీటం పెట్టేద్దాం,” అంటూ కనపడని ప్రేక్షకులకి సందేశం ఇస్తూ, ఇంటర్వ్యూ ముగించాడు కమాల్.

ఇలాంటి అద్భుతమైన ఎన్నో సంఘటనల తరువాత, సాహుల్ యాత్ర, షాక్మీరుని సమీపించింది.

అక్కడి చలికి, శవాలకు కూడా వణుకు పుడుతుంది కాబట్టి, సాహుల్ తన టీ-షర్ట్ మీద ఒక ఓవర్‌కోట్ ధరించి హిండియా పతాకాన్ని ఎగురవేశాడు. దీంతో ఆయన యాత్ర ముగిసింది.

అప్పుడే, అక్కడికి హడావుడిగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. సాహుల్‌ని చూడగానే ఆమె మొహంలో రిలీఫ్ కనిపించింది. “హమ్మయ్యా, ఇంకా ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని మిస్ అయిపోతానేమోనని భయపడ్డాను,” ఆనందంగా అంది.

“ఎలా మిస్ అవుతారు, నేను మళ్ళీ రివర్సులో నడక మొదలు పెడతాను కద!” అన్నాడు సాహుల్.

“అవునా! మీరు హిండియా ఛోడో యాత్ర చేస్తున్నారని విని, మీరు హిండియాని దాటి ఏ నైచాకో వెళ్ళిపోయేంతలో కలుద్దామని హడావుడిగా పరిగెట్టుకుంటూ వచ్చాను,” కాస్త ఢీలా పడింది ఆ అమ్మాయి.

“ఛోడో కాదు జోడో, వదలడం కాదు, కలపడం! మీరేదో తప్పుడు న్యూస్ చదివి ఉంటారు,” పళ్ళు కొరుకుతూ అన్నాడు సాహుల్.

“ఓహ్, ఐతే హిండియాలోనే ఉంటారన్న మాట,” నిట్టూర్చింది ఆ అమ్మాయి కూసింత బాధగా.

This entry was posted in 'కరెంట్' అఫైర్స్ and tagged , . Bookmark the permalink.

6 Responses to నీ దారి పూల దారి

 1. Madharam narsingh rao Madharam says:

  ఎలా మిస్ అవుతారు, నేను మళ్ళీ రివర్సులో నడక మొదలు పెడతాను కద!” . This one is superb..

 2. Anonymous says:

  సాహుల్ ఎంత నడిచినా లాభంలేదు. ఎలచ్చన్ల టయానికి ఘోడీ.. పీకేస్తాన్, నైచా్‌ని చూపించి.. “నేలేకపోతే సింధువులకి రక్షణలేదు.. మీ అరాచకాలకి సప్పోర్ట్ ఉండదు” అనగానే.. సైకోబాచ్చంతా.. బట్టలు చించుకుంటూ ఓటెత్తుతారు.

 3. రవి says:

  వందేళ్ళ పైబడిన పార్టీలో ఈ స్థాయి ఐక్యూ ఉన్న నాయకుడు ఇంకొక్కడు దొరకడు. అప్పుడెప్పుడో కష్టపడి పీవీ నరసింహారావు గారొస్తే, ఆయన్ను కంపు కంపు చేసి పెట్టారు.

  ఈయన మంచితనాన్ని చూసి ఆ ఐక్యూను ఒప్పేస్కోవాలట. మోడీ సంగతి అటుంచుదాం. అతను పరమ దుర్మార్గుడని ఒప్పేస్కుందాం మాటవరసకు. ఇవతల చొస్తూ చూస్తూ ఎట్లా వోట్లేసేది అంటే జవాబు లేదు.

  మీరింకా నయం బ్లాగుకు పరిమిరం అయ్యారు. ఇంకో ప్లాట్ఫాం ఉంది. అక్కడ చాలా తెలివైన వాదాలు చేసి ఈ స్థాయి మనిషిని సపోర్ట్ చేసేవాళ్ళే.

 4. Murali says:

  రవి గారు, పైన అనానిమస్ క్యామెంట్ చూశారు కద. మీరు చెప్పిన వర్గం ప్రకారం, రాహుల్‌లోని గొప్పతనాన్ని గుర్తించకుండా, మోడీని గెలిపించే వాళ్ళు, సైకోలు అట. అలా ఫిక్స్ అయిపోయాక ఎవరు మాత్రం చేసేదేముంది!

  • రవి says:

   ఆ అనానిమస్ గారు ఎందుకు అనానిమస్ గా కామెంట్ పెట్టారో నాకైతే తెలీదు. ఆయన పబ్లిక్ గా చెబితే ఘనమైన ఇంటలెక్చువల్ గా పేరొస్తుంది. వందల లైకులొస్తయి. కొంచెం ముందుకెళ్ళి కథ రాస్తే సాహిత్య అకాడమీ వొస్తది. టాలెంట్ వేస్ట్ చేసుకుంటున్నాడు.

   • Murali says:

    సాధారణంగా నేను ఈ అనానిమస్ ఇంకా సిక్యూలరిస్టుల క్యామెంట్స్ ప్రచురించను. వీళ్ళ ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో చూపించడానికే ఈ సారి ఈ వ్యాఖ్య పబ్లిష్ చేశాను.

    వీరంతా కట్ట కట్టుకుని ఇంత విష ప్రచారం చేస్తున్నా, మోడి మాటి మాటికి ఎందుకు గెలుస్తున్నాడో తెలీక, వీళ్ళు పాపం తెగ గింజుకుంటున్నారు. పైగా మోడీకి ప్రత్యమ్నాయంగా వీళ్ళకి రాహుల్ తప్ప వేరే దిక్కు లేదు. ఇది వీరి భావ దారిద్ర్యం.

    పైగా ఇంతోటి రాహుల్‌ని గద్దె ఎక్కించకపోతే మన ప్రజలంతా మతోన్మాదులు+సైకోలు అన్న మాట.

    ఒకోసారి, Hindu resurgency మొదలైన ఈ నవభారతంలో వీరు పాపం ఎలా బ్రతుకుతున్నారో ఏంటో అని జాలి వేస్తుంది. 🙂

    వీరికి భారత్ ఛోడోనే బెస్టు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s