Author Archives: Murali

నీ దారి పూల దారి

సాహుల్ గాంధికి ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక గొప్ప అవుడియా, హిండియా జోడో పాద యాత్ర. జే.బీ.పీ. వల్ల దేశంలో అన్ని రకాల పొరపొచ్చాలు పెరిగిపోయాయి కావున, తాను దక్షిణ హిండియాలోని చివరాఖరి పాయింటు నుంచి, షాక్మీర్ వరకు నడిచేసి, దారిన కలిసిన ప్రజలందరి హృదయాలని కలిపేస్తే, ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయనకు … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్ | Tagged , | 6 Comments

అన్‌బేరెబుల్ టాక్ షో

“రండి రండి కేశవరావు గారు,” ఆహ్వానించారు శంకర్రావు గారు. “మీరు ఈ రోజు ఎపిసోడ్‌లో బుజ్జి క్రిష్ణ గారు, తన అన్ బేరెబుల్ షోలో, సూర్య బాబు గారిని ఇంటర్‌వ్యూ చేస్తారు, కాబట్టి కలిసి చూద్దాం అని ఆహ్వానించారు కద, అందుకే వచ్చేశాను,” చెప్పారు కేశవరావు గారు. “ఈ రోజు బుజ్జయ్య తన బావ గారిని … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్, అతుకుల బొంత | 8 Comments

టయన్ (టైగర్ + లయన్)

శంకర్రావు గారు, కేశవరావు గారు వారి ఈవినింగ్ వాక్ కి వెళ్తుండగా జరిగింది ఈ సంఘటన. వాళ్ళింటికి దగ్గరలోనే ఉన్న రంగ మహల్ థియేటర్ లోంచి, మ్యాట్నీ విడిచారేమో, జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానైతే వాళ్ళు మామూలుగా నడుస్తూ రావడం లేదు. పరిగెట్టుకుంటూ వస్తున్నారు. “ఏమయ్యిందయ్యా, అలా పరిగెత్తుకొస్తున్నారు?” ఆందోళనగా అడిగారు శంకర్రావు గారు. … Continue reading

Posted in అతుకుల బొంత | 5 Comments

నగ్న సత్యం, సినీ బంద్, దుంకులాట

నగ్న సత్యం: అంధేరా ప్రదేశ్ అంతా వేలంట్ల మాధవ్ వీడియో వార్తతో అట్టుడుకిపోయింది. పత్రికాధిపతులు ఈ వార్తని విశదంగా కవర్ చేసి తమ సర్క్యులేషన్ పెంచుకోవచ్చని ఆనంద పడ్డారు. ఎగస్పార్టీ అయిన తెగులు దేశం పార్టి వై.నో. గగన్‌ని ఇరకాటాన పెట్టడానికి ఒక మంచి ఆయుధం దొరికింది అని సంబర పడింది. SRYCP పార్టీ వాళ్ళు … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్ | 6 Comments

మూడేళ్ళ తరువాత

దేవదేవుడికి అకస్మాత్తుగా భూలోకం గుర్తొచ్చింది. అందులోను అంధేరా ప్రదేశ్ ఏమయ్యిందో తెలుసుకోవాలని మరీ కుతూహలం కూడా కలిగింది. “మూడేళ్ళ కింద అనుకుంటా, అక్కడ ప్రభుత్వం మారింది. వై.నో. గగన్ అందరికి నవ రసాలు అందిస్తాను అన్న వాగ్ధానంతో అధికారంలోకి వచ్చాడు. సూర్య బాబుని చిత్తు చేసి ఒక మూల కూర్చోబెట్టారు జనాలు. మరిప్పుడు అక్కడ ఏం … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్ | 4 Comments