Category Archives: అతుకుల బొంత

కాదేది కవితకనర్హం అని మహా కవి శ్రీ శ్రీ అన్నట్టు, ఈ categoryలో వ్రాయని టాపిక్ అంటూ ఉండదు. సబ్ కుఛ్ చల్తా హై!

ఇందులో ఒకే కుటుంబానికి చెందిన కొన్ని పాత్రలు తరచు వస్తూ పోతూంటాయి. మన చుట్టూ జరుగుతున్న విషయలతో పాటూ వారి కథ కూడా నడుస్తూంటుంది.

అన్‌బేరెబుల్ టాక్ షో

“రండి రండి కేశవరావు గారు,” ఆహ్వానించారు శంకర్రావు గారు. “మీరు ఈ రోజు ఎపిసోడ్‌లో బుజ్జి క్రిష్ణ గారు, తన అన్ బేరెబుల్ షోలో, సూర్య బాబు గారిని ఇంటర్‌వ్యూ చేస్తారు, కాబట్టి కలిసి చూద్దాం అని ఆహ్వానించారు కద, అందుకే వచ్చేశాను,” చెప్పారు కేశవరావు గారు. “ఈ రోజు బుజ్జయ్య తన బావ గారిని … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్, అతుకుల బొంత | 8 Comments

టయన్ (టైగర్ + లయన్)

శంకర్రావు గారు, కేశవరావు గారు వారి ఈవినింగ్ వాక్ కి వెళ్తుండగా జరిగింది ఈ సంఘటన. వాళ్ళింటికి దగ్గరలోనే ఉన్న రంగ మహల్ థియేటర్ లోంచి, మ్యాట్నీ విడిచారేమో, జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానైతే వాళ్ళు మామూలుగా నడుస్తూ రావడం లేదు. పరిగెట్టుకుంటూ వస్తున్నారు. “ఏమయ్యిందయ్యా, అలా పరిగెత్తుకొస్తున్నారు?” ఆందోళనగా అడిగారు శంకర్రావు గారు. … Continue reading

Posted in అతుకుల బొంత | 5 Comments

మదర్ తెరీమా – 5

కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శంకర్రావు గారు, ఎందుకనో పేపర్ పక్కకు జరిపి చూసేసరికి, ఆయన కాళ్ళకి మొక్కబోతున్న కేశవరావు గారు కనిపించారు. “అయ్యయ్యో, ఇదేం దారుణం కేశవరావు గారు,” అంటూ ఆయన్ని వారించి, “అసలు ఏం కష్టమొచ్చింది మీకు?” ప్రశ్నించారు శంకర్రావు గారు. “నా కష్టాలన్ని మీ వల్లే మహాప్రభో, మదర్ తెరీమా గురించిన … Continue reading

Posted in అతుకుల బొంత | 1 Comment

మదర్ తెరీమా – 4

“శంకర్రావు గారు, ఇదేం బాగోలేదండి!” అన్నారు కేశవరావు గారు ఆయన పక్కనే కూర్చుంటూ. “ఏమయ్యిందండి?” చదువుకుంటున్న పేపర్ నుంచి తలెత్తి చూశారు శంకర్రావు గారు. “మదర్ తెరీమా చేసే ‘సేవ’ అలాంటిది ఎందుకో కారణాలు వివరిస్తానన్నారు. ఆ విషయం చెప్పి నెలయ్యింది. కానీ ఇంకా మీరు ఆ ఊసే ఎత్తలేదు,” నిష్టూరం ధ్వనించింది కేశవరావు గారి … Continue reading

Posted in అతుకుల బొంత | 1 Comment

మదర్ తెరీమా – 3

సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు కుమార్. “నాన్నోయి, మీరిలా తెరీమా గురించి వ్యర్థమైన చర్చ చేసి ఏం లాభం లేదు. ఆమెని ఆల్‌రెడీ పునీతని చేసేశారు తెలుసా?” అంటూ. “పునీతని చేయడం ఏంట్రా?” కాస్త అయోమయంగా అడిగారు శంకర్రావు గారు. “అదే నాన్నా, ఆవిడకి sainthood ఇచ్చేశారు. అవును అదేంటి, అంకుల్ నోరు, అలా తెరిచి … Continue reading

Posted in అతుకుల బొంత | 4 Comments