Category Archives: కథలు

మిమ్మల్ని కాస్త నవ్విద్దామని…

కన్నవారి కలలు

రాఘవరావు ఒక ప్రవాస భారతీయుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమెరికాలో స్థిరపడిన తెలుగు వాడు. చాలా మంది తెలుగు వాళ్ళలానే తనూ హెచ్-1 వీసా ద్వారా అమెరికా వచ్చి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని, ఆ తరువాత గ్రీన్ కార్డ్ సంపాదించి, అమెరికాలో తెలుగు వారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న క్యాలిఫోర్నియా రాష్ట్రంలో, భార్యా సమేతంగా … Continue reading

Posted in కథలు, ప్రవాసాంధ్రులు | 13 Comments

సినిమా కష్టాలు

శనివారం మద్యాహ్నం. నేను మూటా ముల్లే సర్దుకుని ఆఫీస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడే రాఘవ, మల్లేశ్, గిరి, నా డెస్క్ దగ్గరికి వచ్చారు. “ఏరా వీకెండ్ ప్లాన్స్ ఏంటి?” అడిగాను నేను. బిక్క మొహం పెట్టారు ముగ్గురూ. “బాసాధముడు (బాస్ + అధముడు) నాకు అర్జెంట్ పని అని అంటగట్టాడురా. ఈ రోజు … Continue reading

Posted in కథలు | 39 Comments

కాస్త అబ్బాయి గురించి ఆరా తీద్దురూ!

“మంచి సంబంధం అండి, మన చిట్టికి సరిజోడీ అనిపిస్తూంది,” జగన్నాధ రావుకి మనవి చేసుకుంది పార్వతమ్మ. “నిజమే అనుకో, కానీ అబ్బాయి ఎక్కడో దూరంగా పూనాలో పని చేస్తున్నాడు. అతడు ఎలాంటి వాడో, అతగాడి గుణగణాలు ఎలాంటివో మనకు తెలిసేదెలా?” సంధేహం వెలిబుచ్చాడు పార్వతమ్మ భర్త జగన్నాధరావు. పక్కనే కూర్చుని ఈ మాటలు వింటున్న చిట్టి … Continue reading

Posted in కథలు | 26 Comments

కల గంటి, కల గంటి!

నేనూ అప్పారావు గాడు కలిసి ఆఫీస్‌లో ఎంటర్ కాగానే, “పితృత్వంలోనే ఉంది పురుష జన్మ సార్థకం. తండ్రి అనిపించుకొనుటే మగ మూర్తికి గౌరవం,” అంటూ పాడుకుంటూ వెళ్తున్న అనిల్ గాడు ఎదురు పడ్డాడు. “ఏంట్రా, పాప పుట్టాక వీడు చాలా హుషారుగా తయారయ్యాడు?” అడిగాను నేను అప్పారావు గాడిని. “అంటే వాడు తండ్రి అయ్యాకే వాడికి … Continue reading

Posted in కథలు | 6 Comments

పేరులో ఏముంది పెన్నిధి?

రవికిరణ్ గాడు నాకు మార్కెట్‌లో ఎదురయ్యాడు. “ఒరే రవికిరణ్, దాదాపు ఐదేళ్ళయ్యిందిరా నిన్ను చూసి. నీ పెళ్ళి కాగానే ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయావు. మళ్ళీ ఈ ఊరిలోనే వచ్చిందా పోస్టింగ్?” ఆనందంగా అడిగాను నేను. రవికిరణ్ గాడు నా క్లాస్‌మేట్. “అవున్రా, రెండు రోజులయ్యింది వచ్చి. నీకు ఫోన్ చేద్దామని అనుకుంటూనే ఉన్నా. ఇంతలో నువ్వే … Continue reading

Posted in కథలు | 64 Comments