Category Archives: పాతికం

పాతిక పద్యాలు ఉండే శతకం.

మురళి పాతికం – 25

ప్రతి నవ్వు వెనకాల ఆనందముండదు ప్రతి జోకు వెనకాల హాస్యమూ ఉండదు కడుపు మండినా కూడా వస్తుంది కామెడీ మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 2 Comments

మురళి పాతికం – 24

ధర్మము ఓడితే దేవుడు దిగి రాడు ఎదురు చూపు వల్ల ఏమియూ జరుగదు మనిషి దైవమగుట ఒక్కటే మార్గము మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 2 Comments

మురళి పాతికం – 23

శాంతి దొరుకుటంత సులభమ్ము కాదు యుద్ధమన్నది అంత నీచమూ కాదు శాంతి నిలుపుటకు యుద్ధమ్ము అవసరము మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 1 Comment

మురళి పాతికం – 22

ముందు ఏమగునో ఎవరికీ తెలియదు చావు అన్నది ఎపుడు చెప్పి రాదు ఉన్నన్ని రోజులూ మిన్నగా బతుకుము మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 1 Comment

మురళి పాతికం – 21

గ్రహాంతర యాత్ర సాధ్యమ్ము కావచ్చు గరళమ్ము మింగినూ బ్రతుకవచ్చు. మత మౌఢ్యుడిని మటుకు మార్చనే లేము మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 3 Comments

మురళి పాతికం – 20

రాజకీయాన్ని రంకుతో పోల్చుట ఉడుకు రక్తం చేయు పెద్ద తప్పు రంకులో నీతి రాజకీయాన ఎక్కడ మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 5 Comments

మురళి పాతికం – 19

కష్టమొచ్చినపుడు కట్రాటగా మరి కాలు చేయాడక కుములు కన్నా ఆలోచనలు మాని ఆచరించుట మేలు మురళి మాట మూడు ముక్కలాట

Posted in పాతికం | 3 Comments