Category Archives: బుడుగు

ముళ్ళపూడి సృష్టిని కబ్జా చేశాను!

పార్లమెంటులో బృందగాన బిల్ ప్రవేశపెడితే సినిమా కంటే బాగుంటుందట!

నమస్తే. చాలా రోజుల తరువాత కనిపిస్తున్నందుకు ముందు నన్ను షమించండి. షమించడం అంటే ఎవరైనా తప్పు చేశారు అనుకో, వాళ్ళకి ప్రైవేట్ చెప్పకుండా వదిలేస్తే దాని షమించడం అంటారన్న మాట. అలా నన్ను కూడా షమించేయండి. నా మటుకు నేను సీ గాన పెసూనాంబని, టింకు గాడిని అప్పుడప్పుడు షమిస్తూనే ఉంటాను. సీ గాన పెసూనాంబని … Continue reading

Posted in బుడుగు | 1 Comment

సీ రామ రాజ్జం

“ఒరే బుడుగూ, ఒరే బుడుగూ” పెద్ద పెద్ద అరుపులతో నన్ను నిద్ర లేపింది సీ గాన పెసూనాంబ. ఇక్కడ ఈ నిద్ర లేపే వాళ్ళ గురించి కుంచెం చెప్పాలి. వాళ్ళకు నిద్ర పట్టి చావదు కాబట్టి, వాళ్ళు మేల్కున్నప్పుడు మనం మాత్రం ఎందుకు నిద్ర పోవాలనే కుళ్ళుతో వాళ్ళు మన్ని నిద్ర లేపుతారు. పోనీ ఆ … Continue reading

Posted in బుడుగు, సినిమాలు | 19 Comments

నేనెక్కడికీ పోలేదోచ్!

నమస్తే, నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. కావాలంటే మా బాబాయిని అడుగు. హదేంటి, బుడుగు మళ్ళీ వచ్చేశాడు అని హాశ్చర్య పోయారా? హాశ్చర్యమెందుకు, నేనెక్కడికన్నా వెళ్తే కద? నేను, రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గానా పెసూనాంబ, మా వీధి చివర జెట్కా వాడు, … Continue reading

Posted in బుడుగు | 10 Comments

మాతుర్ బాషా దినోస్తవం

“బురుగూ బురుగూ, మాతుర్ బాషా దినోస్తవం అంటే ఏంటి?” అడిగింది నన్ను సీ గాన పెసూనాంబ. “సీ గాన పెసూనాంబా, సీ గాన పెసూనాంబా, మాతుర్ బాషా దినోస్తవం అంటే నాకు తెలీదు. నేనెప్పుడూ తినలేదు,” అని చెప్పాను నేను. “నీ మొహం! అది తినేది కాదు. ఒక పండగట. మా అమ్మ చెప్పింది. కానీ … Continue reading

Posted in బుడుగు | 9 Comments

ఆటలో అరటిపండు

ఆటల గురించి నాదొక అభిప్రాయం. అభిప్రాయం అంటే నాకు తెలీదు. కానీ బాబాయి ఎప్పుడూ వాడి అభిప్రాయాల గురించి చెప్తూంటాడు. కాబట్టి నాది కూడా వినండి. వింటే మీకొక చేగోడీ ఇస్తా. (ఉత్తినేలే, నేను చేగోడీలు లాక్కోవటమే కానీ, ఇవ్వడం ఉండదు. కావాలంటే మా టింకూ గాడిని అడగండి.) ఇంతకీ ఏం చెప్తున్నాను. ఆ! ఆటల … Continue reading

Posted in బుడుగు | 13 Comments

ప్రేమంటే తెలీదా? ఇన్సల్ట్!

ఈ సీగాంపెసూనాబ ఉందే, మహా గడుసుది. గడుసు అంటే నాకు తెలీదనుకో. కానీ దాన్ని అందరూ అలానే అంటారు. “ఒరే బుడుగూ, అది చాలా గడుసుదిరా, అది ఎవరికి పెళ్ళాం అవుతుందో వాడిని కొంగుకి కట్టేసుకుంటుంది,” అని మా అమ్మ అంటూ ఉంటుంది. పెళ్ళాం అంటే ఆడది. దానికి ఫదేళ్ళు కంటే ఎక్కువ ఉంటాయి. సీగానపెసూనంబకి … Continue reading

Posted in బుడుగు | 9 Comments

ఎలక్సన్లు వచ్చేశాయి

నమస్కారం. నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. ఇది నాకు బాబాయి చెప్పాడు. అలాగే ప్రజలు పిడుగులైతే పార్టీలు వాళ్ళకు గొడుగులుట. ఇది బాబాయి చెప్ప లేదు. మొన్న మా కాలనీలో మీటింగ్ ఐతే వచ్చిన ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు. రాజకీయ నాయకుడు అంటే లీడర్ అన్నమాట. … Continue reading

Posted in బుడుగు | 8 Comments