Category Archives: సినిమాలు

మనోళ్ళ ఏకైక వినోద మాధ్యమం!

న బూతో న భవిష్యత్

ఒక్క సారిగా తెగులు రాష్ట్రాలు రెండూ భగ్గుమన్నాయి. ఒక ప్రీ-రిలీజ్ సినీ ఫంక్షన్ యొక్క వేదిక మీద, చాలా-కుతి రావు అనే ఒక సీనియర్ నటుడు అమ్మాయిల గురించి అసభ్యంగా క్యామెంట్ చేయడమే దానికి కారణం. అసలే స్త్రీని అపరిమితంగా గౌరవించే తెగులు ప్రజల మనో భావాలు ఎంతలా దెబ్బ తిని ఉంటాయో చదువరులకి ఇప్పటికే … Continue reading

Posted in 'కరెంట్' అఫైర్స్, మన సమాజం, సినిమాలు | 11 Comments

సొట్టప్ప రాహుకలిని ఎందుకు చంపాడు?

నా ఫోన్‌లో ఉన్న ఏంటప్పా యాప్ శబ్దం చేసింది. (ఇప్పుడు మనుషులు అందరూ ఏంటప్పా ద్వారానే సంభాషించుకుంటున్నారు. దీని దెబ్బకి ముఖపుస్తకం లాంటి పాపులర్ యాప్స్‌కి కూడా కొన్ని మూలల చెదలు పట్టాయి.) నా ఫోన్ వైపు చూశాను. “ఏంటప్పా, అసలు సొట్టప్ప రాహుకలిని ఎందుకు చంపాడప్పా?” అని అప్పారావు నుంచి మెసేజ్. “ఇన్ని అప్పాలెందుకురా, … Continue reading

Posted in సినిమాలు | 2 Comments

అందరికి అన్నీ ఇస్తాం!

రుబ్బు రోలు రెడ్డికి ఆ రోజు పొద్దున నిద్ర లేవగానే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. రుబ్బు రోలు రెడ్డి తెగులు సినిమాతో పరిచయమున్న వారందరికి బాగా తెలుసు. ఆయన కళాకారులకు ఏ మాత్రం సేవ చేసే అవకాశమున్నా గద్దలా తన్నుకు పోతాడని ఆయనకి సినీ లోకం “కళా రాబందు” అనే బిరుదినిచ్చి సత్కరించింది కూడా. … Continue reading

Posted in సినిమాలు | 6 Comments

అడ్వర్టైజ్‌మెంట్స్ ఎలా పుడతాయంటే…

“రండి, కేశవరావు గారు! మీరు ఊరికి వెళ్ళినప్పటి నుండి, మీ కంపెనీ చాలా మిస్ అవుతున్నాను. చాలా రోజులయ్యింది మనం ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుని,” ఆహ్వానించారు శంకర్రావు గారు. “ఇదిగోండి, కాఫీ,” అంటూ తెచ్చి టేబుల్ మీద పెట్టారు పార్వతమ్మ గారు. “అదేంటి, నేను అడగకుండానే తెచ్చేశావు?” ఆశ్చర్య పోయారు శంకర్రావు గారు. “మీరు … Continue reading

Posted in అతుకుల బొంత, సినిమాలు | 4 Comments

స్టార్ నా కొడుకులు (ఆధునిక బేతాళ కథలు – 4)

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా స్మశానము కేసి నడువ సాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, “రాజా, నీ శ్రమ, దీక్ష చూస్తూంటే నాకు ముచ్చటేస్తూంది. ఐతే కేవలం వర్తమానమే కాకుండా, భవిష్యత్తు మీద కూడా దృష్టి పెట్టిన … Continue reading

Posted in సినిమాలు | 6 Comments

రాతని చేరుకున్న గీత

బాపు గారు, మీరు తీసిన సినిమా ఎంత కమనీయంగా ఉంటుందంటే, అది సినిమాలా కాక ఒక బొమ్మల కథ చదివినట్టుంటుంది. ఓక నవల బాగుండకపోవచ్చు కానీ, దానికి మీరు అందించిన ముఖ చిత్రం ఎప్పుడూ వంక పెట్టలేని విధంగా ఉంటుంది. మీ ప్రభావం, ప్రకాశం తెలుగు జాతి మీద ఎంతగా ఉన్నాయంటే, బాపు బొమ్మ అనేది … Continue reading

Posted in సినిమాలు | 8 Comments

రిచంజీవి 150వ సినిమాకి కథ కావాలి!

త్రిలింగ సినిమా ఇండస్ట్రీ అంతా ఈ వార్తతో అట్టుడికిపోయింది. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎన్నికలయిపోయాయి కాబట్టి రిచంజీవి తన 150వ చిత్రం పూర్తి చేద్దామని కృత నిశ్చయంతో ఉన్నాడని, ఆ సినిమా కోసం ఒక మంచి కథ వెతుకుతున్నాడు అని, మంచి కథ ఎవరు చెప్తే వారికి కోటిన్నొక్క రూపాయలు ఇస్తాడన్న విషయం … Continue reading

Posted in సినిమాలు | 19 Comments