Category Archives: అమెరికాలో ఆపసోపాలు

అమెరికాలో ఆపసోపాలు – 1 (పరిచయ కార్యక్రమం)

(గమనిక: “అమెరికాలో ఆపసోపాలు” 96-97లో నేను రాసిన సీరియల్ కథ. ఇది ఒక రకంగా నేను ఇంతకు ముందు రాసిన “సీనియర్”కి loose sequel. ఐతే అందులో పాత్రలు ఈ కథలో కనిపించవు. “సీనియర్” అమెరికాకి చదువుకోవడానికి వచ్చిన తెలుగు విద్యార్థుల గురించి ఐతే, ఈ కథ అమెరికాలో పని చేస్తున్న తెలుగు బాచిలర్స్ గురించి. … Continue reading

Posted in అమెరికాలో ఆపసోపాలు | 5 Comments

అమెరికాలో ఆపసోపాలు – 2 (నవలామణి నవలల పిచ్చి)

పొద్దున్నే ఏడు గంటలకు కళ్ళు నులుముకుంటూ చికాకుగా చుట్టు పక్కల చూశాడు సంజయ్. “వెధవ విమానాలు, పొద్దున పూటైతే ఠంచనుగా timeకి వచ్చేస్తాయి,” తనలో తాను గొణుక్కున్నాడు. ఇప్పుడతను airportలో ఉన్నాడు. “ఒరే సంజయ్!” అంటూ సుడిగాలిలా దూసుకుని వచ్చాడు సూరి బాబు. “ధన్యవాదాలురా. సమయమునకు వచ్చి నా కార్యమును సులభము చేసితివి,” అన్నాడు ఎలుగుబంటిలా … Continue reading

Posted in అమెరికాలో ఆపసోపాలు | 4 Comments

అమెరికాలో ఆపసోపాలు – 3 (సూరి బాబు హోటల్ అనుభవం)

Interview సాయంత్రం అయిపోగానే సూరిబాబుని సంజయ్ pick up చేసుకున్నాడు. “ఏరా, సూరి, ఎలా అయ్యింది మీ కాబోయే బాసుతో పరిచయం?” అడిగాడు. “ఫర్లేదురా, బాగానే అయ్యింది. ఈ రాత్రికి ఏదయినా Indian restaurant కి వెళ్దామురా సంజయ్,” request చేశాడు సూరిబాబు. “అలాగే లేరా నీ ఇష్టం. మేము ఇక్కడ ఎపుడూ వెళ్తూంటాం అనుకో,” … Continue reading

Posted in అమెరికాలో ఆపసోపాలు | Leave a comment

అమెరికాలో ఆపసోపాలు – 4 (buffet అంటే బోలెడు ఫుడ్డు!)

లోపల అడుగు పెట్టి చిన్నగా వణికాడు సూరి బాబు. “ఓరి నాయనో, ఎంత మంది దేశీలు రా బాబూ. వీళ్ళల్లో ఎవడెవడు మా ఇంటి వెనుకాతల ఉండే వాడో? ఎవడెవడి నాన్న నన్ను చావగొట్టాడో?” మనసులోనే అనుకున్నాడు. “సూరీ. ఇక్కడ buffet బెస్టురా. పద, వెళ్ళి లాగిద్దాం,” సంజయ్ సూరి బాబు గురించి wait చేయకుండానే … Continue reading

Posted in అమెరికాలో ఆపసోపాలు | Leave a comment

అమెరికాలో ఆపసోపాలు – 5 (AMWAY? NO THANKS! NO WAY!!!)

“Hello, hello, ఏంటి డిన్నర్‌కని వచ్చారా?” పక్కనుంచి chair లాక్కుని కూర్చుంటూ ప్రశ్నించాడు ఆయన. “లేదు, అందరూ తినేంత వరకూ కూచుని వాళ్ళ ఎంగిలి పళ్ళాలు కడుగుదామని వచ్చాం,” కసిగా సమాధానం ఇచ్చాడు సంజయ్. “హబ్బా, హబ్బా, మీరు భలే జోకులు వేస్తారండి, చిలిపి,” అని ఆయన సూరి బాబు వైపు తిరిగి, “Hello, నా … Continue reading

Posted in అమెరికాలో ఆపసోపాలు | 3 Comments