Category Archives: బట్టతల

బట్టతల ముచ్చట్లు

ఈ సీరియల్‌ని ముందునుంచి ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించిన పాఠకులకందరికీ నా ధన్యవాదాలు. నేను ప్రతి కామెంట్‌కి బదులు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి కామెంట్, అది చిన్నదైనా, పెద్దదైనా, తప్పని సరిగా చదివానని అని ఈ పోస్ట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను. Each comment of yours has truly encouraged … Continue reading

Posted in బట్టతల | 10 Comments

బట్ట తల వచ్చేసిందే బాలా – 1

“బట్ట తల వచ్చేసిందే బాలా, కష్ట దశ తెచ్చేసిందే చాలా! ఇష్ట సఖి ఎట్లా దొరుకును నువ్వే చెప్పు? జుత్తు ఉన్నప్పుడు నీలగడం మనదే తప్పు! బట్ట తల వచ్చేసిందే బాలా!” అని తనలో తాను పాడుకుంటూ షేవ్ చేసుకుంటున్నాడు పాపారావు. మా ముగ్గురి గుండెలు ఉసూరుమన్నాయి ఆ ఆ పాట వినగానే.  పాపారావు గాడికి … Continue reading

Posted in బట్టతల | 4 Comments

బట్ట తల వచ్చేసిందే బాలా – 2

మా నలుగురికీ ఒక మంచి అలవాటుంది. అదేంటంటే పగలంతా ఎక్కడ ఎలాంటి తిరుగుళ్ళు తిరిగినా రాత్రి అందరం పడుకునే ముందు ఒక గంట పిచ్చాపాటీ మాట్లాడి ఒకరి యోగ క్షేమాలు ఇంకొకరం విచారించుకుంటాం. ఈ పధ్ధతిలోనే భాగంగా శేఖర్ పాపారావుని అడిగాడు. “అవునురా గత వారం పెళ్లి చూపులని మీ ఊరెళ్ళావు కద . ఏమయ్యింది?” … Continue reading

Posted in బట్టతల | 4 Comments

బట్ట తల వచ్చేసిందే బాలా – 3

“పూర్వం దక్షిణ భారత దేశంలో, హైదరాబాద్ అనే నగరంలో, గుర్నాథం అనే ఒక యువకుడుండేవాడు,” మొదలెట్టాడు నారాయణ్. “ఆగు! సలహా అన్నావు! ఇదేదో కథలా ఉంది. అయినా పూర్వం అంటే ఎంత పూర్వం?” అడ్డు పడ్డాడు పాపారావు. “అంటే 2007లో.” “అది పూర్వమా? ఏడ్చినట్టుంది. లాస్ట్ ఇయరే కద!” “నాకు తెలిసి కథలు అలానే మొదలెడతారు!” … Continue reading

Posted in బట్టతల | 8 Comments

బట్ట తల వచ్చేసిందే బాలా – 4

ఏదో పాపారావు మీద జోకులు వేస్తున్నాం కానీ మా ముగ్గురి పరిస్థితి చాలా బ్యాడ్‌గానే ఉంది (జుత్తుకి సంబంధించింత వరకు). పాపారావులానే మేమందరం 30 ఏళ్ళ లోపు వాళ్ళమైనా, మా అందరి జుత్తు బాగా పల్చబడింది. దానికే రక రకాల హంగులు చేసుకుని ఉన్నదానికంటే ఎక్కువ జుత్తు చూపించాలని ప్రయత్నిస్తూ కష్ట పడుతూంటాం. ఈ సందర్భంగా … Continue reading

Posted in బట్టతల | 6 Comments