Category Archives: Senior

Senior – Part 1

గమనిక: సీనియర్ 94-95లో నేను రాసిన సీరియల్ కథ. అప్పట్లో (అంటే మా golden daysలో), మా ఇంజనీరింగ్ క్లాస్‌మేట్స్ అంతా అమెరికాలోని రకరకాల చోట్ల, ఎం.ఎస్. చేస్తూ ఉండే వాళ్ళం. మా అందరికి ఒక్క ఎం.ఎస్.కే చావు తప్పి కన్ను లొట్టపోతే, మా రమణ్‌రావు మాత్రం రెండో ఎం.ఎస్. కూడా మొదలు పెట్టాడు. ఇలా … Continue reading

Posted in Senior | Leave a comment

Senior – Part 2

Cafeteria. అందరూ busyగా assignments చేసుకుంటున్నారు. సడన్‌గా ఒక కార్నర్‌లో కలకలం చెలరేగింది. మల్లేష్ సోమూకి లాగిపెట్టి ఒకటి ఇచ్చాడు. సోమూ బేర్‌మని అరిచి కింద పడ్డాడు. “ఎంత పొగర్రా నీకు,” అంటూ మల్లేష్ సోమూని లేపి మళ్ళీ ఒక గుద్దు గుద్దాడు. విసురుగాపోయి పడబోతున్న సోమూని రెండు బలమైన చేతులు అడ్డుకున్నాయి. అది ఎవరో … Continue reading

Posted in Senior | Leave a comment

Senior – Part 3

Computer Lab. Students అంతా workstations ముందు కూర్చుని బుద్ధిగా పని చేసుకుంటున్నారు. M.B. సోమూ mouseని గాలిలో తిప్పుతూ స్క్రీన్ మీద cursor కదలడంలేదేమిటా అని ఆశ్చర్యపోతున్నాడు. రమణ్‌రావు దగ్గరికి నర్సింలు ఒక అమ్మాయితో సహా వచ్చాడు. “ఈమె పేరు బిందు మాధవి అన్న. Apartment కోసం పరేషాన్ అవుతూంటే నీ కాడికి తోలుకొచ్చినా!” … Continue reading

Posted in Senior | Leave a comment

Senior – Part 4

“ఏరా! ఒక సిగరెట్ ఉంటే ఇలా పడేయి,” అన్నాడు రావు. “ఇగో అన్నా! అవు అన్నా, ఏంది గట్ల సోంచాయిస్తున్నవు? బిందు మాధవి గురించా?” question mark face పెట్టి అడిగాడు నర్సింలు. “ఒరే నర్సీ, నీకెప్పుడన్నా నేను universityకి వచ్చే అమ్మాయిల categories చెప్పాన్రా?” అన్నాడు రమణ్‌రావు. “లే అన్నా!” అన్నాడు నర్సింలు. సిగరెట్టుతో … Continue reading

Posted in Senior | Leave a comment

Senior – Part 5

School. “ఏరా! ఏంటలా ఆ professor room దగ్గర, కోలాహలం?” అడిగాడు రమణ్‌రావు. “నీకు తెలీనిదేముందన్న! గా professor కాడ ఒక assistantship ఏదో ఉందని ఎవలో చెప్పిండ్రంట. ఈల్లందరూ నేను ముంగట పోతానంటె నేను పోతనని లొల్లి జేస్తుర్రు” అన్నాడు నర్సింలు. రమణ్‌రావు వాళ్ళ దగ్గరికి నడిచాడు. సోమూ “please అండీ, నేనే ముందు … Continue reading

Posted in Senior | Leave a comment

Senior – Part 6

Lab: రాత్రి పదకొండు గంటలు కావొస్తూంది. మధ్యాహ్నంనుంచీ ఏమీ తినకపోవడంతో సోమూ కడుపులో బుల్లి బుల్లి dinosaurs పరిగెడుతున్నాయి. బిందు మాధవి పరిస్థితి అలాగే ఉంది. “ఏమండీ, ఇక్కడికి ఎం సీ డొనాల్డ్స్ ఎంత దూరం?” అడిగాడు సోమూ, నర్సింలుని. “ఎం సీ డొనాల్డ్సా?” ఆశ్చర్య పోయాడు నర్సింలు. వెంటనే వెలిగింది అతనికి. “ఓ, McDonalds … Continue reading

Posted in Senior | Leave a comment

Senior – Part 7

Lab: సోమూ తిరిగి labకి వచ్చేటప్పటికి, lab studentsతో కిక్కిరిసి పోయి ఉంది. “ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ studentsకి చదువు అంటే చాలా శ్రద్ధ ఉన్నట్టుంది”, తనలో తాను అనుకున్నాడు సోమూ. ఒక cornerలో చాలామంది ఓ workstation ముందు గుమిగూడి ఉండడం చూసి అటు వెళ్ళాడు సోమూ. అక్కడ ఓ పది మంది … Continue reading

Posted in Senior | Leave a comment