పప్పు లాంటి మనిషి


శోకేశ్ బాబు వాళ్ళ తాత గారు నటించిన “నిప్పు లాంటి మనిషి” సినిమాని తన ఆఫీసులో ఉన్న బిగ్ స్క్రీన్ టీవీ మీద చూస్తున్నాడు. ఎప్పటికైనా తన తాత గారంతటి వాడు కావాలన్నది శోకేశ్ కోరిక. ఒక్క శోకేశే కాదు, తాత గారి వారసులంతా కూడా ఆయనలా అయిపోదామని ఫీల్ అవుతూంటారు. (కొందరు దాదాపు అయి పోయామని కూడా అనుకుంటూంటారు లెండి.)

ఈ సీనుని రూం బయటనుండి గమనిస్తున్న బర్రెల రామకృష్ణుడు, బుచ్చెం నాయుడు చూసి పళ్ళు కొరుక్కున్నారు. “ఈ సినిమా చూసినంత మాత్రాన పెద్దాయనలా అయిపోతాడు అనుకోవడంలోనే చినబాబు తెలివితేటలన్నీ బయట పడుతున్నాయి,” కసిగా అన్నాడు బుచ్చెం నాయుడు.

“తనకి తెలివితేటలు ఉన్నాయో లేదు పక్కనుంచు. మనకు అసలు లేవు అనుకుంటాడు కద. అందుకే మన మంత్రిత్వ శాఖల్లో వేళ్ళు కాళ్ళు కూడా పెట్టేసి మనల్ని శోకంలో ముంచెత్తుతున్నాడు,” బాధగా అన్నాడు రామకృష్ణుడు.

“అవును, మనమంతా వెళ్ళి సూర్యబాబు నాయుడుతో, “యాండీ, మీ అబ్బాయి ఒక రాజ్యాంగేతర శక్తి, అదే extra constitutional power లా తయారు అయ్యాడు,” అని చెప్పడమే మనం చేసిన పెద్ద పొరపాటు,” వాపోయాడు బుచ్చెం నాయుడు.

“అవును, దాంతో ఆయన నొచ్చుకుని, అసలే నేను చండ శాసనుడిని, పార్టీకి చెడ్డ పేరు వస్తే భరించలేను, అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని, దీనికి ఒకటే పరిష్కారం, చినబాబుని మంత్రిని చేసేస్తున్నా, ఇంక వాడు రాజ్యాంగేతర శక్తి కాదు, రాజ్యాంగ లోపలి శక్తే అని, శోకేశ్‌ని మంత్రిని చేసి పారేశాడు,” ఘొల్లుమన్నాడు బర్రెల రామకృష్ణుడు.

“మంత్రయ్యాక మనోడి అవాకులు చెవాకులు పదింతలు పెరిగి పోయాయండి. అప్పుడే బెటర్. సైలెంట్ గా మనల్ని హింసించే వాడు. మంత్రయ్యాక ఒకటే స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అని భయపడి చస్తున్నాం,” కసిగా అన్నాడు బుచ్చెం నాయుడు.

“నువ్వు చెప్పింది నిజమే, పద, వెళ్ళి సూర్యబాబు గారి చెవులు కొరుకుదాం. చినబాబుకి ఇంకా మంత్రి పదవి నిర్వహించేంత పరిణితి రాలేదు, కొన్ని రోజులు, రాజ్యాంగేతర శక్తిగానే ఉండనివ్వండి అని సలహా ఇద్దాం,” అంటూ బుచ్చెం నాయుడుని తీసుకుని సూర్యబాబు చేంబర్స్ వైపు బయలుదేరాడు బర్రెల రామకృష్ణుడు.

****

“ఐతే చినబాబు వల్ల మన పార్టీ ప్రతిష్టలు మసక బారుతున్నాయి అంటారు,” కళ్ళ జోడు పై నుండి ఇద్దరినీ తీక్షణంగా చూస్తూ అన్నాడు సూర్యబాబు నాయుడు. ఆయన అప్పుడే మోస్తా తీర ప్రాంతాల దగ్గరి సముద్రానికి “సూర్యన్న సాగరం” అని పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఎలాగూ పథకాలన్నిటికి తన పేరు పెట్టేశాడు, సముద్రాలని, నదులని, పిల్ల కాలువలని కూడా ఎందుకు వదలాలి అన్నది ఆయన ఆలోచన.

“ఆయ్, మసక బారిపోవడం కాదండి, ఆయన స్టేట్‌మెంట్స్‌ని మీడియాకి సర్ది చెప్పలేక మాకు మెంటల్ వచ్చేస్తుంది,” వినయంగా చెప్పాడు రామకృష్ణుడు.

“వేరే మంత్రిత్వ శాఖల గురించి నీకెందుకు అని నన్ను ఎప్పుడో కోప్పడ్డారు కదండి. ఇప్పుడేమో చినబాబుగారు, నా మంత్రిత్వ శాఖని నిర్వహించడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదండి,’ గుర్రుగా కంప్లైంట్ చేసాడు బుచ్చెం నాయుడు.

“ఇంతకి వాడు ఇచ్చిన డ్యామేజింగ్ స్టేట్‌మెంట్స్ ఏంటో చెప్పండి,” పురమాయించాడు సూర్యబాబు.

“చిత్తం,” అంటూ జేబులోంచి ఒక పెద్ద చిట్టా తీశాడు రామకృష్ణుడు.

“ఎహే, మిమ్మల్ని అడిగింది చిట్టా చదవమని కాదు, వాడి టాప్ 5 డ్యామేజింగ్ స్టేట్‌మెంట్స్ చెప్పండి చాలు,” చిరాకు ద్వనించింది సూర్యబాబు గొంతులో.

“హిండియాకి స్వాంతంత్ర్యం వచ్చి 66 ఏళ్ళు అయ్యింది అన్నాడండి. వచ్చి 69 ఏళ్ళు కదండి అయ్యింది,” గొణిగాడు బుచ్చెం నాయుడు.

“రిపబ్లిక్ కానంత వరకు మనం పూర్ణ స్వతంత్ర్యులం కాదు అని వాడి అభిప్రాయం. అందుకే 1950 నుంచి లెక్క పెట్టాడులే, నెక్స్ట్?”

“అలా అనుకున్నా 67 ఏళ్ళు అయినట్టు కద?” బర్రెల రామకృష్ణుడి చెవిలో రహస్యంగా అన్నాడు బుచ్చెం నాయుడు.

“నువ్వు నోరు మూయి, ఇంత చెప్పిన వాడు, ఒక సంవత్సరం తేడా వస్తే ఏమవుతుంది అని కూడా అంటాడు,” కసురుకున్నాడు రామకృష్ణుడు.

“ఏంటా గుసగుసలు? తరువాత స్టేట్‌మెంట్ చెప్పండి!” గద్దించాడు సూర్యబాబు.

“మొన్నటికి మొన్న మన రాజ్యాంగ కర్త జయంతి రోజు, అందరికి ఆయన వర్ధంతి శుభాకాంక్షలు చెప్పాడు,” నసిగాడు రామకృష్ణుడు.

“అంటే ఆయన మన మధ్య లేడు అన్న విషయం గుర్తొచ్చి ఉంటుంది. అందుకే పొరపాటున అలా అని ఉంటాడు లే!”

“అంతే అంటారా, మరి ప్రమాణ స్వీకారం రోజు శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి ఘటించాడు కద?” ఇది బుచ్చెం నాయుడు.

“అదా, మన రాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉండి కీర్తిశేషులైన ఎందరో మహానుభావులని గుర్తు చేసుకుని అలా ఘటించి ఉంటాడులే.”

“ఒక సభలో, వచ్చే ఎన్నికల్లో మన పార్టీ కనీసం 200 సీట్లు గెలుస్తుందని కమిట్ అయ్యాడు. మన రాష్ట్రం మొత్తంలోనే అన్ని సీట్లు లేవు కద,” బాధతో బర్రెల రామకృష్ణుడి గొంతు వణికింది.

“ఓరి పిచ్చోళ్ళలారా! అప్పటికి రీ-ఆర్గనైజేషన్ వల్ల మన రాష్ట్రంలో 250 సీట్లు ఉంటాయిలే!”

“ఇంతకంటే దారుణం ఏంటంటే, బంధు ప్రీతి, కుల పిచ్చి ఉన్న పార్టీ కేవలం మనదే అన్నాడు,” ఉక్రోశంగా అన్నాడు బుచ్చెం నాయుడు

“నిజమే చెప్పాడు కద!” అని నాలుక కరుచుకున్నాడు సూర్యబాబు. తరువాత, “సరేలే నేను వాడితో మాట్లాడతాను. రాజకీయాల్లో ఇంత నిజాయితీ పనికి రాదు అని అర్థమయ్యేలా చెప్తాను,” అంటూ భరోసా ఇచ్చాడు.

“ఈ చెప్పడాలు, బుజ్జగించడాలు ఎందుకు సార్, చినబాబుకి మంత్రి పదవి, కాస్త రాజకీయ పరిణితి వచ్చాక ఇస్తే సరిపోయేది కద?” ఈ సారి ఇద్దరు ముక్తకంఠంతో అన్నారు.

“అక్కడికి మనమందరం రాజకీయ పరిణితి వచ్చాకే మంత్రులు అయినట్టు! వెళ్ళండి వెళ్ళండి, మీ పని, అదే చినబాబు ఇచ్చిన పని చూసుకోండి,” కసురుకున్నాడు సూర్యబాబు.

 

Advertisements
Posted in 'కరెంట్' అఫైర్స్ | 5 Comments

సొట్టప్ప రాహుకలిని ఎందుకు చంపాడు?


నా ఫోన్‌లో ఉన్న ఏంటప్పా యాప్ శబ్దం చేసింది. (ఇప్పుడు మనుషులు అందరూ ఏంటప్పా ద్వారానే సంభాషించుకుంటున్నారు. దీని దెబ్బకి ముఖపుస్తకం లాంటి పాపులర్ యాప్స్‌కి కూడా కొన్ని మూలల చెదలు పట్టాయి.)

నా ఫోన్ వైపు చూశాను. “ఏంటప్పా, అసలు సొట్టప్ప రాహుకలిని ఎందుకు చంపాడప్పా?” అని అప్పారావు నుంచి మెసేజ్.

“ఇన్ని అప్పాలెందుకురా, కాసేపట్లో సమాధానం తెలిసి పోతుంది కద?” అనునయంగా నేను రిప్లై కొట్టాను.

“అసలు ఎందుకు చంపి ఉంటాడంటావు?” – అప్పారావు

“నా ఉద్దేశం చిన్నప్పుడు సొట్టప్ప బట్ట తల మీద ఉన్న సొట్టలపై, బుజ్జి రాహుకలి బోలెడు జోకులు వేసి ఉంటాడు. పెద్దయ్యాక ఒక రోజు బరస్ట్ అయ్యి, రాహుకలిని పొడిచి ఉంటాడు.” -సాలోచనగా నేను

“మౌత్ ముయ్యి. రాహుకలి లాంటి కళాఖండంలో అలాంటి చెత్త కారణాలు ఉండవు. నీ పిచ్చి వాగుడు వింటే జక్కన్న వెక్కి వెక్కి ఏడుస్తాడు.” – వాడు

“ఆయన ఏమీ ఏడవడు. ఈ సినిమా ఫలితం ఏమైనా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి ఇంకో పది కళా ఖండాలు తీసే సత్తా సంపాదించుకునేశాడు ఈ పాటికే. పైగా ఒరేయి! నేను మౌత్ మూసే ఉన్నాను. నా చేతి వేళ్ళు వాడి టైప్ చేస్తున్నాను అంతే! కి కి కి!” – నేను

“ఒరే, ఈ రోజు నిన్ను నేను భరించలేక పోతున్నారా. ఏదో మనశ్శాంతి కోసం నీకు టెక్స్ట్ చేస్తే, ఇంకా బాధ పెడుతున్నావు.” – అప్పడు.

ఈ సారి నాకు చిరాకు ముంచుకొచ్చింది.

“అబ్బా, ఏదో సినిమాలో ఎవరో ఎవరినో చంపితే నీకు టెన్షన్ ఎందుకురా? అయినా కొన్ని వార్తలు మెల్లగా లీక్ అవుతున్నాయి. ఆల్‌రెడీ ఆన్‌లైన్ రివ్యూస్ మొదలయ్యాయి. సొట్టప్ప ఒకే సారి రాహుకలిని చంపడంట. ఖండ ఖండాలుగా చంపుతాడంట.” – నేను

“నో! నహీ! ఇంకేం చెప్పకు. సస్పెన్స్ బ్రేక్ చేయకు. నా స్వయాన నేను ఆ సీన్‌ని పెద్ద తెర మీద చూస్తే కాని నాకు సంతృప్తి కలగదు.” – వాడు

“ఐతే కొన్ని గంటలు ఆగు. ఎలాగూ బ్లాక్‌లో టికెట్ కొని అఘోరించి ఉంటావు కద. విషయం తెలిసిపోతుంది.” – నేను

“పో అప్పా! అప్పటి వరకు టెన్షన్ తట్టుకోవాలి కద.” – అప్పి గాడి మెసేజ్

“తెలిశాక టెన్షన్ తగ్గుతుందా అప్పా?” – నా మెసేజ్ (ఇందులో అప్పా రావు గాడిని అప్పా అని నేను సంబోధించి చేసిన పద ప్రయోగం తమరు గమనించే ఉండాలి.)

“అప్పుడు ఇంకో టెన్షన్ అప్పా!” – అప్పారావు

“అదేంటి మళ్ళీ?” – నేను

“ఇన్నాళ్ళు జీవితంలో ఒక ఉత్కంఠ ఉండేది. సమాధానం తెలిసితే అది కాస్తా పోతుంది. అప్పుడు దేని కోసం ఎదురు చూడాలప్పా?”

నేను అవాక్కయ్యాను.

 

Posted in సినిమాలు | 2 Comments

అందరికి అన్నీ ఇస్తాం!


రుబ్బు రోలు రెడ్డికి ఆ రోజు పొద్దున నిద్ర లేవగానే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. రుబ్బు రోలు రెడ్డి తెగులు సినిమాతో పరిచయమున్న వారందరికి బాగా తెలుసు. ఆయన కళాకారులకు ఏ మాత్రం సేవ చేసే అవకాశమున్నా గద్దలా తన్నుకు పోతాడని ఆయనకి సినీ లోకం “కళా రాబందు” అనే బిరుదినిచ్చి సత్కరించింది కూడా.

అర్జెంట్‌గా తన సెక్రెటరినీ పురమాయించాడాయన. సెక్రెటరీ హాజరయ్యాడు.

“ఇదిగినోయి ఈ మధ్య నా తరపు నుండి కళా పోషణ తక్కువయినట్టు నాకు కూసింత అనుమానంగా ఉంది,” అన్నాడు రుబ్బు రోలు రెడ్డి.

“మొన్నే కద సార్, ఏదో ఫంక్షన్‌కి మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిస్తే అక్కడ పరమ శివుడి మీద మీకు తెలిసిన మంత్రాలన్ని చదివి వారికి దండిగానే విరాళం ఇచ్చి వచ్చారు?”

“అది ఎంతోయి, ఆటలో అరటి పండు! కాస్త ఘనంగా ఏదైనా చేయాలి.”

“ఏం చేద్దామంటారు?”

“ఈ సారి కని విని ఎరుగని రీతిలో ఒక అవార్డుల ఫంక్షన్ చేయాలి. తెగులు సినీ పరిశ్రమని గౌరవించాలి.”

“అలాగే, ఎవరెవరికి అవార్డులు ఇద్దామనుకుంటున్నారు? ఎవరిని పిలవాలంటారు?”

“మొత్తం తెగులు ఇండస్ట్రీలో ఉన్న అందరు నటీ నటులని, సాంకేతిక నిపుణలని ఆహ్వానించు.”

“ప్రాబ్లం అవుతుందేమో సార్. అవార్డులు రాని వారు సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకి రావడానికి ఇష్టపడరు.”

“అవన్నీ నీకెందుకోయి? నేను చెప్పాను కద, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పంపించు!”

“చిత్తం!”

***

మొత్తం సెగట్రీకే వదిలేయకుండా, పెద్ద తలకాయలందరిని తనే స్వయంగా ఆహ్వానించాడు రుబ్బు రోలు రెడ్డి.

ముందుగా రిచంజీవికి కాల్ చేశాడు. ఆయన ఫోనెత్తగానే సంగతి వివరించాడు.

“మరి ఈ ఫంక్షన్‌లో నాకేదైనా…” నసిగాడు రిచంజీవి.

“అయ్యో ఎంత మాట! ఉత్తమ అవార్డ్ మీకే కద! అందుకే అందరికంటే ముందు మీకు కాల్ కొట్టాను.”

“మరి నేను ఆదరా బాదరలో ఉన్నాను. ఫంక్షన్ ఏమో హౌజాగ్‌లో…”

“మీకు కష్టం కలిగిస్తానా! మీకోసమే స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేశాను.”

“ఎంతైనా మీ అతిథి మర్యాదలు సూపర్. నేను తప్పకుండా వస్తాను.”

“సంతోషం,” అని ఫోన్ పెట్టేసి, బుజ్జి కృష్ణకి కాల్ చేశాడు రెడ్డి.

“ఓ, రెడ్డిగారా! ఏంటి మమ్మల్ని ఇలా గుర్తు చేసుకున్నారు?” అడిగాడు బుజ్జి కృష్ణ.

అవార్డుల ఫంక్షన్ గురించి చెప్పాడు రెడ్డి.

“కళాకారులని గౌరవించాలనే మీ తపన గొప్పది. మరి నేను అక్కడికి అంటే…”

“ఎంత మాట. ఉత్తమ అవార్డ్ మీకే కద! పైగా మీతో పాటు మిగతా ఆహ్వానితులందరికి కలిపి ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేస్తున్నా”

“ఇహ మీరు ఏం వర్రీ కాకండి. నేను తప్పకుండా వస్తున్నాను,” మాటిచ్చాడు బుజ్జి కృష్ణ.

తరువాత కొన్ని గంటల పాటు తెగులు సినిమాలోని పెద్ద నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి అందరికి కాల్ చేసి, ఉత్తమ అవార్డ్ వారికేనని హామీ ఇచ్చి, అందరితోనూ ఫంక్షన్‌కి తప్పకుండా వచ్చేలా మాట పుచ్చుకున్నాడు రుబ్బు రోలు రెడ్డి.

***

హౌజాగ్ నగరంలోని అతి పెద్ద ఆడిటోరియంని బుక్ చేశాడు రెడ్డి. ముందుగా తనకు మాత్రమే అరేంజ్ చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో రిచు విచ్చేశాడు. ఆ తరువాత బుజ్జి కృష్ణతో సహా మిగతా నటీ నటులు విచ్చేశారు. ఇంకో బ్యాచ్‌లో దర్శకులు, సంగీత దర్శకులు, కమెడియన్‌లు, వగైరాలు వేంచేశారు.

“వాయ్యో! అసలు ఇంతమంది సినీ ప్రముఖులు ఒకే కప్పు కింద చేరడం ఇదే మొదటి సారి అయ్యుంటుంది. వీళ్లందరిని మా బాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడబ్బా? అసలే వీళ్ళందరికి వల్ల మాలిన ఈగోలు,” తనలో తాను అనుకున్నాడు సెగట్రీ.

“అవార్డ్ ట్రోఫీలు తీసుకొస్తున్న ఇసుక లారీలు ఇంకా రాలేదేంటి,” ఆందోళనగా అన్నాడు రుబ్బు రోలు రెడ్డి, సెగట్రితో.

“ఇసుక లారీలలో అవార్డులు తెప్పిస్తున్నారా? అంతంత పెద్ద ట్రోఫీలా?” ఆశ్చర్యంగా అడిగాడు రిచంజీవి.

“అహహా, ట్రోఫీల సైజు మామూలే, జస్ట్ వాటి సంఖ్య ఎక్కువ, అంతే!” చెప్పాడు రెడ్డి.

“అదిగోండి, లారీలు వచ్చేశాయి,” ఆనందంగా అన్నాడు సెగట్రీ.

***

“నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికి నా ధన్యవాదాలు. అసలే ఫంక్షన్ నిడివి చాలా పెద్దది కాబట్టి, ఈ సారికి నా ఇష్ట దైవమైన పరమ శివుడి మంత్రాలు స్కిప్ చేస్తున్నా. డైరెక్ట్‌గా అవార్డుల్లోకి వెళ్ళిపోదాం,” అనౌన్స్ చేశాడు రుబ్బు రోలు రెడ్డి.

అక్కడ ఉన్న యావన్మంది చప్పట్లు కొట్టి తమ ఉత్సాహం ప్రకటించారు.

“వీళ్ళు చప్పట్లు కొట్టింది మా సార్ మంత్రాలు చదవను అన్నందుకా, లేకా వెంటనే అవార్డుల్లోకి వెళ్ళిపోదాం అన్నందుకా?” సందేహం కలిగింది సెగట్రీకి.

“ఇప్పుడు మొదటి అవార్డ్ బుజ్జి కృష్ణ గారు బహుకరిస్తారు,” ఆనందంగా అన్నాడు రెడ్డి.

బుజ్జి కృష్ణ ఉలిక్కి పడ్డాడు. “ఇదేంటి ఉత్తమ అవార్డ్ ఇస్తాను అన్న వాడు, తనతో అవార్డ్ ఇప్పిస్తున్నాడేంటి?” అనుకున్నాడు కోపంగా. ఐనా వేదిక మీదకి వెళ్ళక తప్పలేదు బుజ్జి కృష్ణకి.

తనకిచ్చిన కవర్‌ని చించి అందులో ఉన్న పేరు చదివాడు బుజ్జి కృష్ణ. “ఉత్తమ స్టార్, రిచంజీవి!”

అందరి కరతాళ ధ్వనుల మధ్య స్టేజ్ మీదకి వెళ్ళి బుజ్జి కృష్ణ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు రిచంజీవి. బుజ్జి కృష్ణ పళ్ళు పట పటా కొరుక్కున్నాడు.

ఆ తతంగం అయిపోగానే వెను తిరుగుతున్న ఇద్దరు నటులని ఆపి, “ఆగండి, అప్పుడే వెళ్తారేంటి? ఇప్పుడు నెక్స్ట్ అవార్డ్ రిచంజీవి గారు ఇస్తారు,” చెప్పాడు రెడ్డి.

రిచంజీవి తనకిచ్చిన కవర్‌ని చించి అందులో పేరు చదివాడు. “ఉత్తమ నటుడు, బుజ్జి కృష్ణ!” ఆడిటోరియం మారు మోగే చప్పట్ల మధ్య రిచు నుంచి ట్రోఫీ తీసుకున్నాడు బుజ్జి కృష్ణ.

ఆ తరువాత ఉత్తమ కథా నాయకుడి అవార్డుని సొల్లు అర్జున్ అభాస్‌కి ఇచ్చాడు. అభాస్ ఏమో ఉత్తమ నృత్య నాయకుడి అవార్డుని సొల్లు అర్జున్‌కి ఇచ్చాడు.

విషయం మెల్లగా అక్కడికి వచ్చిన ఆహ్వానితులకి అర్థం కావడం మొదలయ్యింది. ఇసుక లారీల్లో ట్రోఫీలు తెప్పించాల్సిన అగత్యం ఎందుకో బోధపడింది.

రకరకాల బిరుదులతో, ఫంక్షన్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవార్డ్ వచ్చేలా చూసుకున్నాడు రుబ్బు రోలు రెడ్డి.

సంగీత దర్శకులకి ఏమో ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ దరువు రాజు, ఉత్తమ డప్పు ప్రభువు లాంటి అవార్డులు దక్కాయి

దర్శకులకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నట నిర్దేశకుడు, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ అమోఘ దర్శకుడు లాంటి అవార్డులు వచ్చాయి.

క్యారక్టర్ నటులందరికి ఏమో ఉత్తమ విలక్షణ నటుడు, ఉత్తమ సలక్షణ నటుడు, ఉత్తమ అవలక్షణ నటుడు లాంటి అవార్డ్స్ ఇవ్వబడ్డాయి.

కమెడియన్స్‌కి ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ కమెడియన్, ఉత్తమ జోకర్, ఉత్తమ నవ్వుల రాజు లాంటి అవార్డ్స్ దొరికాయి.

ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినయ్యా వాయనం టైపులో ఒకరికొకరు అవార్డ్స్ ఇచ్చుకోవడంతో ఫంక్షన్ చాలా సరదాగా సాగిపోయింది.

అందరు తమ తమ అవార్డులని చంకల్లో పెట్టుకున్నాక, చివరాఖరికి ఒక ట్రోఫీ మిగిలింది.

“అయ్యో, ఇదేదో ఎక్స్‌ట్రా ట్రోఫీ మిగిలిపోయిందే, దీన్నేం చేద్దాం,” కాస్త బాధగా అన్నాడు రెడ్డి.

“ఉత్తమ అవార్డ్ బహుమతి కర్తగా మీరే ఆ ట్రోఫీ తీసుకోండి,” అంటూ రిచంజీవి, బుజ్జి కృష్ణ కలిసి జమిలిగా రుబ్బు రోలు రెడ్డి చేతుల్లో ఆ ట్రోఫీని పెట్టారు.

Posted in సినిమాలు | 6 Comments

బోలెడు చాలా gap!

నిజమే, చాలా రోజులయ్యింది కొత్త టపా రాసి. కారణాలు ఎన్నో ఉన్నప్పటికి బద్దకం వాటిలో ముఖ్యమైనది. క్షంతవ్యుడిని!

ఈ లోగా కొన్ని పెను పరిణామాలు జరిగిపోయాయి. అంటే పెద్ద నోట్ల రద్దు, ఉత్త ప్రదేశ్ ఎన్నికలు లాంటివి. పెద్ద నోట్ల రద్దు మీద ప్రజలు ఎలాంటి తీర్పు వెలువరించారో అందరికి తెలిసిందే. ఉత్త ప్రదేశ్ ఎన్నికల్లో జే.బీ.పీ. ఘన విజయం తరువాత మిగతా పార్టీల నాయకులందరి నోళ్ళు ముందు తెరుచుకుని, తరువాత ఊళ్ళో ఉన్న దోమలు ఈగలు అన్ని దూరడంతో, మళ్ళీ మూసుకుని, ఇప్పటికీ అలా మూతబడే ఉన్నాయి.

అదేదో ఆటో పైలట్‌లో విమానం నడుస్తున్నట్టు, హిండియాకి అంతా కలిసి వస్తూంది కానీ, ఒక అంధేరా ప్రదేశ్ పరిస్థితి మాత్రం కాస్త అయోమయంగా ఉంది. ఈ విషయంలో జే.బీ.పీ.ని తప్పని సరిగా నిందించాల్సిందే. వారనుకుంటే కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అంత కష్టమేమీ కాదు. హోదా వల్ల జరిగే మేలు పక్కన పెడితే, హోదా ఇవ్వక పోవడంవల్ల జరిగే అనర్థాలు ఎక్కువ అని తెలిసి కూడా జే.బీ.పీ. తన హామీలను ఎందుకు మరిచిపోయిందో ఒక మిస్టరీనే. ఒక వేళ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడానికి వెనక ఏదైనా చాణక్యం ఉన్నట్టైతే, అది కూడా గర్హించ తగ్గదే.

ఒక్కటి మాత్రం నిజం. తెగులు వారి అనైక్యత వారి కొంప ఎప్పుడూ ముంచుతూనే ఉంది. అదేదో సినిమాలో క్లైమాక్స్‌లోలా, అంధేరా ప్రదేశ్‌లో ఉన్న అన్ని పార్టీలు ఒకరికేసి ఒకరు తుపాకి గురి పెట్టుకుని, విషయం ఎటూ తేలకుండా జాగ్రత్త పడుతున్నాయి. 2019లో కాల్పులు ఎలాగూ తప్పవు.

ఇవన్నీ అటుంచితే, నేను బ్లాగు చేసుకోవడానికి బోలెడంత ముడి సరుకు తయారుగా ఉంది.

ఇక నాదే ఆలస్యం. 🙂

Posted in డియర్ రీడర్స్! | 4 Comments

మదర్ తెరీమా – 5

కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శంకర్రావు గారు, ఎందుకనో పేపర్ పక్కకు జరిపి చూసేసరికి, ఆయన కాళ్ళకి మొక్కబోతున్న కేశవరావు గారు కనిపించారు.

“అయ్యయ్యో, ఇదేం దారుణం కేశవరావు గారు,” అంటూ ఆయన్ని వారించి, “అసలు ఏం కష్టమొచ్చింది మీకు?” ప్రశ్నించారు శంకర్రావు గారు.

“నా కష్టాలన్ని మీ వల్లే మహాప్రభో, మదర్ తెరీమా గురించిన వ్యాఖ్యానం వచ్చే దఫాకి ముగించేస్తాను అని చెప్పి, నలభై రోజులైనా ఇంకా చెప్పలేదు. ఇలా సాగదీస్తూ చెప్పడం మీకు న్యాయమా?” బాధగా అడిగారు కేశవరావు గారు.

“ఓహో, అదా మీ బాధ, ఐనా ఈ మధ్య ఎన్నెన్నో సంచలనభరితమైన సంఘటనలు జరుగుతున్నాయి కదండి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు లాంటివి. వాటి గురించి చదువుకుంటూ, కాస్త సైడ్-ట్రాక్ అయ్యాను అంతే.”

“ఇంతకి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కరెక్టే అంటారా?”

“ముందు ఇది చెప్పండి, ఈ నిర్ణయం గురించి క్రేజీ వాలా, పశ్చిమ వంగాల్ ముఖ్య మంత్రి మడతా బెనర్జీ, ఉత్త ప్రదేశ్ ముఖ్య మంత్రి బాణామతి, సాహుల్ గాంధి ఎలా స్పందించారు?”

“మోడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.”

“ఇంకేం! ఐతే అది మంచి నిర్ణయమే అన్న మాట. వాళ్ళకి నచ్చితే మనం ఖంగారు పడాలి.”

“ఇదంతా బానే ఉంది కానీ, మదర్ తెరీమా జీవితం యొక్క అంతిమ ఘట్టం చెప్పండి.”

“మదర్ తెరీమా జీవితం యొక్క అంతిమ ఘట్టం ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆవిడ మీద నా వ్యాఖ్యానం యొక్క అంతిమ ఘట్టం.”

“అదే, అదే!”

“మదర్ తడి గుడ్డతో గొంతులు ఎలా కోసిందో చెప్పుకున్నాం కద. దీని తరువాత అందరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు, ఆవిడ ఎలాంటి వాళ్ళతో మైత్రి నెరపింది, తను తన “బీదరికపు” రూల్స్ ఎంత వరకు పాటించ్మిది అని.”

“ఆమె స్నేహితులతో వచ్చిన సమస్య ఏంటి?”

“ఆవిడకి భూరి విరాళాలు ఇచ్చిన వారిలో నియంతలు, ఆర్థిక నేరస్తులు బోలెడు మంది ఉన్నారు. వారంతా తమ ఇమేజ్‌ని కాస్త మెరుగు పరుచుకోవడం కోసం ఈమెకి డబ్బు ఇచ్చేవారు. ఈవిడ అలాంటి వారి దగ్గర నుంచి ఏ మాత్రం మొహమాటం లేకుండా పుచ్చుకుని, వాళ్ళు చేసే వెధవ పనులకి వాళ్ళని క్షమించమని కోరుకునేది.”

(And she was a friend to the worst of the rich, taking misappropriated money from the atrocious Duvalier family in Haiti (whose rule she praised in return) and from Charles Keating of the Lincoln Savings and Loan. Where did that money, and all the other donations, go? The primitive hospice in Calcutta was as run down when she died as it always had been — she preferred California clinics when she got sick herself — and her order always refused to publish any audit. – Christopher Hitchens)

“మీరు చెపుతున్న కొద్ది, నాకు మదర్ తెరీమా గురించి కాదు, ఎవరో గాడ్ మదర్ గురించి వింటున్నట్టు ఉంది.”

“కొన్ని విషయాల్లో పెద్ద తేడా లేదు. మాఫియా వాళ్ళు తమ చీకటి సామ్రాజ్యాన్ని అభివృద్ధి పరచాలని ప్రయత్నిస్తే, ఈవిడ పేదలూ వారి పట్ల మనందరికి ఉండే సహజమైన కరుణని అడ్డు పెట్టుకుని, తన మత సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి సంకల్పించింది.

“ఆవిడ తన రూల్స్ ఎంత పాటించిందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు?” సందేహం వ్యక్తం చేశారు కేశవరావు గారు.

“ఆవిడ బీదా బిక్కితో బాధపడ్డంలో ఒక అద్భుతమైన సౌందర్యం ఉంది అని చెప్పేదా? తనకి మాత్రం ఏ మాత్రం ఒంట్లో బాగా లేక పోయినా, ఆధునాతమైన వైద్య శాలలోనే చికిత్స పొందేది.”

( August 22, 1993: Mother Teresa of Calcutta, hospitalized since Aug. 20, was shifted to the intensive coronary care unit of a New Delhi hospital Aug. 22 after her heart condition worsened.

“There is something beautiful in seeing the poor accept their lot, to suffer it like Christ’s Passion,” Mother Teresa said. “The world gains much from their suffering.”

When it came to her own suffering, however, Mother Teresa took a different stance. The ailing altruist received care for her failing heart in a modern American hospital.)

“అంతే లెండి. ఆమె చెప్పే రూల్స్ బీదలకు కానీ ఆమెకి కావు కద. ఇంతకీ ఈ విషయాలన్ని అసలు బయటకు ఎలా వచ్చాయి. మన ఘనత వహించిన వింగ్లీష్ మీడియా ఇలాంటి వార్తలని అస్సలు ప్రచురించదు కద!”

“మీరన్నది నిజమే. డాక్టర్ ఆరూప్ చటర్జీ అనే మహానుభావుడు ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి, క్రిస్టొఫర్ హిచెన్స్ లాంటి మేధావులని పురమాయించి మరీ ఈ నిజాలు బయట పెట్టించాడు. లేకపోతే నేను కూడా తెరీమాని నెత్తిన పెట్టుకునుండే వాడిని. అదేంటి, కేశవరావు గారు, అలా హడావుడిగా బయలుదేరారు?”

“మా ఇంట్లో ఉన్న మదర్ తెరీమా పోస్టర్ అర్జెంట్‌గా చింపి చెత్త బుట్టలో పడేయాలి,” అక్కడి నుండి నిష్క్రమించారు కేశవరావు గారు.

(అయిపోయింది)

Posted in అతుకుల బొంత | 1 Comment

మదర్ తెరీమా – 4


“శంకర్రావు గారు, ఇదేం బాగోలేదండి!” అన్నారు కేశవరావు గారు ఆయన పక్కనే కూర్చుంటూ.

“ఏమయ్యిందండి?” చదువుకుంటున్న పేపర్ నుంచి తలెత్తి చూశారు శంకర్రావు గారు.

“మదర్ తెరీమా చేసే ‘సేవ’ అలాంటిది ఎందుకో కారణాలు వివరిస్తానన్నారు. ఆ విషయం చెప్పి నెలయ్యింది. కానీ ఇంకా మీరు ఆ ఊసే ఎత్తలేదు,” నిష్టూరం ధ్వనించింది కేశవరావు గారి గొంతులో.

“అవును నాన్నా! ఆవిడ ఎప్పుడో సెయింట్ అయ్యి కూర్చుంది. ఇంకా ఈ డిస్కషన్ అవసరమంటావా?” అప్పుడే సీన్‌లో ఎంటర్ అయిన కుమార్ అన్నాడు.

“ఒరేయి, మనం స్వతంత్రులమై దాదాపు డెబ్భై ఏళ్ళు కావొస్తూంది. అలా అని అ విషయాన్ని గుర్తు చేసుకోవడం కానీ, ప్రతి ఏడాది ఒక పండగలా జరుపుకోవడం కానీ మానేశామా? ఇదీ అంతే!”

“కానీ ఇలాంటి విషయాలు మాలాంటి యంగ్‌స్టర్స్‌కి బోర్ నాన్నా!”

“అందుకే కదరా, నేనూ అంకుల్‌కి మాత్రమే చెప్తూంది. నీతో అయితే, ఏ హీరోయిన్ ఎవరితో తిరుగుతూందో, ఏ కులం వారి అధిపత్యం ఎలా పెరిగిపోతూందో లాంటి విషయాలే మాట్లాడే వాడిని. అన్నట్టు, బుజ్జి మామయ్య, వాడి ఫ్రెండ్స్ మనింటికి వచ్చారు కద! ఇంతకు ముందే మన జాతీయ క్రీడ, అదే, పేకాట మొదలు పెట్టారు. నువ్వూ వెళ్ళి ఆడు, పో!”

“ఆ విషయం ఇంత ఆలస్యంగానా చెప్పేది,” బాధపడుతూ వెంటనే అక్కడి నుంచ్ జంప్ అయి పోయాడు కుమార్.

“సరే, ఇక తెరీమా టాపిక్‌కి వద్దాం. దైవ పుత్రుడు పడిన కష్టము + ఆయనకి పేదలంటే ఉన్న అమితమైన ప్రేమ, ఇవి రెండూ, మదర్ తెరీమా సేవని నిర్దేశించాయి అని చెప్పాను కద! వారి మతం మొత్తం దైవ పుత్రుడు చేసిన త్యాగం మీదే ఆధార పడి ఉంది. ఆయన మనందరికోసం అనుభవించిన బాధ వర్ణనాతీతమైనది. కాబట్టి తాతలిక్కులు బాధకి ఎనలేని గౌరవం ఇస్తారు. బాధ అనేది ఎంతో అందమైనది అని వారి భావన. ఆ రకంగా విపరీతమైన బాధ పడుతున్న ఎవరైనా దైవ పుత్రుడికి ప్రీతి పాత్రమైన వారు అవుతారు అని వారి నమ్మకం. మదర్ తెరీమా కూడా సరిగ్గా అదే సిద్ధాంతం మీద బేస్ అయిన మనిషి,” మొదలు పెట్టారు శంకర్రావు గారు.

“ఐతే ఆవిడ చేసిన సేవ కూడా,” గొణిగారు కేశవరావు గారు.

“దానికి అనుకూలమైనదే! ఆవిడ కుష్టు రోగులకు కానీ ఇతరులకు కానీ కలిపించిన సదుపాయం, వాళ్ళు రోడ్ మీద దిక్కులేని చావు చావకుండా తమ గురించి పట్టించుకునే వారి మధ్య మరణించగలిగేలా చేయడమే.”

“అది తప్పేం కాదు కద?”

“కాదు. కానీ ఆమె అంతకంటే ముందుకి వెళ్ళడానికి చూడలేదు. వారిని బాధనుంచి రక్షించాలని ఆమె ఎప్పుడు ప్రయత్నించలేదు. ఇక్కడ తప్పు ఆమె కంటే, ఆమె modus operandi గురించి అర్థం చేసుకోకుండా ఆమెని ఒక దేవతా మూర్తిగా వర్ణించిన మన మీడియాది, రాజకీయ నాయకులది. ఆ ప్రచారం నమ్మి, ఆమెని ఒక దేవతలా భావించిన వారందరిది.”

( “There is something beautiful in seeing the poor accept their lot, to suffer it like Christ’s Passion. The world gains much from their suffering.” – Mother Theresa )

“కాని ఆమె ఈ సేవకి తన జీవితం అంకితం చేసింది!”

“ఎంతో మంది మాఫియా డాన్‌లు కూడా జీవితాంతం కఠోరంగా శ్రమించి తమ చీకటి సామ్రాజ్యాలను నిర్మిస్తారు. అంత మాత్రాన వారిని saints చేసేయ్యలేం కద!”

“మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు, శంకర్రావు గారు. మదర్ తెరీమా, మాఫియా డాన్‌లు ఒకటేనంటారా?”

“సారీ, మీకు నా పోలిక బాధ తెప్పించినట్టు ఉంది. కానీ ఒక సారి ఆలోచించండి. తను ఏదో బాధితులని రక్షించడానికి ప్రయత్నిస్తుందని నమ్మి, డబ్బులు విరాళంగా ఇచ్చిన వారినెవరిని ఆమె కాదన లేదు. తన ఉద్దేశం అది కాదని ఖండించలేదు. ఆ డబ్బులు తీసుకుని కామ్‌గా లూటికన్ కి transfer చేసింది. పైగా ఈ సేవ పేరుతో అవసాన దశలో ఉన్న వారిని ఆఖరి క్షణంలో మతం మార్చుకునేలా ప్రోత్సహించి (చాలా మంది సరిగ్గా అర్థం కాకుండా మార్చుకున్నారు కూడా!), వారి ఆత్మలు దైవ పుత్రుడి ఖాతలో వేసుకుంది కూడా.”

(Mother Teresa gloats about conversion of dying people)

“మీరు చెప్పేది నిజమా?”

“చనిపోయే వారందరికి, మదర్ సేవా సంస్థల్లో పని చేసేవారు, మీరు స్వర్గానికి వెళ్తారా అని అడిగే వారు. (ఇండైరెక్టుగా దైవ పుత్రుడిని మీ రక్షకుడిగా నమ్మండి, అప్పుడు స్వర్గానికి వెళ్తారు అని చెప్పడం వారి ఉద్దేశం.) చాలా మంది ఒప్పుకునే వారు. అప్పుడు ఒక తడి గుడ్డతో వారిని baptize చేసి వారి మతం మార్చేవారు.”

(Susan Shields, a former member of the Missionaries of Charity, writes that “Sisters were to ask each person in danger of death if he wanted a ‘ticket to heaven’. An affirmative reply was to mean consent to baptism. The sister was then to pretend that she was just cooling the patient’s head with a wet cloth, while in fact she was baptizing him, saying quietly the necessary words. Secrecy was important so that it would not come to be known that Mother Teresa’s sisters were baptizing Hindus and Muslims.”)

“తడి గుడ్డతో గొంతులు కోయడం అంటే ఇదేనన్న మాట,” తనకు తెలీకుండానే అనేశారు కేశవరావు గారు.

(ఇంకా ఉంది)

Posted in అతుకుల బొంత | 1 Comment

మదర్ తెరీమా – 3


సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు కుమార్. “నాన్నోయి, మీరిలా తెరీమా గురించి వ్యర్థమైన చర్చ చేసి ఏం లాభం లేదు. ఆమెని ఆల్‌రెడీ పునీతని చేసేశారు తెలుసా?” అంటూ.

“పునీతని చేయడం ఏంట్రా?” కాస్త అయోమయంగా అడిగారు శంకర్రావు గారు.

“అదే నాన్నా, ఆవిడకి sainthood ఇచ్చేశారు. అవును అదేంటి, అంకుల్ నోరు, అలా తెరిచి ఉంది? అంకుల్, మన ఏరియాలో అసలే ఈగలు, దోమలు ఎక్కువ. అలా నోరు తెరిచి ఉంచకండి,” ఆందోళనగా అన్నాడు కుమార్.

“ఇప్పుడే మదర్ తెరీమా గురించి కొన్ని విషయాలను తెలుసుకుని షాక్ అయి ఉన్నారులే. కాసేపట్లో ఆయనే మూస్తారు. ఐనా తెరీమాకి sainthood ఇచ్చింది ఆవిడ మతానికి చెందిన తాతలిక్స్ తెగ వాళ్ళు. వాళ్ళు ఆమెకి కాకపోతే ఇంకెవరికి ఇస్తార్రా? అన్నట్టు Y చానెల్‌లో కత్తి లాంటి కైఫ్ ఇంటర్‌వ్యూ వస్తూందట. త్వరగా వెళ్ళు,” పురమాయించారు, శంకర్రావు గారు.

“అమ్మో, ఒక్క నిముషం మిస్ అయినా తట్టుకోలేను,” అంటూ అక్కడి నుంచి ఉడాయించాడు కుమార్.

అప్పుడు నోరు మూశారు కేశవరావు గారు. మూసిన వెంటనే మళ్ళీ తెరిచారు. “ఈ తాతలిక్ తెగ ఏంటండి? వాళ్ళు తెరీమాకి sainthood ఎందుకు తప్పకుండా ఇస్తారు?”

“వారి మతంలోని మొదటి తెగ పేరు అది. తాతల నాటి కాలం నుండి ఉన్నారు కాబట్టి, వారిని తాతలిక్స్ అంటారు. వారు sainthood ఇచ్చేది వారి తెగకి చెందిన వారికే. అందులో ముఖ్యంగా తెరీమా లాంటి వారికే. అందుకే ఆశ్చర్యం లేదన్నాను.”

“ఎందుకు అలా?”

“తాతలిక్స్ దేవుడికి చేసే సేవ అత్యున్నతమైనది అని భావిస్తారు. అలాంటి సేవలు చేసిన వారికి, పైగా ఒకటో రెండో మహిమలు కూడా చూపిన వారికి, sainthood ప్రసాదిస్తారు.”

“దేవుడి సేవ చేయడం మంచిదే కద?”

“అది సేవ నిర్వచనాన్ని బట్టి ఉంటుంది.”

“అలా వేరే వేరే నిర్వచనాలు కూడా ఉంటాయా?”

“ఎందుకు ఉండవు? వారి మతం ప్రకారం దైవ పుత్రుడు మానవులందరి కోసం తన రక్తాన్ని చిందించాడు. తద్వారా మానవ జాతి పాపాలను ప్రక్షాలణం చేశాడు.”

“ఓహో!”

“ఐతే ఇందులో చిన్న మెలికుందండోయి కేశవరావు గారు! ఆయన దైవ పుత్రుడు అని నమ్మిన వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు. వారి పాపాలు మాత్రమే ప్రక్షాళనం చేస్తాడు.”

“మరి ఆ మాత్రం విధేయత లేకపోతే ఎందుకు రక్షిస్తాడు లెండి. మన రాజకీయ పార్టీల్లోనే చూస్తున్నాం కద. విధేయత ఉంటేనే పదవులు దొరికేవి.”

“కరెక్ట్! కాబట్టి మీరు ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత ఆదర్శప్రాయంగా బతికినా లాభం లేదు. ఆయన దేవుడి బిడ్డ అని అంగీకరించకుంటే మీరు నరకానికే పొతారు. మీరు ఎన్ని వెధవ పనులు చేసినా, చనిపోయే ముందు ఆఖరి క్షణాన ఆయన్ని నమ్మితే మాత్రం స్వర్గానికి పోతారు.”

“అబ్బ, ఎంత లాజికల్‌గా ఉంది కదండి!”

“మరే, లాజిక్‌కి ఆ మతం పెట్టింది పేరు. మన సింధువుల్లా మత ఛాందసులు అనుకునేరు!”

“అబ్బెబ్బే, నేనెందుకు అలా అనుకుంటాను? అన్ని మతాల కంటే వెనక పడింది, ఏ మాత్రం ఓర్పు సహనం లేనిది మన సింధూ మతమే కద!”

“అదీ మాటంటే! కాబట్టి దైవ పుత్రుడు పడిన కష్టము + ఆయనకి పేదలంటే ఉన్న అమితమైన ప్రేమ, ఇవి రెండూ, మదర్ తెరీమా సేవని నిర్దేశించాయి.”

“అదెలా?”

“చెప్తాను”

(ఇంకా ఉంది)

Posted in అతుకుల బొంత | 4 Comments