పని పాట అన్న జంట పదాలు ఎందుకు ఏర్పడ్డాయో నాకు పెళ్ళయ్యాక అర్థమయ్యింది. పెళ్ళయ్యాక ఒక మగాడి మీద బోలెడు బాధ్యతలు వచ్చి పడతాయి. వాటిలో ఇంటి పనులు ఒకటి. ఆ ఇంటి పనులు ఉత్తినే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే పాటలు వింటూంటే కాస్త వీజీగా చేసుకోగలం. అందుకన్న మాట పని పాట అనేది.
ఆ పద్ధతే పాటిస్తూ నా దగ్గరున్న యూ-ఫోన్‌లో తెలుగు పాటల ప్లే-లిస్ట్ ఒకటి ఆన్ చేసి వ్యాక్యూమింగ్ మొదలు పెట్టాను. అసలు మొదటి పాటే మంచి ఊపున్న పాట. అది ఇలా సాగింది.
“నీకూ నాకూ పెళ్ళంట, నింగికి నేలకి కుళ్ళంట.
ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసిందెపుడూ లేదంటా.
అలాగా?”
ఇక్కడ నేను టక్కున పాటని పాజ్ చేశాను. ఎందుకంటే నాలో గాయకుడు కమ్ కవి నిద్ర లేచాడు. ఈ పాటేదో నేనే పాడితే పోలా?
అదే పాటను నేను కాస్త మార్చి ఇలా పాడాను.
“నీకూ నాకు పెళ్ళంట నింగికి నేలకి కుళ్ళంట.
ఎందుకంటా?
పెళ్ళి కాలేదు కాబట్టి, వాటికి ఈ కష్టాలేవీ తెలీవంటా.
ఒక వేళ అయ్యుంటే కుళ్ళుకునే ఛాన్సే లేదంటా.
అహ జింగు చక, ఓహో జింగు చక”
పాటతో పాటూ వ్యాకూం క్లీనర్‌ని అటూ ఇటూ తిప్పుతూ చిన్న పాటి డ్యాన్సు కూడా చేశాను.
నా కవితా పటిమపై నాకే ముచ్చటేసింది.
మళ్ళీ ఇంతకు ముందు పాడిన లైన్సే పాడుతూ ఇంకో సారి చిందేశాను.
అలానే గిర్రున తిరుగుతూ సడన్‌గా ఆగిపోయాను.
ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ మా ఆవిడ గుమ్మానికి ఆనుకుని నన్నే తదేకంగా చూస్తూంది.
“ఓహొ నువ్వు ఇక్కడే ఉన్నావా, తుమ్ ఇధర్ హి హై?” బలవంతంగా పెదవుల మీద నవ్వు పులుముకుంటూ అడిగాను.
తనేం మాట్లాడలేదు.
“పాట ఎలా ఉందోయి. సరదాగా కాస్త ట్విస్ట్ ఇచ్చాను,” నసిగాను.
“నోరు మూయండి” కోరగా చూస్తూ అంది తను.
నేను అర్జెంటుగా నా నోరు మూసేశాను.
“మీకిచ్చి పెళ్ళి చేసి మా వాళ్ళు నా గొంతు కోశారు.”
పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారబోతుందని నాకు అండర్‌స్టాండింగ్ అయిపోనాది. సాధారణంగా ఈ డయలాగ్ మా ఆవిడ నోటి వెంట వచ్చిందంటే కూష్మాండం బద్దలైనట్టే.
నేను రియాక్ట్ అయ్యేంతలో తనే, “అయినా ఎందుకింత వెటకారం? నేను ఏమన్నాను అని? మన ఇంటి పనులు మనమే చేసుకుంటే తప్పేంటి అన్నాను. అంతేగా? ఏదో కహోనా వల్ల ఇంటి పట్టునే ఉంటున్నారు కద, ఆఫీస్‌కి వెళ్ళకపోవడం వల్ల బోలెడు టైమ్ కలిసి వస్తూంది కద అని కాస్త ఇంటి పనుల్లో ఒక చేయి వేయమన్నాను. దానికే ఇలా పాటలు ప్యారడీ చేసి పాడాలా?” గద్గదమైన స్వరంతో అంది.
“అస్సలు పాడాల్సిన అవసరం లేదు. నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక పై ఇలాంటి క్లాసిక్స్‌ని ప్యారడీ చేయనుగాక చేయను,” అనర్గళంగా మాటిచ్చేశాను నేను.
“ఇంతకీ నేను చెప్పిన పనులు ఏం చేశారు?” గుర్రుగా అడిగింది తను.
నేను గొంతు సవరించుకున్నాను. “బట్టలన్నీ ఉతికేశానోయి. గిన్నెలు డిష్‌వాషర్‌లో లోడ్ చేశాను. వంట ఆల్‌రెడీ అయిపోయింది. ఇదిగో ఒక వ్యాక్యూమ్ క్లీనింగ్ మాత్రమే మిగిలింది. ఆ! అన్నట్టు, బాత్‌రూమ్‌లో కలరా ఉండలు కూడా వేశాను.”
“ఏడ్చినట్టుంది. పిచ్చి మాటలూ మీరూనూ! అరెమికాలో కలరా ఉండలు ఏంటి? చెప్పిన పనులు చేయండి, చాలు. అదే పదివేలు,” అంటూ అక్కడి నుండి నిష్క్రమించింది తను.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూండగానే సడన్‌గా గుర్తొచ్చింది నాకు. ఈ రోజు మా బాస్‌కి వీక్లీ స్టాటస్ రిపోర్ట్ పంపించాలి. వ్యాక్యూమ్ కీనర్ పక్కన పడేసి, గత వారంలో నేనేం సాధించింది (ఇంట్లోనుంచేలే), టక టకా టైప్ చేసి ఈ-మెయిల్ పంపించేశా. హమ్మయ్యా, ఇంకో వారం ఫర్లేదు.
నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మా బాస్ నుంచి వెంటనే రిప్లయి వచ్చింది ఆయనకు కాల్ చేయమని. ఇదేంటి ఇంత ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యాడు అనుకుంటూ, ఆయనకు కాల్ చేశాను.
అరెమికాలో ఆకాశం విరిగి నెత్తిన పడే సందర్భంలో కూడా కుశల ప్రశ్నలు వేయకుండా ఏ సంభాషణ మొదలు పెట్టరు. ఆ ఆచారాన్ని మన్నిస్తూనే ఆయన, నేను ఎలా ఉన్నాను, వెదర్ ఎలా ఉంది ఇలాంటివన్ని అడిగాక మెయిన్ టాపిక్‌లోకి వచ్చాడు.
“నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా?” అడిగాడు.
“నా ఆరోగ్యానికేంటి సర్! సూపర్ మ్యాన్‌కి ఒక బెత్తెడే తక్కువ. ఏం, అలా అడిగారు?”
“నీ స్టాటస్ రిపోర్ట్ చూసి!!! అదేం రిపోర్టయ్యా? దాని నిండా, నువ్వు ఎన్ని సార్లు డిష్‌వాషర్ వేశావు. ఎన్ని సార్లు ఇల్లు వ్యాక్యూమ్ చేశావు, ఎన్ని సార్లు బట్టలు ఉతికావు, ఇంకెన్ని సార్లు వంట చేశావు లాంటి వివరాలు తప్ప ఇంకేవీ లేవేంటయ్యా? అసలు నువ్వు ఇంకా మన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నావా?”
“అదీ, సర్…”
“లాభం లేదయ్య, నీకు pep talk ఇవ్వాల్సిందే,” గొంతు సవరించుకున్నాడు ఆయన.
“సార్!” ఘొల్లుమన్నాను నేను.
లాభం లేకపోయింది. మా బాస్ pep talk మొదలు పెట్టేశాడు.
అది అయ్యాక నా మానసిక స్థితి ఇంకా సరిగ్గానే ఉంటే, మళ్ళీ కలుద్దాము. సెలవు.
అందరిదీ ఇదే పరిస్థితి భయ్యా … నువ్వు చెప్పుకోగలిగావ్ మేము లోలోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాం…మిగతాదంతా shame to shame …. stomach tear చేసుకుంటే legs మీద పడుతుందని మన పెద్ధోళ్లు free గా అనలేదుగా …..
LOL.
100% what Pankha said.
ఇంకో భా.బా.స మెంబర్. 🙂 మీ సపోర్ట్‌కి కృతజ్ఞతలు, brothers!
Bhaa Bhaa Sa ante bhaarya bhaadaulu padewaalla Sanghamaaa??
bhaaryaa baadhitula sangham (భార్యా బాధితుల సంఘం)
Bhalaa bhalaa!!
Ante ee majhya meeru paatalu, blogsu kaa kunda vere panullo kooda expert ayeru annamaata. Choosera, Covid valla entha laabham ayindi meeku?? Enni kaLalu nerchukogaligeru. =)) =))
Plus the spiritual growth that comes from learning an art. 😀 😀 😀
I could not reply your “bhaaryaa baadhitula sangham (భార్యా బాధితుల సంఘం)” comment Muraligaaru. So am posting my comment here. My better half had guessed it correctly. I guess that is why the upaadhi — “Better half”. 😀 😀
In any case, good to see the old style fun post after looooooong.
As informative as political and historical posts are, they’re boring after a point. 😀