Category Archives: ముఖపుస్తకం

ముఖపుస్తకం పై విమర్శలు

ముఖపుస్తకం మీద టైపు చేసుకుని ( సాధారణంగా నోరు చేసుకుని అంటారు, కానీ ఈ 21వ శతాబ్దం రెండవ దశకంలో, ఇలా బ్లాగులు రాసి టైపు చేసుకొవడానికి మాత్రమే వీలు కుదురుతుంది), తప్పు చేశానేమో అని నాకు ఈ మధ్యే సందేశం, అదే సందేహం, వచ్చింది. దీనికి కారణం, నేను ముఖపుస్తకంలో ప్రస్తుతించిన వివిధ రకాల … Continue reading

Posted in అప్పారావు - నేను, ముఖపుస్తకం | 6 Comments

ముఖ పుస్తకం – 10 (ఆఖరి భాగం)

లడక్! పీకాన్ కొంప మొనాస్టరీ. లడక్ లోనే అతి పెద్ద బౌద్ధ విహారం. కున్లున్ కొండల మీద నిర్మించ బడింది. ఇక్కడికి రావాలంటే మే నెల నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే సాధ్యం. ఆ తరువాత కురిసే మంచు అన్ని రహదారులను కప్పేస్తుంది. శిక్షణ పొందిన సైనికులకే అక్టోబర్ నుంచి మే వరకు లడక్ దాటడం … Continue reading

Posted in అప్పారావు - నేను, ముఖపుస్తకం | 9 Comments

ముఖ పుస్తకం – 9

నా పైత్యం శ్రుతి మించింది. అది కొంత మటుకు నాకే తెలుస్తూంది. మనుషులతో ముఖా ముఖీ ఏదీ సరిగ్గా మాట్లాడలేక పోతున్నా. ఎవరికి ఏది చెప్పాలి అన్నా, వీలైతే, వాళ్ళ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మెసేజ్ పెడుతున్నా. కానీ నేను నన్ను నేను మార్చుకునే స్థితిలో లేను. ముఖ పుస్తకం నా జీవితమంతా వ్యాపించింది. ఇంకో రకంగా … Continue reading

Posted in అప్పారావు - నేను, ముఖపుస్తకం | 11 Comments

ముఖపుస్తకం – 8

నా ముఖ పుస్తకం లైఫ్, మూడు క్విజ్జులు, ఆరు అప్‌డేట్ల్‌గా నడుస్తూంది. మా కజిన్ గాడు ఇప్పుడే స్పందించాడు: “పవన్ కల్యాణ్ అన్నయ్య సినిమా, గబ్బర్ సింగ్ వచ్చేస్తూంది. కెవ్వు కేక. ఇంక సూపర్ హిట్ కావడమే తరువాయి. స్యాంపుల్‌కి ఈ పవర్‌ఫుల్ డయలాగ్ చూడండి – నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది – … Continue reading

Posted in అప్పారావు - నేను, ముఖపుస్తకం, సీరియల్స్ | 4 Comments

ముఖపుస్తకం – 7

సామాజిక స్పృహ పెరిగిపోయింది కాబట్టి తరువాయి కార్యక్రం మొదలు పెట్టాను. అదే నా గురించి నేను తెలుసుకోవడం. ఈ మధ్యే ముఖపుస్తకంలోనే ఎవరి అప్‌డేట్‌లోనో చదివాను. సోక్రటీస్ అనే ఆయన ఉటంకించాడట, “An unexamined life is not worth living” అని. అంటే మన జీవితాన్ని నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండడం ఉత్తములు చేసే పని … Continue reading

Posted in అప్పారావు - నేను, ముఖపుస్తకం | 2 Comments