బట్ట తల వచ్చేసిందే బాలా – 28

“రెండు జెళ్ళ సీత!” అన్నాను నేను అప్రయత్నంగా. “రెండు జెళ్ళ సీతా?” ఆశ్చర్యంగా చూసింది ప్రవల్లిక. “అదేంటి?”

“ఏం లేదు, మన పక్క వీధిలో ఉండే రెండు జెళ్ళ సీత ఇప్పుడే వెళ్ళింది,” సర్ది చెప్పాను.

“ఈ కాలంలో కూడా అమ్మాయిలు రెండు జెడలు వేసుకుంటున్నారా?”

“కొందరు ఉన్నారులే పాత చింతకాయ పచ్చళ్ళు.”

“ఓహో.”

నేను ప్రవల్లిక ఇంటి దారి పట్టాం.

***

“జపాన్ నుంచి టీవీలూ, గడియారాలు, గేంస్ లాంటివి వస్తాయి అని తెలుసు కాని, ఇలా చిన్నప్పటి బావలు కూడా రావడమేంట్రా?” విసుగ్గా అన్నాడు శేఖర్.

“నాకేం తెలుసురా! అసలే ఆ మాట విన్నాక నా మెదడు పని చేయడం మానేసింది,” అన్నాను నేను.

“వచ్చే వారమే వస్తున్నాడట,” దిగులుగా అన్నాడు పాపారావు. “ఐనా నాకు ఈ మొత్తం విషయంలో ఒక నచ్చిన పాయింట్ ఉంది.”

“ఏంటో అది,” అన్నాడు నారాయణ్.

“మన నలుగురిలో వీడికే ఈ విషయాలు చెప్పుకుంది అంటే, మనలో వీడొక్కడే పెద్దమనిషి తరహాగా కనిపించాడన్న మాట.”

“అందులో నచ్చే పాయింట్ ఏముంది?”

“అంటే మనందరిలో వీడే ఓల్డ్ అని అర్థం,” నవ్వాడు పాపారావు. నాకు ఒళ్ళు మండింది.

“ఓల్డ్ మ్యాన్ కాదురా, జెంటిల్ మ్యాన్‌లా కనిపించి ఉంటాను. నీలాంటి ఏబ్రాసి గాడికి అర్థం కాదులే,” కోపంగా అని, “ఎవరు ఎలా కనిపించినా, వచ్చే వారం ఏ గుడిలోనో వాళ్ళపై అక్షింతలు వేస్తూ మనమందరం కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి,” హెచ్చరించాను.

“ఇప్పుడు తక్షణ కర్తవ్యం?” అడిగాడు శేఖర్.

“ఇలాంటి సందర్భాల్లో భగ్న ప్రేమికులు మందు కొడతారు. ఏ బార్‌కైనా వెళ్దాం పదండి,” అన్నాడు నారాయణ్.

“మనం మందు కొట్టముగా?” అనుమానం వెలిబుచ్చాను నేను.

“ఐనా సరే, అక్కడికే వెళ్దాం. కావాలంటే ఏ కూల్ డ్రింక్ ఐనా తాగుదాం,” సజెస్ట్ చేశాడు నారాయణ్.

సరే అని మేమంతా వారుణీ వాహిని బార్‌కి బయలు దేరాం.

***

“అసలు ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోగలగడం ఎంత అదృష్టమో!” ఈర్ష్యగా అన్నాడు పాపారావు. మేము నలుగురం ఒక టేబుల్ ముందు కూర్చుని ఉన్నాం.

“మనలాంటి వాళ్ళకు అంత లక్ ఎక్కడిది,” నిట్టూర్చాడు శేఖర్.

“ఎప్పుడూ ప్రేమ కథలు వినడమే కానీ, మన లైఫ్‌లో జరగవెందుకురా?” దిగులుగా అన్నాడు నారాయణ్.

“ఏంటీ? భగ్న ప్రేమికులా?” పక్క నుంచి ఒక గొంతు వినిపించింది. మేమంతా తిరిగి చూశాం. పక్క టేబుల్ దగ్గర ఒక బట్టతల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని బట్టతల చిత్రంగా ఉంది. జూలియస్ సీజర్ నెత్తిన పెట్టుకునే ఆకుల కిరీటంలా బార్డర్‌లో అంతా జుత్తు ఉంది. మధ్యలో నిగనిగలాడుతూంది.

“మీరెవరు సార్?” అప్రయత్నంగా అన్నాను.

“నా పేరు రమణరావులే. మొన్నే పదమూడు మాస్టర్స్ చేసి ఇండియాకి తిరిగి వచ్చాను,” అన్నాడతను. (రమణరావు ఎవరో తెలుసుకోవాలంటే Senior చదవండి.)

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

9 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 28

 1. బాపు says:

  “””””“మీరెవరు సార్?” అప్రయత్నంగా అన్నాను.

  “నా పేరు రమణరావులే. మొన్నే పదమూడు మాస్టర్స్ చేసి ఇండియాకి తిరిగి వచ్చాను,” అన్నాడతను.””””

  హ్హ… హ్హ… హ్హ… నాకర్థమైంది. రమణారావే జపాన్ బావ…!

 2. అయితే ‘రెండు జెళ్ళ సీత’ అని confirm చేసేసారన్న మాట 😦
  కానీయండి.. చూద్దాం.. ఈ బట్టతల భాగోతం ఎందాకా సాగిస్తారో 🙂

 3. Arun says:

  జూలియస్ సీజర్ ఆకుల కిరీటం. చాలాబాగుందండీ అసలు ఇలాపోల్చవచ్చన్న ఆలోచన మీకెలా కలిగింది.
  కొంపదీసి జపాన్ బావ అప్పుడే India లో అడుగుపెట్టేసాడా ఏంటీ?

 4. వీడితో ఆరు – అదే బట్టతలలు. ఇక్కడ టెన్షన్‌తో జుట్టు పీక్కోని బట్టతలైన వాళ్ళను లెక్కెయ్యలేదు..!!

 5. krishna says:

  13 masters degrees..
  excellent …
  tickling funnybones.

 6. Jyothi Reddy says:

  haha AAA kireetam ramana rao 13 Masters eee Japan Bava ayyundali!!!!!!!!!!!!!lol
  loads of fun muraligaru keep goin pls…

 7. prasad says:

  Supurb comedy
  meru apara jandhyala
  Ramana Rao nu character chudagane naku “ATHADU” movie lo M.S Narayana Dosa seen lo sunil nu adigina vidham gurtuku vachhinadi
  Excellent comedy
  Are you the same murali whom i saw in singapore “me mirthrudu murali”

  Prasad

 8. Murali says:

  బాపు, జ్యోతి, అరుణ్ గారూ,

  రమణరావు జపాన్ బావ అయ్యే అవకాశం లేదు. కథ ప్రకారం జపాన్ బావకు 26 లేదా 27 ఏళ్ళో ఉంటాయి. పదమూడు మాస్టర్స్ చేయాలంటే అధమ పక్షం 20 ఏళ్ళు పడుతుంది.

  అరిపిరాల గారూ,

  కథ చదివి టెన్షన్ పడి జుత్తు పీక్కోవడం ఏంటండీ బాబూ! మీరు మరీనూ!

  Prasad,

  Thanks! No, I am not the Murali you saw in Singapore. 🙂

  -మురళి

 9. Jyothi Reddy says:

  Muraligaru,
  Ounu nijamey Japan bava 13 masters chesey chance ledhu..haha,Thanks for the clarification and waiting for 29th episode….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s