మదర్ తెరీమా – 1


“ఇది విన్నారా, శంకర్రావు గారు, మదర్ తెరీమాకి sainthood ఇస్తారట,” ఆనందంగా చెప్పారు, కేశవరావు గారు, ఆయన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

“ఓహో, దానికి మీరెందుకు అంత మురిసిపోతున్నారు?” అడిగారు శంకర్రావు గారు, తన కళ్ళ జోడు తీసి తుడుచుకుంటూ.

“అదేంటండి, దేశం కాని మన దేశానికి వచ్చి, ఇక్కడే స్థిర పడిపోయి, అభాగ్యులకు, అనాధలకు సేవ చేసిన దొడ్డ మనిషి. ఆమెకి sainthood రావడం, జంబూ ద్వీపానికి, అదే మన హిండియాకే గర్వ కారణం కద. అసలే ఈ మధ్య పేపర్‌లో ఎక్కడ చూసినా మనసు నొప్పించే వార్తలే. ఈ మధ్య కాలంలో ఇదొకటే మంచి వార్త,” కాస్త అసహనంగా బదులిచ్చారు కేశవరావు గారు.

“అసలావిడ ఏం సేవలు చేసిందో మీకు సరిగ్గా తెలుసా, సార్?” అడిగారు శంకర్రావు గారు.

“అంటే చావుకి దగ్గర ఉన్న వాళ్ళని చేరదీయడం, కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకు ఆశ్రయం కలిపించడం, ఇంకా ఎయిడ్స్ పేషెంట్స్‌కి ఒక నీడ కల్పించడం, ఇలాంటివి అన్నీ చేసింది కదండి?”

“నిజమే, ఆశ్రయం ఇచ్చింది. ఆ పైన?”

“ఆ పైన, ఇంకేం చేయాలి?” చిరాకు ధ్వనించింది కేశవరావు గారి గొంతులో.

“వారిని బాగు కూడా చేయాలి కద?”

“చేసే ఉంటుంది సార్. నాకు డిటెయిల్స్ సరిగ్గా తెలీవు అనుకోండి.”

“చేసి ఉంటే బాగుండేది, కాని అలా జరగ లేదు. ఆవిడ వారిని చేరదీసిన ముఖ్య కారణం, వాళ్ళు గౌరవ ప్రదంగా చనిపోవడానికి.”

“గౌరవ ప్రదంగా చనిపోవడానికా? అదేంటి?”

“అంటే రోడ్ల మీద దిక్కు లేని చావు చావకుండా, తమను ప్రేమించే వారి మధ్య చనిపోవడం అన్న మాట.”

“ఎవరు ప్రేమిస్తారు?”

“అదే, మదర్ తెరీమా, ఇంకా ఆవిడ శిష్యురాళ్ళు.”

“ఓహో, ఇదేదో కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనుకోండి. కానీ ఒక రకంగా ఇది కూడా మంచి పనే కద! ఎలాగూ చావు తప్పని వాళ్ళకి అలాంటి మంచి చావు కల్పించడం.”

“అందులో కొందరు మాత్రమే అలాంటి వారు. చాలా మంది బతికే అవకాశం ఉన్న వారే. వారిని కూడా బ్రతికించ లేదు.”

“అంటే, దానికి బోలెడు డబ్బులు కావాలి కదండి!”

“మదర్ తెరీమాకి డబ్బుల కొదవ లేదు. మీలాంటి చాల మంది, ఆవిడ స్వయాన దేవుని అవతారం అని నమ్మి, బోలెడు విరాళాలు ఇచ్చారు. కానీ అవీ చేరాల్సిన వారికి చేరలేదు. అసలు మదర్ వాటిలోంచి ఒక పైసా కూడా తీసేది కాదు. ఆవిడ దగ్గర ఎన్నో సంవత్సరాలు పని చేసి, ఆవిడతో ఎంతో సన్నిహితంగా మెలిగిన Susan Shields చెప్పడం బట్టి, విరాళాలు తీసుకోవడం వరకే మదర్ సంస్థలో పని చేసిన వారి బాధ్యత. ఆ తరువాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలీదు.” (Former Catholic Nun says Mother Teresa is a fraud!)

Advertisements
This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

7 Responses to మదర్ తెరీమా – 1

 1. kinghari010 says:

  “చాలా మంది బతికే అవకాశం ఉన్న వారే. వారిని కూడా బ్రతికించ లేదు.” – నమ్మలేకుండా ఉన్నాను,ఎంత ఘోరం?!

 2. very needed attempt. I started writing some stuff in these lines, but lost that copy some time ago. wish u explain the realty to the telugu readers. Small doubt – is this fit for Atukula Bonta Category? the first part has almost zero scope for satire.

  • Murali says:

   I wanted this post to be written in a dialogue mode. Atukula bomta already offers that framework. So, why not use it? 🙂

   As to this not being a satire, what can be more satirical than bestowing Sainthood on a nun who was responsible directly or indirectly for scores of deaths when the money donated by her blind believers rotted in her bank accounts?

 3. Zilebi says:

  ఆయ్ ! మా మదరు మీద ఇన్నేసి అభాండాలా !

  మా కలకత్తా దేవత
  మీకట్లా యేలనోయి మింగుడు పడదూ 🙂
  బాకా ఊదగ దండిగ
  కాకా బట్టగ జిలేబి కాగల రోయీ 🙂

  జిలేబి

  • Murali says:

   కావలసిన దాని కంటే కాస్త ఎక్కువే మింగుడు పడింది. 🙂

 4. Chiru says:

  >>మా కలకత్తా దేవత

  ముక్కోటి దేవతల్లో ఈమె ఎన్నొదేవతో?? మనకెందుకు.. ఇంత మందిని పూజించే మనకు ఈమె ఎక్కువైపొయిందా.. ఈ దేవతని కూడా మంచి చేసుకోవాలి. తియ్యండ్రా వీభూది, ప్రసాదాలు.. చెయ్యండ్రా వ్రతాలు, పూజలు.. బాబ్బాబ్బూ… ఆ పూజారి పోష్టు నాకే ఇప్పిద్దురూ.. రెస్పెక్టుకు రెస్పెక్టూ, డబ్బుకు డబ్బూ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s