“బేర్” హాస్పిటల్

త్రిలింగదేశం రాజధాని ఆదరా బాదరాలో బేర్ హాస్పిటల్ అనే పెద్ద ఆసుపత్రి ఉంది. ఆ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే కాస్త “బేరు”మంటే చాలు ఆ హాస్పిటల్ వాళ్ళు పిలవని పేరంటంగా వచ్చి వాళ్ళని యాంబులెన్సులో తీసుకుని వెళ్ళిపోతారు.

ఒక చికిత్స మాత్రమే కాదు, మిగతా అన్ని విషయాలూ వాళ్ళే చూసుకుంటారు. అన్ని విషయాలు అంటే ఏంటో చదువుతూంటే మీకే తెలుస్తుంది.

“బేర్” హాస్పిటల్ డైరెక్టర్ దోమరాజు ఆ రోజు పొద్దున్నే పేపర్ చదువుకుంటున్నాడు. పేపర్లో ఒక వార్త ఆయన్ని ఆకర్షించింది. ఉత్సాహంగా విజిల్ వేశాడు.

“చీ పాడు! వయసు మీద పడ్డా మీకు కుర్రతనం పోలేదు. నేనెంత అందంగా ఉంటే మాత్రం అలా విజిల్ వేయడమేనా?” సిగ్గు పడింది ఆయన సెక్రెటరీ.

“నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోకు. నేను విజిల్ వేసింది నీ అందాన్ని చూసి కాదు. ఈ న్యూస్ చదివి. ‘పథ్యం’ కంపెనీ యజమాని కృష్ణ దొంగ రాజు తాను ఇంత కాలం కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ని గోల్‌మాల్ చేస్తున్నాను అని ఒప్పుకున్నాడట,” చెప్పాడు దోమరాజు.

“ఓ! అదా! అయినా ఆయనకి పోయే కాలం వస్తే మీకెందుకు సంబరం,” మూతి ముడిచింది సెక్రెటరీ.

“ఎందుకంటే ఏం చెప్పను? ఏమిటంటే ఎలా చెప్పను?” అని పాడుతూ స్టెప్స్ వేయడం మొదలు పెట్టాడు దోమరాజు. “అదుగో మళ్ళీ ఆకతాయి వేషాలు,” కాస్త భయంగా అంది ఆయన సెక్రెటరీ.

“ఎహె! నువ్వాగు. మన హాస్పిటల్‌కి మంచి గిరాకి రాబోతూందని నేనానందిస్తూంటే నీ గోలేంటి మధ్యలో?” విసుక్కున్నాడు దోమరాజు.

“మంచి గిరాకా?” అయోమయంగా చూసింది సెక్రెటరీ.

“అవును. నువ్వెంటనే వెళ్ళి ఒక ఏ/సీ రూం తయారు చేయించు. మన స్టార్ పేషెంట్స్‌కి ఉండే అన్ని సౌకర్యాలు అందులో ఉండేలా చూడు,” పురమాయించాడు దోమరాజు.

“ఎవరి కోసం ఈ రూం?” ఆశ్చర్యంగా అడిగింది సెక్రెటరీ.

“ఇంకెవరికోసం? మన కృష్ణ దొంగ రాజు గారు త్వరలో రాబోతున్నారు ఈ హాపిటల్‌కి. ఆయన కోసం,” చెప్పాడు దోమరాజు.

“ఆయన ఇక్కడికెందుకు వస్తాడు? జైల్‌కి పోతాడు కాని?”

“అందుకే నువ్వు సెక్రెటరీవీ, నేను డైరెక్టర్‌ని. ఒక్క సారి గతం గుర్తు తెచ్చుకో. ఇలాంటి ప్రముఖులు ఇబ్బందుల్లో పడినప్పుడు ఏం జరిగిందో?” నవ్వుతూ అన్నాడు దోమరాజు.

ఒక్కసారి వెలిగింది సెక్రెటరీకి. ప్రముఖ నటుడు బుజ్జి కృష్ణ తన జ్యోతిష్కుడిని కాల్చినప్పుడు బేర్ హాస్పిటల్‌లోనే జాయిన్ అయ్యాడు. అలానే బుద్ధార్థ అనే అబ్బాయి తన ప్రేయసి ప్రతిసంధ్యకు విషం పెట్టాక కూడా ఆవిడని తీసుకుని బేర్ హాస్పిటల్‌కే వచ్చాడు. ఇలా ఎందరెందరో.

“అంటే మీరనేది…” అని ఆమె అంటూండగానే, “యువ్ ఆర్ రైట్! త్వరలో కృష్ణ దొంగ రాజు కూడా ఇక్కడికే వచ్చేస్తారు,” ఆమె వాక్యాన్ని ముగించాడు దోమరాజు.

ట్రింగ్ ట్రింగ్ మంటూ ఫోను మోగింది. ఫోనెత్తి కాసేపు మాట్లాడాడు దోమరాజు. “నేను చెప్పలా, పోలీసులు అరెస్టు చేయగానే కృష్ణ దొంగ రాజు గారికి గుండె పోటొచ్చిందట. మనలని యాబులెన్స్ పంపమంటున్నారు,” ఉత్సాహంగా చెప్పాడు.

రూం రెడీ చేయడానికి బయలుదేరింది సెక్రెటరీ.

***

కొద్ది నిముషాల్లో పేషెంటుని తీసుకుని యాంబులెన్స్ వచ్చేసింది. స్ట్రెచర్ మీద కృష్ణ దొంగ రాజుని మోసుకుని లోపలకు తెచ్చేశారు బేర్ హాస్పిటల్ ఉద్యోగులు. అంతా స్వయంగా దోమరాజే చూసుకుంటున్నాడు.

“మీరు మొహమాట పడకుండా చెప్పండి సార్! ఏవన్నా ఆధారాలు నాశనం చేయాలా? రక్తం మరకలు అంటుకుని ఉన్న బట్టలు గట్రా ఉన్నాయా? ఉంటే ఇవ్వండి. తగలబెట్టేస్తాం” అడిగాడు దోమరాజు, కృష్ణ దొంగ రాజుతో.

“మర్డర్లు చేసి రావడానికి నేనేమన్నా బుజ్జి కృష్ణనో, బుద్ధార్థనో అనుకున్నావా? డిస్ట్రాయ్ చేయాల్సినవి ఆల్‌రెడీ చేసే వచ్చాను,” చిరాకుగా అన్నాడు కృష్ణ దొంగ రాజు.

“సారీ! అలవాటు ప్రకారం అడిగేశా. మరి మీకేం కావాలో చెప్పండి,” వినయంగా అన్నాడు దోమరాజు.

“నాకు బోలెడు పని ఉంది. ఇంటర్‌నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. నా పెర్సనల్ అసిస్టెంటుకి నా రూం పక్కనే ఇంకో రూం బుక్ చేయండి…” చక చకా తనకు కావల్సింది చెప్పాడు కృష్ణ దొంగ రాజు.

***

ఇది ఇలా ఉండగా, విలేఖరులు ఈ విషయం పై రాజకీయ నాయకుల అభిప్రాయాలు కనుక్కోవడానికి బయలుదేరారు.

వై.నో. రాజశేఖర్ రెడ్డి, సూర్య బాబు నాయుడు ముందుగానే జాగ్రత్త పడి తమ ఆఫీసుల్లో, కృష్ణ దొంగ రాజుతో తాము కలిసి దిగి ఉన్న పాత ఫోటోలను దాచేశారు. కాని ఆర్థిక మంత్రి మోసయ్యకు అంత అవకాశం దొరకలేదు. విలేఖరులు అప్పటికే ఆయన ఆఫీసులో జొరబడ్డారు.

“పథ్యం కంపెనీ సంఘటనపై మీ అభిప్రాయం,” ఒక విలేఖరి మోసయ్యని అడిగాడు.

“తెలుగు వాడినైనందుకు సిగ్గు పడుతున్నాను,” బాధగా చెప్పాడు మోసయ్య.

“కృష్ణ దొంగ రాజు తెలుగు వాడు కావడమేనా దానికి కారణం?” సానుభూతిగా అన్నాడు ఆ విలేఖరి.

“కాదు. మీరొచ్చేంతలోపల నేను ఆయనతో దిగి ఉన్న ఫోటోలను దాచలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను,” సమాధానమిచ్చాడు ఆయన.

This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

37 Responses to “బేర్” హాస్పిటల్

  1. Amun says:

    “కాదు. మీరొచ్చేంతలోపల నేను ఆయనతో దిగి ఉన్న ఫోటోలను దాచలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను,” సమాధానమిచ్చాడు ఆయన.

    ha ha ha,,,, nice ending

  2. గురువు గారు మీ స్టైల్ లో కుమ్మేసారు ! :))

  3. Sravya says:

    ha ha ha 🙂

  4. tejashreyus says:

    the last line is superb

  5. బేర్ హాస్పిటల్! హహ్హహ్హా

  6. భలే ఉంది. మున్ముందు మీరు ఇలాంటివి చాలా రాయడానికి తగినంత ముడి సరుకు హైదరాబాద్ నగరంలో బోలెడంత దొరుకుతుంది.

  7. chavakiran says:

    బాగుందండి.

    అన్నట్టు మా మేనకోడలు హైదరాబాద్ అనమంటే – అయ్యో బాదు – అంటుంది. 🙂 మరి తలిసి అంటుందో తెలీక అంటుందో.

    మీ అదర బాదర చూశాక గుర్తు వచ్చింది.

  8. Bhaskar says:

    చాలా బాగా రాశారు. నిన్న రాత్రి ఇదే మాట మాట్లడు కొన్నాం. ఈ రొజు ఈ సంగతి TV90 తొ వస్తుంది చూడండి..

  9. Karthik says:

    మహానుభావా!!
    మీకు ఎలా వస్తాయండి ఈ అవిడియాలు??? వై.నొ.,బుజ్జి కృష్ణ అదుర్స్!!
    హ హ హ
    -కార్తీక్

  10. varudhini says:

    హహ్హహ్హా…సూపర్.

  11. Amma Odi says:

    చాలా బాగా చెప్పారు.

  12. shivaspeaks says:

    🙂

  13. Madhuravani says:

    supero super..!! 🙂

  14. ఎప్పటిలాగే టపా కేక. చాలా రోజుల తర్వాత మీ దగ్గర నుంచి త్రిలింగదేశపు విశేషాలు వింటున్నాం.

  15. “కాదు. మీరొచ్చేంతలోపల నేను ఆయనతో దిగి ఉన్న ఫోటోలను దాచలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను,” సమాధానమిచ్చాడు ఆయన.

    ha ha ha !

  16. Narsinghrao says:

    your “Bare hospital” simply superb

  17. name says:

    Good one!

  18. laxmi says:

    Bitter truth 😦

  19. Ratna says:

    Murali Garu,

    Good Morning,

    The write up is simply superb.

    Thanks and Regards
    Ratna
    Singapore

  20. aparna says:

    article chala bavundi, chala navvu theppichindi.
    anni ardam ayyayi kaani, doma raju ante evarini uddeshincho ardam kaledu?
    anyways superb write-up

  21. Murali says:

    అపర్ణ గారు,

    దోమరోజు ఎవరూ అని అడిగితే నేను కూడా “ఎవరంటే ఏం చెప్పాను, ఏమిటంటే ఎలా చెప్పాను,” అని పాడాల్సి వస్తుంది. ఐనా కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు లెండి. 🙂

    కార్తీక్ గారు,

    వై.నో. మాత్రం నా ఐడియా కాదు. ఈటీవీ సుమ ఒక సారి ఇలా ప్యారడీ చేశారు.

    కిరణ్ గారు,

    అయ్యొ బాదు ప్రయోగం బాగుంది.

    -మురళి

  22. aparna says:

    murali garu
    good morning. domaru raju evaro ardam ayyindi.
    ilantivi chadivi anna vallu realise avuthara?

  23. Murali says:

    అపర్ణ గారు,

    నేను ఆశించేది ప్రజల్లో రియలైజేషన్. అదంటూ వస్తే అన్ని పై లెవెల్స్‌లోనూ ఆటోమేటిక్‌గా మార్పు వస్తుంది.

    -మురళి

  24. Sandeep says:

    Really Superbbb…

  25. Satish says:

    nice irony…gud one…. 🙂

  26. aparna says:

    murali garu
    meeru annadi correct e. nijanga andari lo alanti realization vaste bavundu,kani enta mandi ee rojullo alanti konam loninchi alochistunnaru.evari selfishness vallu choosukuntunnari.sorry mimmalni discourage cheyyalani kaadu,just telling about people’s attitude. ilanti spruha undadam nijanga chala nacchindi.keep going and gud luck

  27. venkat chilla says:

    చాలా చాలా బాగుంది. అదుర్స్

  28. kiran tummala says:

    Hi Murali,

    I have read all your stories posted in this Blog.

    అమెరికాలో ఆపసోపాలు, కథలు, కబుర్లు, నాటికలు, పాతికం, బట్టతల, India, Senior. Im a very big fan of your posts. I always eagerly wait for your next stories. Thank you for sharing healthy comedy with moral. Thanks again and please keep writing more and more…

  29. prasad says:

    Excellent

    Comedy ga cheppina It is True

  30. Jyothi Reddy says:

    Murali Garu,
    chala rojula tharuvatha meeloo maroo Thrivikram Sreenivas garini chusanu,
    Really worth of reading your posts,Meeru cheppinattu kondaraina marithey mana samajam dhanikadhey maruthundhi ani nenu nammuthanu..
    Great post sir and Really good thing is the name of Hospital Bare and the city name Adhara badhara….Meeru rasthooney undandi sir.

Leave a comment